2025 Suzuki Access 125: 2025 సుజుకి యాక్సెస్‌ కెవ్వుకేక.. ఫీచర్లు తెలిస్తే కచ్చితంగా దీనిని కొంటారు!

భారత్‌ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో (Bharat Mobility Auto Expo 2025)లో సుజుకి మోటార్‌సైకిల్స్‌ యాక్సెస్ 125 2025 (2025 Suzuki Access) వెర్షన్‌ స్కూటర్‌ని విడుదల చేసింది. ఈ సరికొత్త స్కూటర్‌ క్రేజీ లుక్‌తో పాటు, భారీ ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని ధరను రూ .81,700 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్, స్పెషల్, రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్‌ మంచి సేల్స్‌ని రాబడుతుందని కంపెనీ భావిస్తోంది. దీని రాకతో సేల్స్‌ మరింత పెరిగే అవకాశాలు లేకపోదు. ఈ సరికొత్త అడ్‌డేటెడ్‌ వెర్షన్‌ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

ఈ సుజుకి యాక్సెస్ 125 స్ట్రాంగ్‌ 125 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీనిని OBD 2 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఇంజిన్‌ 8.3 bhp వద్ద 10.2 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ 2025 అప్‌గ్రేడెడ్‌ మైలేజీని పెంచడమే కాకుండా, ఫ్యూయెల్‌ ట్యాంక్ పరిమాణం పెంపుతో కూడా వస్తుంది. దీనివల్ల రైడర్లు రీఫిల్ అవసరమయ్యే ముందు ఎక్కువ దూరం ప్రయాణించగలగుతుంది.

2025 Suzuki Access 125 Launch in Auto Expo

ఇది దాని మునుపటి వెర్షన్ కంటే భారీ అప్‌గ్రేడ్స్‌తో వస్తుందని చెప్పవచ్చు. కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు దీనిని ఎంచుకోవచ్చు. ఈ కొత్త సుజుకి యాక్సెస్‌ 125కి డిజైన్‌ని ప్రధాన ఆకర్షణ చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో పూర్తి రీ డిజైన్డ్‌ వెర్షన్‌గా వస్తుంది. ఇందులో LED హెడ్‌లైట్స్‌, షార్ప్‌ సైడ్ ప్యానెల్స్ కలవు. ఇది మొత్తం స్కూటర్‌ లుక్‌ని మార్చి వేస్తుంది.

ఈ స్కూటర్ బ్యాక్ ఎండ్ సైతం మరింత ఆకర్షణీయమైన లుక్‌తో రీడిజైన్ చేశారు. ఇక ఇందులో రైడర్ సౌలభ్యం కోసం ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్ ఫిల్లర్, ఎక్స్‌టీరియర్‌లో ఎక్కువ స్టోరేజ్ కోసం డ్యూయల్ ఫ్రంట్ పాకెట్స్‌, కంఫర్ట్‌ కోసం పొడవాటి సీటు, భారీ అండర్-సీట్ స్టోరేజ్ వంటివి కలవు. ఇందులో పాస్ స్విచ్, రియర్ బ్రేక్ లాక్, హజార్డ్ స్విచ్ వంటి అనేక ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్నాయి.

2025 Suzuki Access Price

ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌ బ్లూటూత్-ఎనేబుల్డ్ ఇన్‌మెంట్ క్లస్టర్‌తో వస్తుంది. ఈ ఫీచర్ రైడర్‌ని కనెక్ట్ చేయడమే కాకుండా.. రెయిన్ అలర్ట్స్‌, ఫ్యూయెల్‌ ఇండికేటర్‌ వంటి అలర్ట్స్‌ని సూచిస్తుంది. ఇది డిజిటల్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ పాస్ స్విచ్, రియర్ బ్రేక్ లాక్, హజార్డ్ లైట్ స్విచ్ ద్వారా సేఫ్టీని చేయడం ద్వారా ఆధునిక రైడర్ల అవసరాలను తీర్చడంలో సుజుకి అంకితభావం హైలైట్ చేస్తుంది.

ఈ 2025 సుజుకి యాక్సెస్ 125 మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2, సాలిడ్ ఐస్ గ్రీన్, పర్ల్ షైనీ బీజ్ వంటి కలర్‌ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులోని ఇంజిన్ పనితీరు, రిఫ్రెష్డ్ డిజైన్, అధునాతన ఫీచర్లు స్కూటర్‌ ప్రేమికులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. కొత్తగా స్కూటర్‌ కొనేవారు కళ్లుమూసుకుని దీనిని ట్రై చేయవచ్చు.

2025 Suzuki Access 125 Features

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, January 17, 2025, 19:03 [IST]
English summary
2025 suzuki access 125 launched in auto expo 2025 check price and feature details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+