ఫుల్ ట్యాంక్‌తో 686 కి.మీలు.. రూ.79 వేలకే కొత్త స్ప్లెండర్ ప్లస్.. లెజెండరీ బైక్ కొత్తగా వచ్చేసింది..!
ఇండియాలో పేద, మధ్య తరగతి, ధనవంతులకు అని ప్రతి ఒక్కరికి బాగా ఇష్టమైన బైక్ ఏదంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది హీరో స్ప్లెండర్ (hero splendor). ఎంతోకాలంగా భారత రోడ్లపై తన దూకుడు చూపించిన ఈ బైక్, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్‌గా నిలుస్తోంది. ఇది ఓ సాధారణ బైక్ కాదు, ప్రతి ఇంట్లోనూ కనిపించే ఒక భావోద్వేగం. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించడం దీని ప్రత్యేకత పైగా పనితీరును విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. నిత్య జీవితంలో ఆఫీసు వెళ్తున్నా, ఊర్లో తిరుగుతున్నా, లేదా దూర ప్రయాణాలకైనా ఇది కలిసొచ్చే మిత్రుడే. మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను సైతం సవాల్ చేసే స్థాయిలో ఉంది.
భారతదేశ ప్రిసద్ధ బైక్ ఇప్పుడు కొత్త మార్పులతో వచ్చింది. 2025 సంవత్సరానికి తగినట్లు అప్‌డేట్ అయిన కొత్త స్ప్లెండర్‌ను హీరో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ XTEC స్ప్లెండర్ ప్లస్ XTEC 2.0 అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. కొత్త మోడళ్లలో మునుపటి వెర్షన్‌తో పోలిస్తే పెద్ద మార్పులు కనిపించకపోయినప్పటికి ప్రస్తుత కాలానికి అనుగుణంగా స్వల్పంగా మాత్రం మార్పులు కనిపిస్తాయి.

ధర విషయానికి వస్తే, బేస్ వేరియంట్ అయిన స్ప్లెండర్ ప్లస్ డ్రమ్ మోడల్ ధర రూ. 79,096 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. స్ప్లెండర్ ప్లస్ i3S వేరియంట్ ధర రూ. 80,066గా ఉంది. ప్రత్యేకమైన బ్లాక్ అండ్ యాక్సెంట్ కలర్‌లో వచ్చే ఈ వేరియంట్‌కు కూడా అదే ధర ఉంటోంది. ఇంకా అధునాతన ఫీచర్లతో కూడిన స్ప్లెండర్ ప్లస్ XTEC డ్రమ్ మోడల్ ధర రూ. 82,751.
ఈ ధరలన్నీ కూడా ఎక్స్ షోరూమ్. పాత మోడల్‌తో పోలిస్తే స్వల్ప మార్పుల్లో మైలేజ్ మరింత పెరుగుతుంది, మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం వంటివి చూడవచ్చు. ఇంట్లో మొదటి బైక్‌గా కొనుగోలు చేసిన స్ప్లెండర్, ఇప్పుడు ఇంకా మెరిసిపోయేలా వస్తుంది. 2025 సంవత్సరానికి స్ప్లెండర్ ప్లస్ మోడల్స్‌లో హీరో క్లాసిక్ బైక్‌ను అధునాతన లుక్‌తో కనువిందు చేయనుంది. స్ప్లెండర్ ప్లస్ XTEC సిరీస్‌లో రెండు కీలక వేరియంట్లు ఇప్పుడు అందుబాటులో ఉంది.

XTEC డిస్క్ వెర్షన్ ధర రూ. 85,001, అలాగే XTEC 2.0 వెర్షన్‌కి కూడా అదే ధరను నిర్ణయించారు. ఈ రెండు వెర్షన్‌ల మధ్య తేడాల కోసం బాడీ ప్యానెల్‌లపై కొత్త గ్రాఫిక్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ గ్రాఫిక్స్ స్ప్లెండర్‌కు స్పోర్టీ లుక్ ఇవ్వడమే కాకుండా, 2024 మోడల్స్‌తో పోలిస్తే 2025 మోడల్స్‌ను ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇంజిన్ పరంగా కూడా 2025 స్ప్లెండర్ ప్లస్ మోడల్స్‌లో ఒక కీలక మార్పు జరిగింది.
OBD-2B ఎమిషన్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా, ఇంజిన్‌ను అప్‌డేట్ చేశారు. ఏప్రిల్ 1, 2025 తర్వాత అన్ని వాహనాలకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఉద్గార నిబంధనలను తప్పనిసరి చేయడంతో, హీరో తన మోడల్స్‌ను ముందుగానే సిద్ధం చేసింది. ఇది వాతావరణ అనుకూలత పరంగా ఒక గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు. ఈ బైక్‌లో 97.2 సీసీ సామర్థ్యం గల ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ SOHC 2-వాల్వ్ ఇంజిన్ కలిగి ఉంది.

ఇది 7.91 bhp పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఇంజిన్‌కు జత చేశారు. 9.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో కూడిన ఈ బైక్, సగటున లీటర్‌కు పెట్రోల్‌కు దాదాపు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఫుల్ ట్యాంక్ పెట్రోల్‌తో ఈ బైక్ 686 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.


Click it and Unblock the Notifications








