ఆ బైకు మీద వస్తున్నారంటే అమ్మాయిలు అలా చూస్తుంటారు.. అందుకే దానిని తెగ కొనేస్తున్నారు

బజాజ్ పల్సర్ బైకును యూత్‎ను దృష్టిలో పెట్టుకొని తయారుచేశారు. బైక్ డిజైన్, పనితీరు, ఫీచర్లు అందరికీ నచ్చుతాయి. ఇటీవల 'మే' నెలలో అత్యధిక సంఖ్యలో అమ్ముడైన టాప్ 10 మోటార్‌సైకిళ్ల జాబితా విడుదలైంది. అందులో 'పల్సర్' 3వ స్థానంలో ఉంది. అయినా, అమ్మకాల సంఖ్య తగ్గింది. ఇదే జాబితాలో హీరో స్ప్లెండర్ మొదటి స్థానంలో ఉండగా, హోండా షైన్ రెండవ స్థానంలో ఉంది.

గత నెలలో (మే-2025) బజాజ్ ఆటో కంపెనీ మొత్తం 1,22,151 యూనిట్ల 'పల్సర్' మోటార్‌సైకిళ్లను అమ్మింది. అయితే, 2024 మే నెలలో 1,49,054 యూనిట్లను అమ్మింది. ఈ లెక్కలు చూస్తే, సంవత్సరం నుండి సంవత్సరానికి (YoY) అమ్మకాల శాతం -4.93% తగ్గింది.

Bajaj Pulsar

బజాజ్ పల్సర్ బైక్ అమ్మకాల సంఖ్య తగ్గడానికి కంపెనీ ఎలాంటి కారణం చెప్పలేదు. అయితే, ఈ మోటార్‌సైకిళ్ల ధర కాస్త ఎక్కువగా ఉండటంతో కస్టమర్లు కొనేందుకు వెనకాడుతున్నారు అని అంటున్నారు. అంతేకాకుండా, పల్సర్ లాగే చాలా ఆకర్షణీయంగా ఉండే బైకులను ఇతర కంపెనీలు కూడా అమ్ముతున్నాయి. కొనుగోలుదారులు వాటివైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే, పల్సర్ అమ్మకాల సంఖ్య తగ్గిందని విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్ చాలా రకాలుగా కస్టమర్ల కొనుగోలుకు అందుబాటులో ఉంది. వాటిలో పల్సర్ 125 , పల్సర్ 150, పల్సర్ ఎన్160, పల్సర్ ఎన్ఎస్200, పల్సర్ ఎన్ఎస్125, పల్సర్ ఎన్ఎస్160 మోడల్స్ ఎక్కువ ప్రజాదరణ పొందాయి.

Bajaj Pulsar

బజాజ్ పల్సర్ 125: ఇది రూ.1.04 లక్షల నుండి రూ.1.15 లక్షల (ఎక్స్-షోరూం) ధరలో లభిస్తుంది. 124.4 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. లీటరుకు 51 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఫుల్ డిజిటల్ కన్సోల్ తో పాటు వివిధ ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం డిస్క్ బ్రేకులను కలిగి ఉంది.

బజాజ్ పల్సర్ 150: ఈ బైక్ రూ.1.47 లక్షల నుండి రూ.1.52 లక్షల(ఎక్స్-షోరూం) ధరను కలిగి ఉంది. 149.5 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. లీటరుకు 47 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, సింగిల్ ఛానెల్ ఏబీఎస్ తో పాటు అనేక ఫీచర్లను కలిగి ఉంది. రైడర్ల సేఫ్టీ కోసం డిస్క్ బ్రేకులను కలిగి ఉంది.

Bajaj Pulsar

బజాజ్ పల్సర్ ఎన్160: ఇది రూ.1.57 లక్షల నుండి రూ.1.71 లక్షల(ఎక్స్-షోరూం) ధరను కలిగి ఉంది. 164.82 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. లీటరుకు 59.11 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. భద్రత కోసం డబుల్ డిస్క్ బ్రేకులను కలిగి ఉంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200: ఈ మోటార్‌సైకిల్ రూ.1.90 లక్షల (ఎక్స్-షోరూం) ధరను కలిగి ఉంది. 199 సీసీ పెట్రోల్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. 40.36 కేఎంపీఎల్ వరకు మైలేజ్ ఇస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. రైడర్ల సేఫ్టీ కోసం డిస్క్ బ్రేకులను కలిగి ఉంది.

Bajaj Pulsar N200

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: బజాజ్ పల్సర్ ఇండియాలో ఒక ఐకానిక్ బైక్. చాలా సంవత్సరాలుగా యువతకు ఇది ఫేవరెట్. అమ్మకాలు తగ్గుతున్నప్పటికీ, పల్సర్ బ్రాండ్‌కు బలమైన పునాది ఉంది. కొత్త మోడల్స్, అప్డేట్స్‌తో బజాజ్ మళ్లీ అమ్మకాలను పెంచుతుంది. మార్కెట్‌లో పోటీ పెరగడం కూడా ఒక కారణం కావొచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 24, 2025, 18:50 [IST]
English summary
Analyzing bajaj pulsars performance why is indias youth icon losing sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+