బైక్ మార్కెట్ షేక్ అయ్యే మోడల్ వచ్చేసింది.. ఫుల్ ట్యాంక్‌తో 350 కి.మీ.. బైక్ లవర్స్ మిస్ అవ్వకండి!
జావా-యెజ్డి మోటార్‌సైకిల్స్ (Jawa Yezdi Motorcycle) తమ క్లాసిక్ విభాగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 యెజ్డి రోడ్‌స్టర్ (Yezdi Roadster)ను ఆవిష్కరించింది. గత నెలలో రోడ్డుపై కెమెరా కళ్లలో చిక్కుకున్న టెస్ట్ మోడల్‌ను చూసినప్పటి నుంచే బైక్ ప్రేమికుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఇప్పుడు ఆ ఉత్సాహానికి మరింత ఊపు ఇచ్చేలా, 2025 రోడ్‌స్టర్ భారత మార్కెట్‌లో కొత్త కలర్స్, కొన్ని ప్రత్యేక అప్‌గ్రేడ్‌లతో ప్రవేశించింది. ఇది కేవలం రైడ్ మాత్రమే కాకుండా, ఒక స్టైల్ స్టేట్మెంట్‌గా మారే అవకాశం కలిగిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.09 లక్షల నుండి ప్రారంభమయ్యే ఈ మోడల్, తన సొగసైన కొత్త డిజైన్‌తోనే కాకుండా, ఆకర్షణీయమైన ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, వెడల్పైన వెనుక టైర్లు వంటి అంశాలతో కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఈ మోడల్ ప్రధానంగా రెండు వేరియంట్‌లలో స్టాండర్డ్, ప్రీమియంలలో లభిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్‌లో షార్క్‌స్కిన్ కలర్ ధర రూ. 2,09,969గా నిర్ణయించబడింది. అదే వేరియంట్‌లో స్మోక్ గ్రే కలర్ ఎంపిక చేసుకుంటే ధర రూ.2,12,969 అవుతుంది. బ్లడ్‌రష్ మెరూన్ కలర్ అయితే, దాని ధర రూ. 2,16,969గా ఉంటుంది. ఈ విధంగా, కలర్ ఎంపికపై ఆధారపడి స్టాండర్డ్ మోడల్ ధరలో స్వల్ప తేడా ఉంటుంది.

2025 యెజ్డి రోడ్‌స్టర్ విషయానికి వస్తే, వేరియంట్‌లు, ధరల పరంగా కూడా ఇది బైక్ అభిమానులకు విభిన్నమైన ఎంపికలను అందిస్తోంది. స్టాండర్డ్ వేరియంట్‌లో అత్యంత ఖరీదైన కలర్ సావేజ్ గ్రీన్, దీని ధర రూ.2,21,969 ఎక్స్-షోరూమ్‌గా నిర్ణయించబడింది. మరింత ప్రీమియం లుక్ కోరుకునే వారికి, షాడో బ్లాక్ కలర్‌లో అందించే ప్రీమియం వేరియంట్ ఉంది, దీని ధర రూ. 2,25,969 ఎక్స్-షోరూమ్. ఇవన్నీ కూడా యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటాయి.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ బైక్‌లోని ముఖ్యమైన అప్‌గ్రేడ్ కొత్త 350 ఆల్ఫా2 లిక్విడ్-కూల్డ్ ఇంజిన్. ఈ ఇంజిన్ 29PS గరిష్ట శక్తిని, 30Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ రోడ్డుపై శక్తివంతమైన, సమతుల్యమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. సిటీ రైడింగ్‌లోనూ, హైవే క్రూజింగ్‌లోనూ ఈ ఇంజిన్ పనితీరు సంతృప్తికరంగా ఉండేలా డిజైన్ చేయబడింది. కేవలం ఇంజిన్ మాత్రమే కాదు, గేర్‌బాక్స్‌లో కూడా యెజ్డి రోడ్‌స్టర్ కొత్త ప్రమాణాలను సెట్ చేసింది.

ఈ బైకులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీని అందించడం ద్వారా, ఈ విభాగంలో ఇలాంటి ఫీచర్లను అందిస్తున్న మొదటి బైకుగా నిలిచింది. దీని వలన గేర్ మార్పులు మరింత సాఫీగా, రైడింగ్ మరింత సౌకర్యవంతంగా మారుతాయి. పైగా, స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ వల్ల ఆకస్మిక డౌన్‌షిఫ్ట్‌ల సమయంలో రియర్ వీల్ లాక్ అయ్యే అవకాశం తగ్గుతుంది, ఇది రైడర్‌కి అదనపు భద్రతను కల్పిస్తుంది.
లాంగ్ రైడ్‌లను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ రోడ్‌స్టర్‌లో 12.5-లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ అమర్చారు. ఫుల్ ట్యాంక్ నింపితే, ఇది 350 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణాన్ని అందించగలదు. మిడ్-ఫ్రంట్ ఫుట్‌పెగ్‌లు ప్రత్యేకంగా రిలాక్స్‌డ్ రైడింగ్ పొజిషన్ కోసం డిజైన్ చేయబడ్డాయి. స్పోర్టీ హ్యాండ్లింగ్‌లో ఎలాంటి రాజీ పడకుండానే, సాడిల్‌పై గంటల తరబడి సౌకర్యంగా ప్రయాణించేందుకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications








