ఒక స్కూటర్ కొంటే భార్యభర్తలు ఇద్దరూ నడపొచ్చు.. మార్కెట్లో ప్రస్తుతం దీనికే ఫుల్ డిమాండ్
మీరు కొత్త స్కూటర్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే, మంచి స్కూటర్ కోసం చూస్తున్నారా? అలాగే ఇంట్లో భార్యభర్తలు ఇద్దరూ నడపగలిగే స్కూటర్ కావాలంటే సుజుకి యాక్సెస్ 125 ట్రై చేయవచ్చు. ప్రస్తుతం స్కూటర్‌కు ఇప్పుడు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇది నమ్మకమైన స్కూటర్‌గా, ఆకర్షణీయమైన డిజైన్‌తో, బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది.
జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 స్కూటర్ల జాబితాలో యాక్సెస్ 125 మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 51,555 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే నెలలో 52,192 యూనిట్లు అమ్ముడవగా, సంవత్సరానికి -1.22% స్వల్ప తగ్గుదల నమోదైంది. మొదటి స్థానంలో నిలిచిన హోండా యాక్టివా 1,83,265 యూనిట్లను విక్రయించింది. అయితే, దాని అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 21.47% తగ్గాయి.

రెండవ స్థానంలో ఉన్న టీవీఎస్ జూపిటర్ దాదాపు 1,07,980 యూనిట్లను విక్రయించింది. దీని అమ్మకాలు 49.76% పెరిగాయి. మూడో స్థానంలో నిలిచిన సుజుకీ యాక్సెస్ 125 51,555 యూనిట్లను విక్రయించింది.
సుజుకీ యాక్సెస్ స్కూటర్ అమ్మకాలు నెలవారీగా బాగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది చాలా చక్కటి డిజైన్, మధ్యతరగతి వినియోగదారులకు సరిపోతుంది. తక్కువ ధరలో లభించడమే కాకుండా, రోజువారీ వినియోగానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పురుషులు, మహిళలు ఇద్దరూ సులభంగా నడపగలిగేలా ఉండటం వల్ల భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది.

పర్ల్ షైనీ బీజ్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లర్ బ్లూ, పర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, సాలిడ్ ఐస్ గ్రీన్ వంటి రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని పొడవు 1,835ఎంఎం, వెడల్పు 690ఎంఎం, ఎత్తు 1,155ఎంఎం. అలాగే, 160ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 1,260ఎంఎం వీల్‌బేస్ ఉన్నాయి.

కొత్త యాక్సెస్ స్కూటర్ 125 సీసీ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 6500 RPM వద్ద 8.3 BHP పవర్, 5000 RPM వద్ద 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ 45 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. 5 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి పదుల కొద్దీ ఫీచర్లను పొందింది.
ఇది గంటకు 90కి.మీ టాప్ స్పీడ్‌ను చేరుకుంటుంది. సీటు ఎత్తు 773 ఎంఎం, సుమారు 106 కిలోల బరువు ఉంటుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో సింగిల్-షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్లు సుజుకి యాక్సెస్ 125కి ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








