136కిమీ రేంజ్, 5ఏళ్లు లేదా 72000కిమీ వారంటీ.. ఎలాంటి భయం లేకుండా ఈ స్కూటర్ కొనేయొచ్చు

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను సామాన్యులకు చేరువ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన స్టార్టప్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఆంపియర్. గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ అయిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ లో-స్పీడ్, హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో తమదైన ముద్ర వేసింది.

ఇటీవలే ఏథర్ రిస్తా, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఓలా S1 వంటి ఈవీలతో పోటీ పడటానికి నెక్సస్ అనే ఫ్యామిలీ స్కూటర్‌ను రిలీజ్ చేసింది. ఆకర్షణీయమైన ధర, అద్భుతమైన రేంజ్‌తో వచ్చిన నెక్సస్ బాగా ప్రజాదరణ పొందింది.

Ampere Nexus

మార్కెట్‌లో మరింత పోటీని తట్టుకోవడానికి కంపెనీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఆంపియర్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్‌కు ఇకపై 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ ఉంటుందని ప్రకటించింది. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే, దాని ఆధారంగా వారంటీ నిర్ణయించబడుతుంది.

దీంతో పాటు ఆంపియర్ నెక్సస్‌కు సరసమైన ఫైనాన్సింగ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ అతి తక్కువ డౌన్ పేమెంట్ ఆప్షన్లను, 6.99 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లను ప్రవేశపెట్టింది. ఆర్థిక అడ్డంకులను తగ్గించి, వినియోగదారులకు నెక్సస్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ చర్యల లక్ష్యం.

Ampere Nexus

ఆంపియర్ నెక్సస్ EX, ST అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. EX వేరియంట్ ధర రూ.1,14,900, ST టాప్ వేరియంట్ ధర రూ. 1,24,900. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ శాంస్కార్ అక్వా, లూనార్ వైట్, స్టీల్ గ్రే, ఇండియన్ రెడ్ అనే నాలుగు రంగులలో అందుబాటులో ఉంది.

డిజైన్ విషయానికి వస్తే, ఆంపియర్ నెక్సస్ ప్రత్యర్థుల మాదిరిగా పెద్దగా ఆర్భాటం లేకుండా రూపొందించబడింది. ఇది చూడటానికి చాలా స్టైలిష్‎గా ఉంటుంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. బేస్ మోడల్‌లో 6.2-అంగుళాల LCD డిస్‌ప్లే, టాప్ ఎండ్ మోడల్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ TFT డాష్ లభిస్తాయి. LED లైటింగ్ స్టాండర్డ్‌గా అందించారు.

Ampere Nexus

సీటు 712 మిల్లీమీటర్ల పొడవు, 765 మిల్లీమీటర్ల సీటు ఎత్తును కలిగి ఉంది. కాబట్టి పొట్టి వారికి కూడా సులభంగా నడపవచ్చు. ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1,319 మిల్లీమీటర్ల వీల్‌బేస్, 170 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, 235 మిల్లీమీటర్ల ఫ్లోర్‌బోర్డ్ స్పేస్‌ను కలిగి ఉంది. కాబట్టి రోజువారీ వాడకానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

దీనిలో 3kWh LFP బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. మిడ్-మౌంటెడ్ పర్మనెంట్ మాగ్నెట్ మోటారుతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 136 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ ఇస్తుంది. గరిష్టంగా 4 kW పవర్ వరకు ఉత్పత్తి చేయగలదు. ఎకో, సిటీ, పవర్, లింప్ హోమ్ అనే నాలుగు రైడ్ మోడ్‌లు నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకత.

ఈ ఈవీ టాప్ స్పీడ్ గంటకు 93 కిలోమీటర్లుగా కంపెనీ నిర్ధారించింది. సిటీ మోడ్‌లో వేగం గంటకు 63 కిలోమీటర్లు, ఎకో మోడ్‌లో 42 కిలోమీటర్లు. ఆంపియర్ ఈవీకి ఛార్జింగ్ సమయం 3.3 గంటలు అని కంపెనీ చెబుతోంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉన్నందున, అంతకంటే తక్కువ సమయంలోనే స్కూటర్‌ను ఛార్జ్ చేయవచ్చు.

ఏదేమైనా 5 సంవత్సరాల వారంటీని అందించడం వల్ల నెక్సస్‌ను ఇకపై ఎటువంటి ఆందోళనలు లేకుండా ధైర్యంగా కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధర, మంచి రేంజ్, మరియు ఇప్పుడు పెరిగిన వారంటీతో ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో బలమైన పోటీదారుగా నిలుస్తుంది.

Article Published On: Friday, July 4, 2025, 12:44 [IST]
English summary
Ampere nexus gets 5 year battery warranty a game changer in indian ev market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+