పెట్రోల్ లేకుండా రోజూ 100 కి.మీలు వెళ్లొచ్చు.. 5 సంవత్సరాల వారంటీ..! రివర్స్ గేర్ కూడా ఉంది
దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్(Greaves Electric Mobility Limited(GEML)) ఇండియాలో ఈవీ విభాగంలో మంచి పేరున్న సంస్థ. ఇది చాలా ఏళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుంది. దీని కింద పలు బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో ఆంపియర్ (ampere) ఒకటి. ఈ కంపెనీ తాజాగా మార్కెట్లోకి కొత్త మోడల్‌ను విడుదల చేసంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు మాగ్నస్ నియో (magnus Neo). ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైన మోడల్. దీని డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. స్టైలిష్ రూపం అందరినీ ఆకట్టుకుంటుంది. దీని ధర కూడా పేద, మధ్యతరగతి వారు కొనుగోలు చేసే విధంగా అందుబాటులోనే ఉంది. పెర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. కొత్త మాగ్నస్ నియో రాకతో ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లలో పోటీ మరింత ఎక్కువ అయింది.
మాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉండగా, దీనికి కొనసాగింపుగా మాగ్నస్ నియోను కంపెనీ తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్‌ను ఎవరైనా కూడా చాలా ఈజీగా డ్రైవింగ్ చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 79,999 (ఎక్స్-షోరూమ్). దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 17న ప్రారంభమయ్యే 2025 ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌లో మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రదర్శిస్తామని ఆంపియర్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

మాగ్నస్ నియో LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీని కలిగి ఉంది. ఇది అధునాతనమైనది. దీన్ని ఛార్జ్ చేయడానికి 5 నుంచి 6 గంటల వరకు సమయం పడుతుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే ఏకంగా 100 కి.మీల వరకు ప్రయాణించగలదని ఆంపియర్ ప్రముఖంగా పేర్కొంది. దీంతో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి తక్కువ ఖర్చు అవుతుంది. పెట్రోల్ ధరలు భారీగా ఉన్న సమయంలో ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
సాధారణంగా ప్రజల రోజువారీ ప్రయాణం 100 కి.మీల కంటే తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రోజులో ఒక్కసారి స్కూటర్‌ను ఛార్జ్ చేసి రోజంతా కూడా ఛార్జ్ కోసం ఎక్కడా ఆగకుండా తమ రైడింగ్ చేయవచ్చు. ఇది రివర్స్ మోడ్‌తో 3 రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ కొనుగోలుపై కంపెనీ ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తుంది. బ్యాటరీపై 5 సంవత్సరాలు/ 75,000 కిమీల వరకు వారంటీని ఇస్తుంది.
75 వేల కి.మీ దూరం వరకు ఎలాంటి చింత లేకుండా బ్యాటరీని వాడుకోవచ్చని కంపెనీ నమ్మకమైన హామీ ఇస్తుంది. ఇది 5 ఏళ్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మాగ్నస్ నియో టాప్ స్పీడ్ గంటకు 65 కి.మీలు. దీనిలో ఫీచర్లకు ఎలాంటి కొదవ లేదు. USB ఛార్జింగ్, స్మార్ట్ కనెక్టివిటీ, ముందు డిస్‌ప్లేలో రైడింగ్ వివరాలు, మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్, ముందు, వెనుక అత్యాధునిక సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.
ఈ పండుగ సీజన్‌లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ సూటర్ విడుదలపై గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ సీఈఓ కున్నకావిల్ విజయ కుమార్ మాట్లాడుతూ, ఇది అధునాతన ఫీచర్లతో వచ్చిందని అన్నారు. కస్టమర్ల డిమాండ్‌ను ఇది తీర్చగలదని తెలిపారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications