330 కి.మీ మైలేజ్ బైక్.. రూ. 90 వేలు! ఒకసారి నింపితే 10 రోజులు పెట్రోల్ బంక్‌ వైపు చూడరు

బజాజ్ ఫ్రీడమ్ 125 (Bajaj Freedom 125) ప్రస్తుతం భారతీయ టూవీలర్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన మోడల్‌గా నిలిచింది. దేశంలో మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్‌గా రూపుదిద్దుకున్న ఈ బైక్, తన వినూత్న సాంకేతికతతో పాటు ఆర్థిక ప్రయోజనాలను అందించడం వల్ల విభిన్న వర్గాల వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ప్రయాణం కోరుకునే వారికి ఫ్రీడమ్ 125 నిజంగా ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారింది. రోజువారీ ప్రయాణాలకు సరిపోయే విధంగా బజాజ్ ఫ్రీడమ్ 125ను రూపుదిద్దడం వల్ల, ఇది నగర రోడ్ల నుంచి హైవేల వరకు ఎక్కడైనా సులభంగా నడుపుకోవచ్చు. ఫ్రీడమ్ 125పై కస్టమర్ల స్పందన కూడా చాలా సానుకూలంగా ఉంది. ప్రతి నెలా ఇది మంచి స్థాయిలో అమ్ముడవుతుంది. దీని గురించిన మరిన్ని వివరాలను ఈ కథణంలో చూద్దాం.

బజాజ్ ఫ్రీడమ్ 125ని మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెట్టే అంశాల్లో ఒకటి దాని అందుబాటు. ధర విషయంలో ఇది అన్ని వర్గాల కస్టమర్లకు చేరువగా ఉండటమే కాకుండా, ఇంధన వ్యయాలను తగ్గించే సామర్థ్యంతో దీర్ఘకాలికంగా కూడా లాభదాయకమైన ఎంపికగా మారింది. ప్రస్తుతం ఈ బైక్ ధర కనిష్టంగా రూ. 90,976 నుంచి గరిష్టంగా రూ. 1.07 లక్షలు(ఎక్స్-షోరూమ్) వరకు ఉండటం, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకునే కొనుగోలుదారులకు కూడా సులభమైన ఎంపికను అందిస్తోంది.

330Km Mileage Bike Bajaj Freedom 125 Cng Price Engine And All Details Inside

కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125ను పరిశీలిస్తే, దీనిలో డిజైన్ సరళమైనదైనా, ఫంక్షనల్‌గా, ఆధునికంగా కనిపిస్తుంది. ముందు భాగంలో ఉన్న పవర్‌ఫుల్ LED హెడ్‌లైట్ రాత్రి ప్రయాణాల్లో మెరుగైన విజిబిలిటీని అందిస్తుంది. అదేవిధంగా, సింగిల్-పీస్ సీటు దూర ప్రయాణాల్లో కంఫర్ట్‌ను పెంచుతుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంస్థ ఈ బైక్‌ను డ్రమ్, డ్రమ్ LED, డిస్క్ LED అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురావడం ప్రత్యేకత.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బజాజ్ ఫ్రీడమ్ 125లో 124.58 cc పెట్రోల్/CNG డ్యూయల్-ఫ్యూయల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత కావడం వల్ల నగర ప్రయాణాలు, రోజువారీ ప్రయాణాలు చేసే వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంధన ధరలు పెరిగిన ఈ కాలంలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 102.92 కాగా, CNG మాత్రం కిలోకు రూ.89 మాత్రమే ఉండటం వినియోగదారులకు స్పష్టమైన ఆర్థిక ప్రయోజనాన్ని ఇస్తోంది.

330Km Mileage Bike Bajaj Freedom 125 Cng Price Engine And All Details Inside

ముఖ్యంగా, ఈ బైక్ పెట్రోల్ + CNG కలిపి దాదాపు 330 కి.మీ రేంజ్ ఇస్తుంది. అందులో CNG రేంజ్ దాదాపు 200 km, పెట్రోల్ రేంజ్ 130 km వరకు ఉంటుంది. మొత్తంగా ఈ బైక్ 330 కి.మీల మైలేజ్ ఇవ్వగలదు. ఈ రేంజ్ రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వినియోగదారులకు ఉపయోగకరంగా మార్చింది. తక్కువ ఖర్చుతో, మెరుగైన మైలేజ్‌, ఫీచర్లతో బజాజ్ ఫ్రీడమ్ 125 బెస్ట్ ఆప్షన్.

బజాజ్ ఫ్రీడమ్ 125ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశాల్లో ఒకటి దీనిలో లభించే డజన్ల కొద్దీ ఆధునిక ఫీచర్లు. సాధారణంగా ఈ ధర శ్రేణిలో లభించని అనేక సౌకర్యాలను బజాజ్ ఈ బైక్‌లో అందించడంతో ఇది మరింత ప్రజాదరణ పొందుతోంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటం వలన నోటిఫికేషన్లు, కాల్ అలర్ట్‌లు వంటి ఫీచర్లు హ్యాండిల్‌బార్ పైనే చూసుకోవచ్చు. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అందుబాటులో ఉండటం దూర ప్రయాణాల్లో ఎంతో ఉపయోగకరం.

330Km Mileage Bike Bajaj Freedom 125 Cng Price Engine And All Details Inside

పర్ఫార్మెన్స్ పరంగా, బజాజ్ ఫ్రీడమ్ 125 తన శ్రేణిలో మంచి సామర్థ్యాన్ని చూపుతుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 90 కి.మీ వేగాన్ని అందుకోగలదు. 0 నుండి 60 కి.మీ వేగాన్ని కేవలం 7.85 సెకన్లలో చేరుకోవడం దీని చురుకుదనాన్ని సూచిస్తుంది. నగరాల్లో స్టార్ట్-స్టాప్ ట్రాఫిక్‌లోనూ, ఓపెన్ రోడ్‌లపై కూడా ఈ బైక్ వేగంగా స్పందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, December 1, 2025, 12:43 [IST]
English summary
330km mileage bike bajaj freedom 125 cng price engine and all details inside
Read more on: #bajaj #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+