Yamaha కొత్త బడ్జెట్ బ్లాస్టర్ వచ్చేసింది.. అదిరిపోయే కలర్స్, ఫుల్ స్టైల్, ఫుల్ మైలేజ్, తక్కువ ధరలో లాంచ్

భారతదేశంలో టూవీలర్ విభాగంలో బాగా ప్రసిద్ధి చెందిన యమహా(Yamaha) చాలా ఏళ్లుగా కస్టమర్ల ఆదరాభిమానాలను పొందుతుంది. శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ఈ బ్రాండ్ అనేకమందిని త‌నవైపు ఆకర్షించుకుంది. ముఖ్యంగా యూత్‌లో యమహాకు ఒక ఫ్యాన్‌బేస్ ఉంది. ఇప్పటికే మార్కెట్లో పలు మోడళ్లతో ఆకట్టుకుంటున్న కంపెనీ 150cc విభాగంలో యమహా మళ్ళీ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. మంచి పేరు సంపాదించుకున్న FZ-S FI మోడల్ ఇప్పుడు కొత్తగా మరిన్ని అప్‌డేట్‌లతో విడుదల అయింది. 2025 Yamaha FZ-S FI మోడల్‌లో పలు ఆకర్షణీయమైన ఫీచర్లు, టెక్నాలజీ అప్‌డేట్‌లు ఉన్నాయి. మరింత స్టైలిష్‌గా మారిన ఈ బైక్, పాత మోడల్‌తో పోలిస్తే మరింత స్పోర్టీగా కనిపిస్తుంది.

యమహా FZ సిరీస్‌కు అంతగా ఆదరణ లభించడానికి కారణమైన అవే లుక్స్, నమ్మకమైన ఇంజిన్, అదిరిపోయే రైడింగ్ కంఫర్ట్ అన్నీకూడా ఈ మోడల్‌లో మరింత మెరుగయ్యాయి. మరో విషయం ఏమిటంటే FZ-S FI Ver 4.0 మోడల్‌ను యమహా ఇకపైన నిలిపివేస్తున్నట్లు సమాచారం. 2025 యమహా FZ-S FI ధర వచ్చేసి రూ.1,34,800(ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఇది వెర్షన్ 4.0 వెర్షన్ కంటే రూ.3,600 ఎక్కువ.

Yamaha Fz S Fi Launched In India With Updated Features

ఇంజిన్ పరంగా ఈ బైక్ ఇప్పుడు మరింత లేటెస్ట్‌గా మారింది. ప్రభుత్వం నిర్దేశించిన BS6 OBD2-B ఉద్గార నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఈ మోడల్‌ ఇంజిన్‌ను అప్‌గ్రేడ్ చేశారు. దీంతో ఇది పాత దానితో పోలిస్తే తక్కువ స్థాయిలో కాలుష్య ఉద్గారాలను విడుదల చేస్తుంది. పర్యావరణానికి మేలు కలిగించే అంశం అని చెప్పవచ్చు. ఇది 149cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, S-OHC 2V/Cyl ఇంజిన్‌తో రన్ అవుతుంది.

ఇది 12 bhp పవర్, 13.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజు వారి ప్రయాణాలు చేసే వారికి అనుగుణంగా ఉండేలా తయారు చేసిన ఈ బైక్ దాని స్టైలిష్ లుక్స్, పనితీరు వలన స్పోర్ట్స్ లవర్స్‌ను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇది మళ్లీ 150cc విభాగంలో ఓ హాట్ ఫేవరెట్‌గా నిలవడం ఖాయం. కొత్త మోడల్ డిజైన్ గురించి తెలుసుకుందాం.

2025 Yamaha Fz S Fi Launched In India

ఫ్రంట్ టర్న్ ఇండికేటర్‌లను హెడ్‌లైట్ అసెంబ్లీ నుండి ట్యాంక్ కవర్‌లో పెద్ద మార్పులు చేసింది. అలాగే, ట్యాంక్ కవర్ల చుట్టూ ఉన్న క్రోమ్ ఇప్పుడు మరింత మెరుస్తూ బ్లాక్ కలర్‌లో అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా కలర్ విషయంలో ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది. నాలుగు కొత్త అద్భుతమైన కలర్ ఆప్షన్లతో మోడల్‌ను కొత్తగా మార్చేసింది. మాట్టే బ్లాక్, ఐస్ ఫ్లూ-వెర్మిలియన్, మెటాలిక్ గ్రే, సైబర్ గ్రీన్ కలర్స్‌లో కూడా లభిస్తుంది.

ఇది Y-కనెక్ట్‌తో కూడిన పూర్తి డిజిటల్ క్లస్టర్, LED హెడ్‌లైట్లు, సింగిల్-ఛానల్ ABS, గుంతల రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణించడానికి టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. రైడర్లకు మెరుగైన కంట్రోలింగ్ ఇవ్వడానికి రెండు వీల్స్‌కు కూడా సింగిల్ డిస్క్‌లు ఉన్నాయి. దేశంలో 150cc విభాగంలో యమహా బజాజ్ పల్సర్ N150,హీరో ఎక్స్‌ట్రీమ్ 160R, TVS అపాచీ RTR 160, వంటి బలమైన ప్రత్యర్థులతో పోటీపడుతుంది.

2025 Yamaha Fz S Fi

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 9, 2025, 7:20 [IST]
English summary
2025 yamaha fz s fi launched in india with updated features and new colours
Read more on: #yamaha #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+