బైక్‌లా ఫీల్ ఇచ్చే స్కూటర్.. రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు మీపైనే! నమ్మలేని ఫీచర్లు ఉన్నాయ్!

భారత మార్కెట్ ప్రస్తుతం ఆటో పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు వరుసగా కొత్త కొత్త వాహనాలను విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్న కంపెనీలు కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ట్రెండ్‌కు అనుగుణంగా వినియోగదారులను ఆకట్టుకోవడానికి అధునాతన ఫీచర్స్‌తో కూడిన టూవీలర్స్‌ను తెస్తున్నాయి. ఇలాంటి వాటిలో అప్రిలియా (Aprilia) కూడా ఒకటి. ఈ కంపెనీ చాలా కాలంగా మార్కెట్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో అప్రిలియా తన కొత్త స్కూటర్ SR 175 ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న SR 160కి ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకుంది. స్పోర్టీ లుక్స్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ కలిగిన ఈ స్కూటర్‌ రూపకల్పనలో ప్రసిద్ధ RS 457 బైక్‌కి చెందిన డిజైన్ హింట్స్ స్పష్టంగా కనిపిస్తాయి.

ఆటోమోటివ్ ప్రీమియం సెగ్మెంట్‌లో అప్రిలియా స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న సంస్థగా, ప్రతిసారి కొత్తగా, శక్తివంతంగా మార్కెట్‌కి వస్తోంది. ఈ కొత్త మోడల్ కూడా బాగా ఆదరణ పొందుతుందని కంపెనీ ఆశలు పెట్టుకుంది. SR 175 స్కూటర్‌లో 174.7cc సామర్థ్యం కలిగిన సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 3-వాల్వ్ సెటప్‌తో రూపొందించబడింది. దీని వల్ల రైడింగ్ అనుభవం మరింత మెరుగ్గా, స్మూత్‌గా ఉంటుంది.

Aprilia Sr 175 Design

ఇది గరిష్ఠంగా 12.9 హెచ్‌పీ పవర్‌ను, 14.14 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. గతంలో ఉన్న SR 160 మోడల్‌కి ఇది కీలకమైన అప్‌గ్రేడ్‌. ఎందుకంటే పాతది 11.27 హెచ్‌పీ పవర్, 13.44 ఎన్ఎం టార్క్‌ మాత్రమే ఇస్తోంది. ఇదే కారణంగా SR 175 ఓ స్పోర్టీ స్కూటర్‌ను కోరుకునే యువత కోసం చక్కటి ఎంపికగా నిలుస్తోంది. ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకున్న ఈ మోడల్ పై ప్రజలలో ఆసక్తి మొదలైంది.

ధర పరంగా అప్రిలియా SR 175ను రూ.1.26 లక్షల(ఎక్స్-షోరూమ్) వద్ద మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లో నిలిచే ధరగానే చెప్పవచ్చు. ఇందులో లభించే టెక్నాలజీ, ఫీచర్లు దాని ధరను న్యాయంగా నిలబెడతాయి. ఈ స్కూటర్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం, దాని కలర్ TFT డిస్ప్లే. ఇది RS 457, Tuono 457 వంటి స్పోర్ట్ బైకుల్లో కనిపించే డిస్ప్లే లాంటి ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

Aprilia Sr 175 Price

ఈ డిజిటల్ స్క్రీన్ మల్టిపుల్ లేఅవుట్ ఆప్షన్లతో వస్తోంది, అంటే మీరు మీ అభిరుచికి అనుగుణంగా డిస్‌ప్లే లుక్‌ను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంకా విశేషంగా చెప్పాల్సిందంటే, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. దీనిద్వారా మీరు అప్రిలియా మొబైల్ యాప్‌తో స్కూటర్‌ను కనెక్ట్ చేసి, కాల్ అలర్ట్స్, నోటిఫికేషన్‌లు, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఉపయోగించవచ్చు. ఇది కేవలం స్కూటర్ కాకుండా ఒక స్మార్ట్ మొబిలిటీ పార్ట్నర్‌లా మారుతుంది.

అప్రిలియా SR 175 స్కూటర్, SR 160కి ప్రత్యామ్నాయంగా మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ, మెకానికల్ పరంగా మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. ఫ్రేమ్, సస్పెన్షన్, బ్రేకింగ్ వ్యవస్థలు, టైర్లు అన్నీ గత మోడల్‌లోని అవే కొనసాగుతున్నాయి. అదే 14-అంగుళాల అలాయ్ వీల్స్‌ అందించబడ్డాయి. బ్రేకింగ్ విషయంలో, ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌తో పాటు సింగిల్ ఛానల్ ABS వ్యవస్థను అందిస్తున్నారు.

Aprilia New Scooter Sr 175

అయితే, ఈసారి కలర్ ఆప్షన్ల విషయంలో మాత్రం స్పష్టమైన కొత్తదనం ఉంది. RS 457 బైక్ డిజైన్, పెయింట్ స్కీమ్‌ల నుంచి ప్రేరణ పొందిన ఈ స్కూటర్, ప్రత్యేకించి ఎరుపు (Red), ఊదా ఎరుపు (Purple-Red) కలర్ టోన్‌లలో అందుబాటులో ఉంది. ఇవి స్కూటర్‌కు స్పోర్టీ లుక్‌ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, July 19, 2025, 11:19 [IST]
English summary
Aprilia new scooter sr 175 launched price design engine details check here
Read more on: #aprilia #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+