2025 Apache RTR 160 అదిరిపోయింది.. యువత కోసం స్పోర్టీ అప్‌డేట్, సూపర్ సేఫ్టీ, స్టైలిష్ డిజైన్

భారతదేశంలోని ప్రముఖ టూవీలర్ వాహన బ్రాండ్ అయిన టీవీఎస్ మోటార్ (Tvs Motor) నుంచి వచ్చిన ప్రసిద్ధ బైక్ అపాచీ అంటే ఎంతో ఫేమస్. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన సౌండ్‌తో ఈ సిరీస్ బైక్‌ప్రియుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. టీవీఎస్ మోటార్ తరచూ అపాచీ సిరీస్‌కి కొత్తదనాన్ని తీసుకొస్తూ, అత్యాధునిక సాంకేతికతను పరిచయం చేస్తోంది. తాజాగా, ఈ కంపెనీ 2025 అపాచీ ఆర్‌టిఆర్ 160 (Apache Rtr 160) మోడల్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధర వచ్చేసి రూ. 1,34,320 (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్, పాత మోడల్‌ లోని టాప్-ఎండ్ రేసింగ్ ఎడిషన్ కంటే సుమారు నాలుగు వేల రూపాయలు ఎక్కువ ధర కలిగి ఉంది. అయితే, ఈ పెరిగిన ప్రతి రూపాయికి సమర్థమైన పనితీరును అందిస్తుందని చెప్పవచ్చు.

2025 మోడల్‌లో కొత్తగా పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో కీలకమైనది డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వ్యవస్థ. ఇది అపాచీ RTR 160లో తొలిసారి అందుబాటులోకి వస్తోంది. దాని సాయంతో అత్యవసర పరిస్థితుల్లో వేగంగా బ్రేక్ వేసినప్పుడు కూడా వాహనంపై పూర్తి కంట్రోలింగ్ కలిగించడమే కాకుండా, వర్షపు రోడ్లపై సురక్షితంగా నిలవడానికి సహాయపడుతుంది. ఈ సాంకేతికత రైడింగ్ అనుభూతిని మరింత ధైర్యవంతంగా, విశ్వసనీయంగా మార్చుతుంది.

2025 Tvs Apache Rtr 160

అదనంగా, ఈ బైక్‌కి OBD2B ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అత్యాధునిక ఇంజిన్ అమర్చారు. ఇది కాలుష్య ఉద్గార నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, బైక్ కండిషన్, పనితీరును విశ్లేషించడానికి అవసరమైన సాంకేతికతను అందిస్తుంది. ఈ విధంగా, 2025 అపాచీ RTR 160 ఆధునికత, రైడర్‌కు ఇచ్చే భద్రతను కలిగిన ఒక ప్రీమియం బైకుగా నిలుస్తోంది. ఇది 159.7cc ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది.

ఇంజిన్ 8,750 rpm వద్ద 15.81 bhp పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, 7,000 rpm వద్ద ఇది 13.85 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి, ప్రతి గేర్‌షిఫ్టును సాఫీగా అనుభవించేలా చేస్తుంది. వాస్తవానికి, ఈ బైక్‌కి ఈ విభాగంలో అత్యుత్తమ పవర్-టు-వెయిట్ నిష్పత్తి ఉన్నది. దీని ద్వారా TVS Apache సిరీస్ రేసింగ్ వారసత్వం ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది.

డిజైన్ పరంగా కూడా కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. 2025 అపాచీ RTR 160 బైక్‌కు స్పోర్టీ శైలి కోసం కొత్త గ్రాఫిక్స్, కలర్స్ ఇచ్చారు. ముఖ్యంగా, మ్యాట్ బ్లాక్, పెర్ల్ వైట్ కలర్ వేరియంట్లలో ఇది అందుబాటులోకి వచ్చి, ఆకర్షణీయమైన ఎరుపు అల్లాయ్ వీల్స్‌తో మరింత స్టైలిష్‌గానే కాకుండా ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొత్త అల్లాయ్ వీల్స్ 2025 మోడల్‌కు స్పోర్టీనెస్‌ను జోడిస్తూ దానికి విశేషమైన రోడ్ ప్రెజెన్స్‌ని అందిస్తాయి.

2025 అపాచీ RTR 160 బైక్‌లో స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మోడ్‌లు రైడింగ్‌కి తగిన విధంగా ఉన్నాయి. ఉదాహరణకు, స్పోర్ట్ మోడ్‌లో ఎక్కువ శక్తి, వేగం లభిస్తే, రెయిన్ మోడ్ తడి రోడ్లపై అదుపును మరింత బలోపేతం చేస్తుంది. ఇంకా, ఈ బైక్‌కి బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TVS SmartXonnect టెక్నాలజీ అందించడం వల్ల రైడర్ స్మార్ట్‌ఫోన్‌కి బైక్‌ను జతచేసి నావిగేషన్, కాల్ అలర్ట్స్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.

వాయిస్ అసిస్టెంట్ వ్యవస్థ బైక్ కొన్ని ముఖ్యమైన ఫంక్షన్లను కేవలం వాయిస్ ద్వారా నిర్వహించడానికి అవకాశం ఇస్తుంది. సౌకర్యవంతమైన రైడింగ్ కోసం బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, గ్యాస్-చార్జ్డ్ రియర్ షాక్ అబ్జార్బర్‌లతో సస్పెండ్ అయిన డబుల్ క్రేడిల్ ఫ్రేమ్‌కి తోడుగా రాబోతోంది. అపాచీ RTR 160 ఒక తేలికపాటి బైక్ కూడా. దీని కెర్బ్ బరువు కేవలం 137 కిలోలే. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు.

More from DriveSpark

Article Published On: Saturday, June 28, 2025, 7:07 [IST]
English summary
2025 tvs apache rtr 160 updated model launched in india at rs 1 34 lakh
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+