రూ.100 పెట్రోల్ కొట్టిస్తే చాలు.. రూ. 65 వేలే బైక్! ఫుల్ ట్యాంక్‌తో 850 కి.మీ.. లీటరుకు 90 కి.మీలు

భారతదేశంలో తక్కువ ధరతో పాటు అధిక మైలేజీ ఇస్తే సరిపోతుంది, ఆ బైక్ మార్కెట్లో మంచి స్థానం సంపాదిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్ల అంచనాలను సరిగ్గా తీర్చిన మోడళ్లలో బజాజ్ ప్లాటినా (Bajaj Platina) ఎప్పటినుంచో ముందు వరుసలో నిలుస్తోంది. ఎందుకంటే, ఈ బైక్ కేవలం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండటం మాత్రమే కాదు, లీటరుకు అధిక మైలేజీని కూడా ఇస్తోంది. దీంతో ముఖ్యంగా రోజువారీ ప్రయాణం చేసే మధ్యతరగతి వినియోగదారులకు ఇది అత్యంత సరైన ఎంపికగా మారింది. ఇది దాదాపు లీటరుకు 75 నుంచి 90 కి.మీల వరకు ఇస్తోంది. ఆగస్టు 2025లో బజాజ్ ప్లాటినా అమ్మకాలు బాగానే జరిగాయి. మార్కెట్‌ డేటా ప్రకారం, ఈ నెలలో మొత్తం 39,110 యూనిట్లు విక్రయించబడ్డాయి. అయితే ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే కొద్దిగా తగ్గుదలని చూపించింది.

ఆగస్టు 2024లో 41,915 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే కేవలం ఒకే సంవత్సరంలో 2,805 బైక్‌లు తక్కువగా అమ్ముడయ్యాయి. శాతం లెక్కన చూసుకుంటే ఇది సుమారు 6.69% డౌన్‌టర్న్. అయినా కూడా, ఈ తగ్గుదల చాలా చిన్నదే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మార్కెట్‌లో డిమాండ్, సీజనల్ ట్రెండ్స్, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాల వల్ల నెలవారీ అమ్మకాలలో స్వల్ప మార్పులు జరగడం సహజం.

90km Mileage Bike Bajaj Platina August 2025 Sales Recorded 39110 Units Details

ముఖ్యంగా పండుగ సీజన్ సందర్భంలో, బజాజ్ ప్లాటినాకు మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధర, అధిక మైలేజీ అనే రెండు ప్రధాన బలాలపై ఆధారపడి ఈ బైక్ భవిష్యత్తులో కూడా మార్కెట్‌లో తన పట్టు కొనసాగించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 2025లో అమ్మకాలు కొద్దిగా తగ్గినా, బజాజ్ ప్లాటినా ఇంకా మధ్యతరగతి వినియోగదారుల కోసం బంగారం లాంటి బైక్‌గానే కొనసాగుతోంది.

బజాజ్ ప్లాటినా భారత మార్కెట్లో ఎప్పటినుంచో మైలేజీ బైక్‌లలో ఒక ప్రముఖ పేరుగా ఉంది. ప్రస్తుతం ఈ బైక్ రెండు వెర్షన్లలో బజాజ్ ప్లాటినా 100, బజాజ్ ప్లాటినా 110 డ్రమ్ లలో అందుబాటులో ఉంది. వీటిలో ఎంట్రీ లెవల్ మోడల్ ప్లాటినా 100 ధర కేవలం రూ.65,407 (ఎక్స్-షోరూమ్), ఇక ప్లాటినా 110 డ్రమ్ వెర్షన్ ధర రూ.69,284 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

90km Mileage Bike Bajaj Platina August 2025 Sales Recorded 39110 Units Details

ఈ ధరలు బజాజ్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాలే కావడంతో వినియోగదారులు నమ్మకంగా పరిశీలించవచ్చు. మైలేజీ విషయానికి వస్తే, ప్లాటినా ఎప్పుడూ వినియోగదారుల మనసు దోచుకుంది. చాలా మంది యజమానులు తమ అనుభవాలను పంచుకుంటూ, ఈ బైక్ లీటరుకు 70 నుంచి 90 కి.మీ వరకు ఇస్తుందని చెబుతున్నారు. అయితే ఇది రైడింగ్ శైలి, రోడ్డుల పరిస్థితులు, అలాగే బైక్ నిర్వహణపై ఆధారపడి మారవచ్చని కూడా గమనించాలి.

అయినప్పటికీ, ఈ స్థాయిలో మైలేజీ ఇస్తూ తక్కువ ధరలో లభించే మోడల్‌గా ప్లాటినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఇది నిజంగా సరైన ఎంపిక. ముఖ్యంగా ఆఫీస్‌కి వెళ్ళే వారు, రోజూ ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారు ఈ బైక్‌ను మసుకు నచ్చిన మైలేజీ బైక్‌గా విస్తున్నారు.

90km Mileage Bike Bajaj Platina August 2025 Sales Recorded 39110 Units Details

తక్కువ ధరలో, ఇంధనంలో ఆదా, అలాగే నిర్వహణలో సులభత అనే మూడు ముఖ్య కారణాల వల్ల బజాజ్ ప్లాటినా ఇప్పటికీ భారతీయ మార్కెట్లో డిమాండ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో పండుగల వాతవరణం నెలకొంది. పైగా జీఎస్టీ తగ్గింపు కూడా అమల్లోకి వచ్చింది. దీంతో ఈ బైక్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, September 29, 2025, 17:32 [IST]
English summary
90km mileage bike bajaj platina august 2025 sales recorded 39110 units details
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+