హాట్ జిలేబీల్లా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్క నెలలోనే ఈ కంపెనీ రికార్డు సేల్స్.. టెన్షన్ పడుతున్న టీవీఎస్, బజాజ్
బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ (Ather Energy), ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (Two Wheeler) తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. దేశీయంగా అనేక ఈ-స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి చాలా చక్కటి డిజైన్, అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. కస్టమర్లు కూడా పోటీ పడి కొనుగోలు చేశారు. దానికి సాక్ష్యంగా ఈ 2025 ఆగస్టులో కంపెనీ స్కూటర్లు భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఆ వివరాలు ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వాహన్ పోర్టల్ ప్రకారం.. ఇదే ఆగస్టు నెలలో ఏథర్ ఎనర్జీ మొత్తం 17,856 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. 2024 ఆగస్టులో 11,046 యూనిట్లను విక్రయించింది. ఈ సంఖ్యలను పోల్చి చూస్తే, అమ్మకాలు సంవత్సరానికి 62% పెరిగాయి.

ఈ సంవత్సరం మొదటి 7 నెలల్లో అంటే జనవరి నుండి జూలై వరకు, ఏథర్ స్కూటర్లు భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. మొత్తం 98,190 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఈ సంఖ్యలను లెక్కించినప్పుడు ప్రతి నెలా సగటున 14,027 యూనిట్లు అమ్ముడయ్యాయి.
2018లో దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లోకి ఏథర్ ఎనర్జీ ప్రవేశించిన తర్వాత, ఇదే అత్యధిక నెలవారీ అమ్మకాల సంఖ్య. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, హీరో విడా వంటి వాటి నుండి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, ఏథర్ రిజ్తా, 450, 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు భారీగా అమ్ముడయ్యాయి.

ఇటీవల ఏథర్ 450ఎస్ 3.7 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్ వేరియంట్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ స్కూటర్ ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). పూర్తి ఛార్జ్‌పై 161 కిలోమీటర్ల రేంజ్ (మైలేజ్) ఇస్తుంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. స్మార్ట్, ఎకో, రైడ్, స్పోర్ట్ అనే 4 రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది.
ఇందులో ఉపయోగించిన 5.4 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్, 22 ఎన్‌ఎమ్ (న్యూటన్ మీటర్) పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7-అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఏథర్‌స్టాక్ ప్రో సాఫ్ట్‌వేర్, ఆటోహోల్డ్, ఫాల్ సేఫ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.11 లక్షల నుండి రూ. 1.47 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. డెక్కన్ గ్రే, సియాచిన్ వైట్, పాంగోంగ్ బ్లూ, కార్డమామ్ గ్రీన్, పాంగోంగ్ బ్లూ వంటి రంగులలో కూడా లభిస్తుంది.
కొత్త రిజ్తా స్కూటర్ శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కలిగి ఉంది. 2.9 కిలోవాట్ (kWh), 3.7 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 123 నుండి 160 కిలోమీటర్ల రేంజ్ (మైలేజ్) ఇస్తుంది. 80 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్‌ను కలిగి ఉంది.
ఇది 7-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. స్మార్ట్, ఎకో, జిప్ అనే రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ముందు (ఫ్రంట్) టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక (రేర్) మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. డిస్క్/డ్రమ్ బ్రేక్‌లను కూడా కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








