ఇది సాధారణ స్కూటర్ కాదు.. ఎక్కిన తర్వాత అసలు స్టోరీ మొదలవుతుంది.. కొత్త ఫీచర్స్‌తో నెక్సస్
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ అయిన ఆంపియర్, తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్‌ను మరింత అప్‌గ్రేడ్ చేస్తూ కొత్త ఫీచర్లను విడుదల చేసింది. కంపెనీ ప్రకటన ప్రకారం, ఈ స్కూటర్ ఇప్పుడు అత్యాధునిక Nex.IO టెక్నాలజీ వేదికపై మరింత అభివృద్ధి చెందింది. దీని ప్రధాన ఆకర్షణ LFP బ్యాటరీతో పాటు స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు కలిగిన రైడింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందించడం. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రైడింగ్‌ను మరింత సులభంగా మార్చడానికి కంపెనీ అదిరిపోయే ఫీచర్స్, అత్యాధునిక సౌకర్యాలను ఈ స్కూటర్ అప్‌డేట్‌లో అందించడం జరిగింది. ఇకపై నెక్సస్ స్కూటర్‌ను రైడింగ్ చేసే వారు కొత్త అనుభూతిని పొందనున్నారు.
ఈ కొత్త అప్‌డేట్‌లో మ్యాప్ మిర్రరింగ్ టెక్నాలజీ పరిచయం చేశారు. ఈ అప్‌డేట్ వల్ల రైడర్లు ఇప్పుడు నేరుగా తమ స్కూటర్‌లోని 7-అంగుళాల TFT డిస్ప్లే ద్వారా పూర్తి-స్క్రీన్ నావిగేషన్‌ను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా, మ్యాప్ మిర్రరింగ్ టెక్నాలజీతో కూడిన ఈ ఫీచర్, రైడింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది. ETA, రాబోయే మలుపు దూరం, అలాగే మ్యాప్‌లను పూర్తి స్క్రీన్‌లో ప్రదర్శించడం వంటి సౌకర్యాలు దీని ప్రత్యేకత.

అంతేకాకుండా, ఈ డిస్ప్లేలో జూమ్ ఇన్/అవుట్ ఫీచర్, డాష్‌బోర్డ్‌లో అన్ని వివరాలను క్లియర్‌గా చూడవచ్చు. నెక్సస్ స్కూటర్‌లో కొత్తగా జోడించిన ఈ టెక్నాలజీ, రైడింగ్ అనుభవాన్ని కేవలం నావిగేషన్ వరకు మాత్రమే పరిమితం చేయదు. మ్యూజిక్ కంట్రోల్, కాల్ కనెక్టివిటీ, ఇంకా రియల్-టైమ్ భద్రతా హెచ్చరికలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, స్కూటర్ ప్రదర్శించే డేటాలో బ్యాటరీ శాతం, RPM, గరిష్ట వేగం వంటి వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఆంపియర్ నెక్సస్ ఇప్పుడు కేవలం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాదు, స్మార్ట్ రైడింగ్ భాగస్వామిగా మారింది. కొత్తగా తీసుకొచ్చిన ఆంపియర్ కేర్ కనెక్టివిటీ ద్వారా, రైడర్‌కు ఎప్పటికప్పుడు భద్రతా హెచ్చరికలు, సర్వీస్ రిమైండర్‌లు అందుతాయి. దీని వల్ల స్కూటర్‌ను నడుపుతున్న వ్యక్తి ఎప్పుడూ సురక్షితంగా ఉండటమే కాకుండా, తన వాహనం ఎలాంటి స్థితిలో ఉందో కూడా సమయానుకూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఇంకా ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఆంపియర్ కనెక్ట్ కంపానియన్ యాప్. ఈ యాప్ ద్వారా రైడర్‌లు తమ స్కూటర్‌ను సులభంగా ట్రాక్ చేయవచ్చు. ప్రతి రైడ్ తర్వాత స్కూటర్ బ్యాటరీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, లైవ్ ట్రాకింగ్ చేయడం, లేదా అవసరమైనప్పుడు నోటిఫికేషన్‌లను పొందడం మొదలగు వాటికి సొల్యూషన్‌గా ఈ యాప్ పనిచేస్తుంది. ప్రతి రైడ్‌ను స్మార్ట్‌గా, సురక్షితంగా, మార్చడమే కాకుండా, ఈ స్కూటర్‌కు కొత్త అప్‌డేట్స్ అందించడం ప్రధాన ఉద్దేశం.
నెక్సస్ ఫీచర్స్‌తో మాత్రమే కాకుండా పెర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకుంటుంది. ఇది ఇటీవలే ఇది 13,200 అడుగుల ఎత్తులో ఉన్న షిప్కి లా పాస్‌ను చేరుకున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్గా చరిత్ర సృష్టించింది. సాధారణ నగర వీధుల నుంచి కఠినమైన పర్వత మార్గాల వరకు, ప్రతి రకమైన రోడ్లను జయించగల సామర్థ్యం నెక్సస్‌లో ఉందని ఈ విజయం చూపించింది. ఈ అద్భుత విజయాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్‌తో గుర్తించింది.

ఈ సందర్భంగా, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ COO రామ్ రాజప్ప మాట్లాడుతూ - Nex.IO పరిచయంతో, నెక్సస్ ఇప్పుడు మరింత ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలతో రైడర్ల ముందుకు వస్తోంది. మా కస్టమర్ల చేతుల్లోకి తదుపరి తరం డిజిటల్ ఫీచర్లను తీసుకువచ్చి, రైడింగ్ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తోంది. ఇది ఆంపియర్ వాస్తవ ప్రపంచ పనితీరు, భద్రత, డిజైన్‌పై ఉన్న దృష్టిని స్పష్టంగా చూపిస్తుంది అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








