KTM-యమహా కంపెనీలకు గట్టి షాక్.. సరైనోడు వచ్చేశాడు.. అదిరిపోతున్న సరికొత్త బైక్
ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ అప్రిలియా (Aprilia) భారత్‌లో కూడా తన వాహనాలను విక్రయిస్తుంది. ఇక్కడి లోకల్ కంపెనీలకు ప్రత్యర్థిగా నిలుస్తూ, అధునాతన మోడళ్లను భారతీయ వినియోగదారుల కోసం తీసుకొస్తుంది. తాజాగా కంపెనీ అదిరిపోయే డిజైన్‌తో సరికొత్త బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ పేరు 'అప్రిలియా టువోనో 457 (aprilia tuono 457)'. ఈ బైకును అప్రిలియా బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రముఖ భారతీయ నటుడు జాన్ అబ్రహం ప్రారంభించారు. దీని ధర రూ.3.95 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
ఇది ప్రధానంగా దేశంలో KTM 390 డ్యూక్ అలాగే, యమహా MT-03తో పోటీ పడుతుంది. టువోనో ధర RS457 మోడల్‌తో పోలిస్తే రూ. 25,000 తక్కువ ధరలనే కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ పైన పేర్కొన్న ధర ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ధర. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధర విషయంలో స్వల్ప మార్పులు ఉంటాయి. పన్నులు ఇతరత్ర వాటితో కలిపి ఆన్‌రోడ వచ్చేసరికి మరింత ఎక్కువగా ఉంటుంది.

టువోనో డిజైన్‌ను చూసినట్లయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్న టువోనో V4, 660 మోడళ్ల కంటే భిన్నమైన లుక్‌ను కలిగి ఉంది. వాటితో పోలిస్తే చాలా కొత్త మార్పులు ఉన్నాయి. దీనికి LED DRL లతో చుట్టూ కప్పబడినట్లుగా ఉండే సెంటర్-సెట్ LED హెడ్‌లైట్‌ను కలిగి ఉంది. మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ సెటప, ట్యాంక్‌కే కంపెనీ పేరును కూడా ఇచ్చారు. సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్ రైడర్లకు అనుకూలంగా ఉంటుంది.
ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే, 457 లిక్విడ్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్‌తో రన్ అవుతుంది. ఇది 46.9 bhp పవర్, 43.5 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఈ ఇంజిన్‌కు జోడించారు. ఇది ఆప్ఫనల్ క్విక్‌షిఫ్టర్‌ను కూడా కలిగి ఉంటుంది. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ చాలా ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు రైడర్లకు అవసరమయ్యే ఫీచర్స్‌ను బైక్‌లో అందించింది.

అప్రిలియా టువోనో 457 సస్పెన్షన్‌ను గురించి చూసినట్లయితే, ఫ్రంట్ 41 mm USD ఫోర్క్, బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను అందించారు. ఎత్తు పల్లాలు, గుంతలు ఉన్న రోడ్లపై కూడా ఇది మెరుగ్గా దూసుకుపోతుంది. ఇది ముందు, వెనుక ప్రీలోడ్ సర్దుబాటు కూడా కలిగి ఉంది. రైడర్లకు బైక్‌పై సులభమైన కంట్రోలింగ్ ఇవ్వడానికి ఫ్రంట్ డ్యూయల్ 320 mm డిస్క్‌లు, బ్యాక్ 220 mm డిస్క్ ఏర్పాటు చేశారు.
రైడర్లకు మరింత కంట్రోలింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ABS సిస్టంను ఇచ్చారు. అప్రిలియా టువోనో 457 కస్టమర్ల కోసం ప్యూమా గ్రే, పిరాన్హా రెడ్ అనే కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ లాంచ్‌తో భారత్‌లో తన మార్కెట్‌ను పెంచుకోవాలని అప్రిలియా కీలక ప్రయత్నాలు చేస్తుంది. KTM 390 డ్యూక్, యమహా MT-03 బైక్‌లకు ఈ కొత్త మోడల్ రాకతో సేల్స్ పరంగా గట్టి సవాల్ ఎదురుకానుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








