జనవరి నుంచి పెరగనున్న బైకులు, స్కూటర్ల ధరలు?! కేంద్రం కొత్త నిర్ణయంతో అందరికి షాక్!
భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన మేరకు, జనవరి 1, 2026 నుండి దేశీయంగా విక్రయించబడే అన్నిటూవీలర్ వాహనాల్లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తప్పనిసరిగా ఉండాలి. ఇది కేవలం టెక్నికల్ అప్‌డేట్ మాత్రమే కాదు, జీవితాలను కాపాడే ముందుజాగ్రత్త చర్య. ఈ నిర్ణయం వలన వాణిజ్యంగా కొన్ని ప్రభావాలు చూపే అవకాశం ఉంది. బిజినెస్ స్టాండర్డ్‌లో వచ్చిన కథణం, గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ నోమురా నివేదిక ప్రకారం, టూవీలర్ వాహనాల డిమాండ్‌లో 2 నుంచి 4 శాతం తగ్గుదల వచ్చే అవకాశముందని అంచనా వేసింది.
అంతేకాకుండా, వాహన తయారీదారులు ఈ కొత్త ABS వ్యవస్థను అమలు చేయాల్సి రావడంతో ప్రతి బైక్‌పై రూ.2,000 నుంచి రూ.3,000 వరకు అదనంగా ఖర్చు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, మోడల్‌లో ఇప్పటికే డిస్క్ బ్రేక్ లేకపోతే, అదనంగా రూ.1,000 వరకు ఖర్చు రావచ్చు. ఈ మొత్తాన్ని తయారీదారులు వినియోగదారులకు బదిలీ చేస్తే, రిటైల్ ధరలు సుమారుగా 3-5 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దీంతో కొంతమంది వినియోదారులు వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడానికి రాకపోవచ్చని, వాల్యూమ్ పరంగా మార్కెట్ మీద 4శాతం వరకు ప్రభావం పడవచ్చని నోమురా హెచ్చరించింది. ప్రస్తుతం భారత్‌లో జరిగే రోడ్డు ప్రమాద మరణాల్లో 40 శాతం పైగా టూవీలర్ వాహనదారులే బాధితులవుతుండడం కేంద్ర నిర్ణయానికి ప్రధాన కారణం. ABS తప్పనిసరిగా చేయడం ద్వారా అత్యవసర బ్రేకింగ్ సమయంలో వాహనం నియంత్రణ కోల్పోకుండా ఉండటంతో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.
కేవలం ABS తప్పనిసరి చేయడం మాత్రమే కాకుండా, ప్రతి కొత్త బైక్‌ను విక్రయించే సమయంలో డీలర్‌షిప్‌లు ఓనర్‌కు రెండు ISI సర్టిఫైడ్ హెల్మెట్‌లను ఇవ్వడం కూడా తప్పనిసరి అయింది. ఇది మోటార్ వాహన భద్రతా ప్రమాణాలను మరింత బలపరచే చర్యగా కనిపిస్తోంది.జనవరి 2026 నుంచి ABS తప్పనిసరి కానున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కొన్ని ప్రముఖ వాహన తయారీదారులపై గణనీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ బైక్ సెగ్మెంట్‌లో వాహనాలను అధికంగా విక్రయించే కంపెనీలు ఈ ప్రభావాన్ని తట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా విశ్లేషణ ప్రకారం, హీరో మోటోకార్ప్ ఈ మార్పుల వలన ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. హీరో తర్వాత, హోండా ఇండియా 89 శాతం, TVS మోటార్ కంపెనీ 86 శాతం, బజాజ్ ఆటో 72 శాతం వాల్యూమ్‌లతో వరుసగా మూడో, నాల్గవ స్థానాల్లో ఉన్నాయి.
భారతదేశంలో టూవీలర్ భద్రతను మెరుగుపరచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, 85 శాతానికి పైగా మార్కెట్‌ను ప్రభావితం చేయనుంది. ఇది కేవలం ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) ఆధారిత బైక్‌లకే కాకుండా, ప్రస్తుతం వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఒత్తిడి కలిగిస్తుంది. ఒక వాహన మోడల్‌కు ఇంకో కొత్త టెక్నాలజీ లేదా ఫీచర్ జోడించినప్పుడు, ఆ వాహనాన్ని తయారుచేసే మొత్తం వ్యయం సాధారణంగా పెరగుతుంది.

ఇప్పడు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం కారణంగా రాబోయే కొత్త ఏడాది నుంచి స్వల్పంగా పెరుగుదలను ఊహించుకోవచ్చు. బడ్జెట్ సెగ్మెంట్‌కి చెందిన టూవీలర్ వాహనాలు ధరలు మరింత భారం కానున్నాయి. ప్రత్యేకించి రోజువారీ ప్రయాణికులకు అందుబాటులో ఉండే బైక్‌లు, స్కూటర్‌లపై దీని ప్రభావం మరింత కనిపించవచ్చు.


Click it and Unblock the Notifications








