రూ.1.23 లక్షలు ఉంటే చాలు.. బైక్ కంటే స్పీడుగా వెళ్లే స్కూటర్.. ఇది ఎక్కారంటే రేసింగ్ ఫీల్ పక్కా

భారతదేశంలో స్కూటర్లకు మంచి ఆదరణ ఉంది. హోండా యాక్టివా నుండి ప్రారంభించి, మార్కెట్లో ఇప్పుడు చాలా రకాల స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. స్పోర్టీ లుక్‌తో కూడిన పెర్ఫార్మెన్స్ స్కూటర్‌ను భారతీయులకు మొదటిసారి పరిచయం చేసింది ఇటాలియన్ బ్రాండ్ అప్రిలియా. ఇప్పుడు యూత్ ను లక్ష్యంగా చేసుకుని, కొత్త 175 సీసీ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ MotoGP రేసింగ్ ప్రియులను ఆకట్టుకోవడం ఖాయం.

మన దేశంలో స్కూటర్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. కస్టమర్ల డిమాండును దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఇటాలియన్ బ్రాండ్ అయిన అప్రిలియా కొత్తగా ఓ స్పోర్టీ స్కూటర్‌ను రిలీజ్ చేసింది. ఈ స్కూటర్ మోటోజీపీ (MotoGP) రేసింగ్‌కు సంబంధించిన వెహికల్ స్టైలింగ్‌ను పోలి ఉంటుంది.

Aprilia SR-GP Replica 175 hp-e Price Specs and Features of the New Sporty Scooter

అప్రిలియా SR-GP రెప్లికా 175 hp-e అనే ఈ కొత్త స్కూటర్ ధర రూ. 1.23 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది కొత్తగా వచ్చిన జీఎస్టీ రేట్ల ఆధారంగా నిర్ణయించిన ధర. ఈ స్కూటర్ చూడటానికి రేసింగ్ బైక్‌లా కనిపిస్తుంది.

ఈ స్కూటర్ డిజైన్‌ను మోటోజీపీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో జార్జ్ మార్టిన్, మార్కో బెసాచి నడిపిన RS-GP మోటార్‌సైకిల్ నుంచి స్ఫూర్తి పొంది తయారు చేశారు. దీని బాడీ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎరుపు, ఊదా రంగులో ఉన్న గ్రాఫిక్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

అప్రిలియా కంపెనీ లోగో స్కూటర్‌కి రెండు వైపులా, మధ్యలో కూడా ఉంటుంది. అప్రిలియా రేసింగ్ టీమ్ స్పాన్సర్ లోగోలు కూడా దీనికి స్పెషల్ లుక్ అందిస్తాయి. ముందు వైపు వీల్స్‌కు బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్‌తో పాటు రెడ్ కలర్ డిటైలింగ్స్ ఉన్నాయి.

Aprilia SR-GP Replica 175 hp-e Price Specs and Features of the New Sporty Scooter

ఫీచర్స్, టెక్నాలజీ
ఈ స్కూటర్‌లో అనేక లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. పవర్‌ఫుల్ LED హెడ్‌ల్యాంప్స్ రాత్రిపూట రైడింగ్‌కు చాలా ఉపయోగపడతాయి. ఇండికేటర్లు, టెయిల్ లైట్స్‌కు కూడా ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. సీటు కింద చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.

ఈ స్కూటర్ మరో మెయిన్ ఎట్రాక్షన్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే. ఇది ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. రైడర్లు తమకు నచ్చిన లేఅవుట్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. అప్రిలియా యాప్‌ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి ఫోన్ కాల్స్, మ్యూజిక్, నావిగేషన్ వంటి వాటిని యాక్సెస్ చేయవచ్చు. అలాగే, యాప్ ద్వారా రైడింగ్ డేటా వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

Aprilia SR-GP Replica 175 hp-e Price Specs and Features of the New Sporty Scooter

ఇంజిన్, పెర్ఫార్మెన్స్
అప్రిలియా SR-GP రెప్లికా 175 hp-e స్కూటర్‌లో 174.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 3-వాల్వ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ సీవీటీ (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది 12.92 bhp పవర్, 14.14 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ స్కూటర్ స్ట్రాంగ్ స్టీల్ ఫ్రేమ్‌పై నిర్మించారు. సస్పెన్షన్ కోసం ముందువైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుకవైపు అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. దీనికి 14-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో వెంటిలేటెడ్ డిస్క్, వెనుక భాగంలో డ్రమ్ యూనిట్ ఇచ్చారు. ఎక్స్ ట్రా సేఫ్టీ కోసం సింగిల్-ఛానెల్ ఏబీఎస్ కూడా ఈ స్కూటర్‌లో ఉంది. ఈ కొత్త మోడల్‌కి బుకింగ్స్, టెస్ట్ రైడ్‌లు, డెలివరీలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 24, 2025, 13:28 [IST]
English summary
Aprilia sr gp replica 175 hp e price specs and features of the new sporty scooter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+