తక్కువ ధరలో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. హోండా యాక్టీవా ఈకి ఆల్టర్నేటివ్స్ ఇవే

హోండా యాక్టివా ఒకప్పుడు మిడిల్ క్లాస్ ప్రజల ఆల్ టైం ఫేవరెట్ స్కూటర్. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. హోండా కూడా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'యాక్టివా ఈ'ని ఇటీవల విడుదల చేసింది. దీని ధర రూ. 1.17లక్షల నుంచి రూ. 1.52లక్షల వరకు ఉంది. ఇది 1.5కిలోవాట్ బ్యాటరీతో ఒక ఛార్జ్‌పై 102కి.మీ రేంజ్ ఇస్తుంది. TFTడిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అయితే, దాదాపు ఇదే ధరలో లేదా అంతకంటే తక్కువ ధరలో మరిన్ని మంచి ఎలక్ట్రిక్ టూ-వీలర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో, వాటి ప్రత్యేకతలు ఏంటో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

Honda Activa

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube): ఇది బాగా పాపులారిటీ సాధించిన ఎలక్ట్రిక్ స్కూటర్. చాలా బడ్జెట్ ధరలో ఇది లభిస్తుంది. సాధారణ ప్రజలు కూడా సులభంగా కొనుగోలు చేయగలరు. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్). కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 కిలోవాట్, 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది.

ఇది ఒక పూర్తి ఛార్జ్‌పై 75 నుంచి 100 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. 5-అంగుళాల TFT స్క్రీన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వెహికల్ క్రాష్ టౌ అలర్ట్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

TVS

ఓలా ఎస్1 ప్రో ప్లస్ (OLA S1 Pro+): ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.48 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 4 కిలోవాట్, 5.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఒక పూర్తి ఛార్జ్‌పై ఇది 242 నుండి 320 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది.

హీరో విడా వి2 ప్లస్ (Hero Vida V2 Plus): ఇది కూడా ఒక ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్. హోండా యాక్టివా ఈకి ఇది మంచి ప్రత్యామ్నాయం. తక్కువ, మధ్యతరగతి కొనుగోలుదారులు దీనిని సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ధర రూ. 85,300 (ఎక్స్-షోరూమ్).

Vida

ఈ హీరో విడా వి2 ప్లస్ ఈ-స్కూటర్ 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 5.22 బిహెచ్‌పి పవర్ మరియు 25 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక పూర్తి ఛార్జ్‌పై 143 కి.మీ రేంజ్ ఇస్తుంది. టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో సహా అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఏథర్ 450ఎస్ (Ather 450S): ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1.29 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక పూర్తి ఛార్జ్‌పై ఇది 122 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.

Revolt

రివోల్ట్ ఆర్వీ400 (Revolt RV400): ఇది ఒక పాపులర్ ఎలక్ట్రిక్ బైక్. దీని ధర రూ. 1.23 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 3.24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక పూర్తి ఛార్జ్‌పై ఇది 150 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. దీనిలో అనేక ఎట్రాక్టివ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 14, 2025, 15:45 [IST]
English summary
5 affordable electric two wheelers that can replace honda activa e scooter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+