సుజుకి నుంచి అప్‌డేటెడ్ స్కూటర్ వచ్చేసింది.. అట్రాక్టివ్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో, అందరికీ అందుబాటు ధరలో
భారత ఆటో మొబైల్ రంగంలో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. పేరు ఎంతో విశిష్టమైనది. దీని గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తమ వాహనాలతో గల్లీ నుంచి దిల్లీ దాకా అందరికీ చేరువైంది. ఈ సంస్థ నుంచి వచ్చే కొత్త వాహనాల కోసం వినియోగదారులు ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తారో ప్రత్యర్థి సంస్థలు కూడా అంతే స్థాయిలో ఆసక్తి ప్రదర్శిస్తాయి. ఈ సంస్థ ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో... తమ కొత్త టూ- వీలర్ మోడల్స్‌తో మెరిసింది. సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌ను అప్‌డేటెడ్ వెర్షన్‌లో లాంఛ్ చేసింది. ఈ కొత్త స్కూటర్‌ను అట్రాక్టివ్ డిజైన్‌తో, అడ్వాన్స్ డ్ ఫీచర్లు జోడించి తీసుకువచ్చింది. దీని ధర, మైలేజీ, పర్ఫార్మెన్స్ తదితర వివరాలపై ఓ లుక్కేయండి.
డిజైన్: ఈ స్కూటర్‌ను మోడర్న్ డిజైన్‌తో తీసుకువచ్చింది సుజుకి సంస్థ. దీనికి LED హెడ్‌లైట్‌ను కొత్తగా అమర్చారు. దాంతో పాటు వెనుకవైపు కూడా LED టెయిల్‌ల్యాంప్ ఉంటుంది. ఈ స్కూటర్ Metallic Matte Stellar Blue, Pearl Grey White, Metallic Matte Black, Solid Ice Green, Pearl Shiny Beige అనే ఐదు రంగుల్లో లభిస్తుంది.

పర్ఫార్మెన్స్ & మైలేజీ: ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌ను పవర్ ఫుల్ పవర్‌ట్రెయిన్‌తో రూపొందించారు. ఇందులో 125 సీసీ సింగిల్- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.3 bhp హార్స్‌పవర్, 10.2 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 45 కి.మీ.ల మైలేజీ అందించనున్నట్లు తెలుస్తోంది.
ఫీచర్లు: డజన్ల కొద్దీ అట్రాక్టివ్ ఫీచర్లను జోడించి ఈ కొత్త స్కూటర్‌ను తీసుకువచ్చారు. ఇది యూత్‌ను ఎక్కువగా ఆకర్షిస్తుందని చెప్పాలి. దీంట్లో డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దాంతోపాటు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై- టర్న్ నేవిగేషన్, కాల్స్/SMS అలర్ట్స్, రెయిన్ అలర్ట్స్, క్యాలెండర్ అలర్ట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

సస్పెన్షన్ సెటప్ & బ్రేకింగ్ సెటప్: ఈ కొత్త స్కూటర్ ముందు వైపు టెలిస్పోపిక్ ఫోర్క్‌తో ఉంటుంది. వెనుకవైపు సింగిల్ షాక్ అబ్సార్బర్ ఉంటుంది. వెనుక వైపు డిస్క్, డ్రమ్ బ్రేక్ ఆప్షన్ తో ఉంటుంది. ఇది రైడర్‌కు సేఫ్టీ అందిస్తుంది. అందువల్ల సస్పెన్షన్ సెటప్‌లో హోండా యాక్టివాతో సమానంగా ఉంటుంది.
ఈ సుజుకి యాక్సెస్ 125 కొత్త స్కూటర్‌కు టీవీఎస్ జూపిటర్ 125, హోండా యాక్టివా 125 స్కూటర్లు గట్టి పోటీనిస్తాయని చెప్పవచ్చు. అట్రాక్టివ్ డిజైన్, ఫీచర్లతో తీసుకువచ్చిన ఈ సుజుకి కొత్త స్కూటర్.. పురుషులతో పాటు స్త్రీలు కూడా వినియోగించేందుకు అనువుగా ఉంటుంది. అయితే.. ఇది వినియోగదారులను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది కొన్ని రోజులు గడిస్తేగానీ చెప్పలేం.

ధర ఎంతంటే: ఈ సుజుకి యాక్సెస్ 125 కొత్త మోడల్‌ను అందుబాటు ధరలో లాంఛ్ చేశారనే చెప్పొచ్చు. దీని ధర రూ.81,700 (ఎక్స్- షోరూమ్)గా ఉంది. ఇది స్టాండర్డ్, స్పెషల్, రైడ్ కనెక్ట్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కొత్తగా స్కూటర్‌ని కొనేవారు దీనిని ఎంచుకోవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








