బైక్ కాదు.. గాలిలో పరిగెత్తే గుర్రం! రూ.19 వేల తగ్గింపుతో కొత్త కవాసకి సూపర్‌స్పోర్ట్ బైక్ లాంచ్

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం కవాసకి (kawasaki), ప్రతి సంవత్సరం కొత్త టెక్నాలజీ, మెరుగైన పనితీరు, స్పోర్టీ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది. కంపెనీ, ఇప్పుడు భారత బైక్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన నేకెడ్ సూపర్‌స్పోర్ట్ బైక్ Z900 (2026 Kawasaki Z900) కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. 2026 మోడల్ సంవత్సరానికి వచ్చిన ఈ బైక్ కొత్తగా బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. 2026 కవాసకి Z900 సూపర్‌బైక్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించబడింది. ఇది గత మోడల్‌తో పోలిస్తే సుమారు రూ. 19,000 తక్కువ. అంటే, కవాసకి తమ కొత్త వెర్షన్‌ను మరింత అందుబాటులోకి తెచ్చింది.

కవాసకి Z900 భారత మార్కెట్లో ఎప్పటి నుంచో స్పోర్ట్స్ బైక్ ప్రియుల కలల బైక్‌గా గుర్తింపు పొందింది. అద్భుతమైన పవర్, కంట్రోల్, స్ట్రీట్ స్టైల్ కలయికతో నేకెడ్ సూపర్‌బైక్ సెగ్మెంట్‌లో దాదాపు లీడర్‌గా నిలిచింది. కొత్త వెర్షన్ కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ, మరింత ఆధునిక టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లతో వచ్చింది. డిజైన్ పరంగా చూస్తే, అగ్రెసివ్ స్టాన్స్‌ను కొనసాగిస్తూ, కొత్త కలర్స్, సాఫ్ట్ ఫినిషింగ్ డీటైల్స్‌తో ఆకర్షణీయంగా మారింది.

2026 New Kawasaki Z900 Launched In India With Updated Feature

2026 మోడల్ ఇయర్ అప్‌డేట్‌లో భాగంగా, సూపర్‌బైక్ Z900ను కంపెనీ రెండు కొత్త కలర్ ఆప్షన్‌లతో కొత్త రూపాన్ని కాండీ లైమ్ గ్రీన్ / మెటాలిక్ కార్బన్ గ్రే, మెటాలిక్ మాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే / మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్ అందించింది. ఈ కొత్త కలర్స్ బైక్‌కి ఒక అగ్రెసివ్, ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తున్నాయి, వీటిని చూసిన క్షణంలోనే ఇదే నిజమైన Z స్పిరిట్ అని అనిపిస్తుంది.

అయితే ఈ అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణ కేవలం డిజైన్ మాత్రమే కాదు పర్ఫార్మెన్స్‌ లో కూడా స్వల్పమైన కానీ కీలకమైన పెరుగుదల కనిపిస్తోంది. కొత్త వెర్షన్ ఇప్పుడు 123.6 bhp పవర్, 98.6 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంటే, పాత వెర్షన్‌తో పోలిస్తే 1.6 bhp పవర్, 1.2 Nm టార్క్ ఎక్కువ. ఈ చిన్న పెరుగుదల రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ఉత్సాహభరితంగా మారుస్తుంది.

2026 New Kawasaki Z900 Launched In India With Updated Feature

మరొక ముఖ్యమైన అప్‌డేట్, బరువు తగ్గింపు. తాజా వెర్షన్‌లో మోటార్‌సైకిల్ బరువు 1 కిలో తక్కువగా ఉండి, మొత్తం 212 కిలోలగా ఉంది. దీని వలన హ్యాండ్లింగ్, యాక్సిలరేషన్, కంట్రోల్ మరింత మెరుగుపడ్డాయి. ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త 2026 కవాసకి Z900లో కూడా అదే లెజెండరీ 948cc, ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్ ఉంది. కానీ ఇది ఇప్పుడు మరింత ఫైన్‌ట్యూన్ చేయబడింది.

2026 కవాసకి Z900 కేవలం ఒక బైక్ కాదు, ఒక టెక్నాలజీ, పర్ఫార్మెన్స్ కలయిక. ఈసారి కంపెనీ కేవలం ఇంజిన్‌నే కాదు, మొత్తం రైడింగ్ అనుభవాన్నే మరో లెవల్‌కి తీసుకెళ్లింది. కొత్త Z900లో ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ అందుబాటులో ఉంది. దీంతో లాంగ్ రైడ్‌లలో కూడా మీ చేయి విశ్రాంతి తీసుకుంటూ, బైక్ మాత్రం వేగం తగ్గించదు. అదే సమయంలో, రైడాలజీ ది యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీను అందించారు.

2026 New Kawasaki Z900 Launched In India With Updated Feature

దీని ద్వారా బైక్ డేటా, రైడ్ ఇన్ఫో, నావిగేషన్, అన్నీ ఒకే టచ్‌లో లభిస్తాయి. కొత్తగా జోడించబడిన 5-అంగుళాల పూర్తి-రంగు TFT డిస్ప్లే ఇప్పుడు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను చూపిస్తుంది, అంటే, మీరు రోడ్డు మీద దృష్టి కోల్పోకుండా, రూట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రైడర్‌కి ఒక ప్రీమియం ఫీల్‌ను ఇస్తుంది. పర్ఫార్మెన్స్ సెగ్మెంట్‌లో, కవాసకి ఇంకా మెరుగులు దిద్దింది. డిజైన్ వైపు చూసినా ఈ బైక్ అసలైన సూపర్‌నేక్డ్ బీస్ట్.

More from DriveSpark

Article Published On: Wednesday, October 22, 2025, 18:44 [IST]
English summary
2026 new kawasaki z900 launched in india with updated feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+