ఓలాకు సవాల్.. ఫ్రీగా 10 రోజుల పాటు 15 పాయింట్ హెల్త్ చెకప్, పండుగ డిస్కౌంట్లు ఇస్తున్న ఏథర్

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో ఏథర్ ఎనర్జీ తనదైన ముద్ర వేసింది. ఓలా వంటి పెద్ద కంపెనీలకు ముందే భారతీయ వినియోగదారులకు ఈవీ అనుభవాన్ని పరిచయం చేసిన బెంగళూరుకు చెందిన ఈ సంస్థ, నాణ్యమైన ఉత్పత్తులు, నమ్మకమైన సర్వీసులతో మార్కెట్‌లో ముందుంది. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఏథర్ తన ప్రస్తుత కస్టమర్ల కోసం ఒక ప్రత్యేక సర్వీస్ కార్నివాల్‌ను ప్రకటించింది.

ఓలా వంటి పెద్ద కంపెనీలు ఉన్నప్పటికీ, ఏథర్ స్థిరమైన ప్రగతి సాధించడానికి ముఖ్య కారణం దాని నమ్మకమైన సర్వీస్. ఇప్పుడు పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఏథర్ తన వినియోగదారులకు అక్టోబర్ 9 నుండి 18 వరకు ప్రత్యేక సర్వీస్ కార్నివాల్ను ప్రకటించింది. తమ ఇ-స్కూటర్లను ఉచితంగా టెస్ట్ చేయించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ క్యాంపెయిన్ వివరాలు, ఏథర్ సాధించిన విజయాల గురించి ఈ కథనంలో చూద్దాం.

Ather Energy Announces Service Carnival Free 15-Point Vehicle Check-up and Festive Discounts

ఏథర్ ఎనర్జీ సంస్థ తన ప్రస్తుత ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుల కోసం అక్టోబర్ 9 నుండి 18, 2025 వరకు ప్రత్యేక సర్వీస్ కార్నివాల్‌ను ప్రకటించింది. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం, పండుగ సీజన్‌లో వినియోగదారుల ఇ-స్కూటర్లు బెస్ట్ పర్ఫామెన్సుతో ఉన్నాయని నిర్ధారించడం. ఈ సర్వీస్ కార్నివాల్‌లో భాగంగా, ఏథర్ ఇవి ఓనర్లు తమ దగ్గర్లోని సర్వీస్ సెంటర్‌ను సందర్శించి, 15-పాయింట్ వెహికల్ హెల్త్ చెకప్ను పూర్తిగా ఉచితంగా చేయించుకోవచ్చు.

ఈ 15-పాయింట్ చెకప్‌లో, స్కూటర్ బ్రేక్‌లు, టైర్లు, సస్పెన్షన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వంటి ముఖ్యమైన భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీనివల్ల స్కూటర్‌లో ఏవైనా సమస్యలు ఉంటే గుర్తించి, సమయానికి రిపేర్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉచిత హెల్త్ చెకప్‌తో పాటు, ఏథర్ పలు మెయింటెనెన్స్ సర్వీసులపై ప్రత్యేక పండుగ డిస్కౌంట్లు కూడా అందిస్తోంది.

Ather Energy Announces Service Carnival Free 15-Point Vehicle Check-up and Festive Discounts

లేబర్ ఛార్జీలు, బ్రేక్ ప్యాడ్స్ మార్చడంపై 10 శాతం తగ్గింపు. పెయింటెడ్ బాడీ పార్ట్స్‌పై 15 శాతం తగ్గింపు. పాలిష్ సర్వీసులపై 20 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్లు వినియోగదారులకు మెయింటెనెన్స్ ఖర్చును గణనీయంగా తగ్గిస్తాయి.

ఏథర్ ఎనర్జీ ఇటీవల ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. తమిళనాడులోని హోసూర్ ప్లాంట్ నుండి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసి ఈ స్టార్టప్ కంపెనీ రికార్డు సృష్టించింది. 2013లో స్థాపించబడిన ఏథర్, కేవలం ఆరు సంవత్సరాలలోనే భారతీయ ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో అగ్రగామిగా నిలిచింది. ఇటీవల సెప్టెంబర్ 2025 అమ్మకాల గణాంకాలలో ఏథర్, ఓలా ఎలక్ట్రిక్‌ను దాటి మూడవ స్థానంలో నిలిచిన కొద్ది రోజులకే ఈ ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం విశేషం.

Ather Energy Announces Service Carnival Free 15-Point Vehicle Check-up and Festive Discounts

ఏథర్ వృద్ధికి ప్రధాన కారణమైన మోడల్‌లో రిజ్తా ఫ్యామిలీ స్కూటర్ ఒకటి. ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా పేరు తెచ్చుకున్న ఏథర్ రిజ్తా, భారతదేశంలో ఒక లక్ష యూనిట్ల అమ్మకాల మార్కును వేగంగా చేరుకుంది. ఈ స్కూటర్ S, Z 2.9 kWh, Z 3.7 kWh అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది.

టాప్ మోడల్ అయిన రిజ్తా Z (3.9 kWh బ్యాటరీ ప్యాక్) ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కి.మీ రేంజ్ ఇస్తుంది. దీని మోటార్ 4.3 kW (5.7 bhp) శక్తితో 22 Nm టార్క్ అందిస్తుంది. 4.7 సెకన్లలో 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకోగలదు.

More from DriveSpark

Article Published On: Saturday, October 11, 2025, 7:14 [IST]
English summary
Ather energy announces service carnival free 15 point vehicle check up and festive discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+