ఉద్యోగం, షాపింగ్, కాలేజ్.. ఏ అవసరానికైనా పర్ఫెక్ట్! 159 కి.మీ దాకా నాన్‌స్టాప్ రైడ్.. అదిరిపోతున్న స్కూటర్
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ రంగాన్ని కొత్త దిశలో నడిపిస్తున్న ఏథర్ ఎనర్జీ (Ather Energy) తాజాగా, కొత్త 'రిజ్టా ఎస్ (Rizta s)'ను 3.7kWh బ్యాటరీ ప్యాక్‌తో విడుదల చేసింది. ఇది రోజువారీ ప్రయాణికులకు, లాంగ్ రేంజ్ స్కూటర్‌గా ఇది నిలుస్తుందని ఏథర్ ప్రకటించింది. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 159 కి.మీ.ల IDC రేంజ్ అందిస్తుంది. ఏథర్ రిజ్టా మొదట 2024లో ఫ్యామిలీ స్కూటర్‌గా ప్రవేశపెట్టబడింది. రోజూ ఆఫీసు, బడి, షాపింగ్ వంటి అవసరాలకు ఉపయోగపడేలా, సౌలభ్యం, భద్రత, నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ దీనిని రూపొందించారు. రాజీ లేకుండా ఎక్కువ రేంజ్, అదే సమయంలో వినియోగదారుల కష్టాలు తక్కువయ్యేలా, సమర్థవంతమైన టెక్నాలజీ అందించడం ఈ వేరియంట్ ప్రధాన లక్ష్యం.
ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే, ఈ స్కూటర్‌కు మార్కెట్లో భారీ ఆదరణ లభించింది. ప్రారంభమైన కేవలం ఏడాదిలో 1 లక్ష యూనిట్ల అమ్మకాలను దాటడం, రిజ్టాపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రస్తుతం ఏథర్ మొత్తం విక్రయాలలో 60 శాతం వాటా రిజ్టా స్కూటర్‌దే కావడం కూడా దీని డిమాండ్‌ను స్పష్టంగా చూపుతోంది. ఈ నేపథ్యంలో కొత్త మోడల్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తన స్థానం మరింత బలపరుస్తుందని ఏథర్ భావిస్తుంది.

కొత్తగా పరిచయమైన 3.7kWh వేరియంట్ రిజ్టా ఎస్ రేంజ్, ధర పరంగా కుటుంబాల కోసం అత్యుత్తమమైన ఎంపికగా నిలుస్తుందని ఏథర్ ఎనర్జీ విశ్వసిస్తోంది. అందుబాటు ఖర్చుతో దూర ప్రయాణ సామర్థ్యం కావడం, రోజువారీ రకరకాల అవసరాలకు సరిపోవడం, రిజ్టా Sను మరింత ప్రత్యేకతతో నిలబెట్టింది. ఈ లాంచ్‌తో, రిజ్టా లైన్-అప్ మొత్తం నాలుగు వేరియంట్లకు విస్తరించింది. దీంతో వినియోగదారులు తమకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.
ఈ రిజ్టా స్కూటర్‌లో అత్యంత పెద్ద సీటును ఉంది. దీని ఫ్లోర్‌బోర్డ్ డిజైన్ విశాలంగా, ఆచరణాత్మకంగా ఉండటంతో, రైడర్‌కే కాదు, వెనుక కూర్చున్న ప్రయాణికుడికి సౌకర్యాన్ని అందిస్తుంది. 34-లీటర్ల విస్తారమైన అండర్ సీట్ స్టోరేజ్ అందుబాటులో ఉండడం, రోజువారీ బ్యాగులు, సామాన్లు సులభంగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అవసరమైతే ముందు సీటు ద్వారా నిల్వ సామర్థ్యాన్ని 22 లీటర్ల వరకు మరింత పెంచుకోవచ్చు.

ఈ స్కూటర్‌లో ప్రధాన ఆకర్షణ 7-అంగుళాల డీప్‌వ్యూ డిస్‌ప్లే. దాని స్మార్ట్ ఇంటర్‌ఫేస్ ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్ పొందడం సులభం అవుతుంది. దీని ద్వారా రైడింగ్ అనుభవం మరింత స్మార్ట్‌గా, ఇంటిలిజెంట్‌గా మారుతుంది. దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఆటో హోల్డ్, ట్రాఫిక్‌లో సౌకర్యవంతమైన బ్రేకింగ్, ఫాల్ సేఫ్ ఫీచర్, స్కూటర్ పడిపోతే ఆటోమేటిక్‌గా పవర్ కట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటివి ఉన్నాయి.
ఇంకా థెఫ్ట్ అలర్ట్‌లు, జీపీఎస్ ద్వారా స్కూటర్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఫైండ్ మై స్కూటర్, వాయిస్ కంట్రోల్ ద్వారా ఇంటెలిజెంట్ ఇంటరాక్షన్ కోసం అలెక్సా స్కిల్స్ మొదలగునవి ఈ స్కూటర్‌లో అందించారు. ఇంకా, అన్ని ఏథర్ స్కూటర్ల మాదిరిగానే, ఈ వేరియంట్ ఏథర్ ఎయిట్70 వారంటీ ప్రోగ్రామ్ ఉంది. దీని కింద 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లు (ఏది ముందుగా వస్తే అది) పూర్తి బ్యాటరీ వారంటీ అందిస్తారు.
ఏథర్ రిజ్టా S 3.7kWh బ్యాటరీ ప్యాక్ స్కూటర్ కోసం బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. వినియోగదారులు ఏథర్ డీలర్‌షిప్‌ల ద్వారా గానీ, లేక అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా గానీ తక్షణమే బుకింగ్ చేసుకోవచ్చు. దీని ధర రూ.1,37,047 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్). ఈ కొత్త వేరియంట్‌కి డెలివరీలు ఈ నెల నుంచే ప్రారంభం అవుతాయి.


Click it and Unblock the Notifications








