దేశంలో ఏకంగా లక్ష కుటుంబాలకు బాగా నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్.. రోడ్డు మీద దూసుకెళ్తున్న ఏథర్ రిజ్టా

ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ ఇటీవల వేగంగా మారుతోంది. ముఖ్యంగా, ఒకప్పుడు యువతకే పరిమితమైన ఈవీ స్కూటర్ మార్కెట్, ఇప్పుడు కుటుంబ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతోంది. ఈ మార్పులో కీలక పాత్ర పోషించినది ఏథర్ ఎనర్జీకి చెందిన రిజ్టా. ఇది ఒక "ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్". పెద్ద సీటు, మెరుగైన లెగ్‌ స్పెస్, స్థిరమైన శ్రేణి, అలాగే అందుబాటులో ఉండే ధర వంటి అంశాలపై ఏథర్ స్పష్టంగా దృష్టి పెట్టింది. దీనిని తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, గృహిణులు వంటి వినియోగదారులను కూడా దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇప్పటికే బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా S1 వంటి మార్కెట్లో స్థిరంగా నిలిచిన దిగ్గజాల మధ్య, రిజ్టా పోటీకి దిగి తనదైన గుర్తింపు పొందింది.

ఈ వినూత్న మోడల్ మార్కెట్‌లోకి వచ్చిన కొన్ని గంటలకే మంచి స్పందనతో వినియోగదారుల మనసును గెలుచుకుంది. మార్కెట్లోకి ప్రవేశించిన కేవలం ఒక సంవత్సరంలోనే రిజ్టా మోడల్ 1 లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇది కేవలం ఓ స్కూటర్ విక్రయాన్ని మాత్రమే కాదు, భారతీయులకు ఈవీల పట్ల ఉన్న ఆదరణను కూడా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ అవసరాలకు ఇవి చాలా కీలకంగా మారాయి.

Ather Rizta Design

ఈ మైలురాయితో ఏథర్ ఎనర్జీ మార్కెట్‌లో తన స్థానం మరింత బలపరచింది. ఇది తదుపరి వృద్ధికి మార్గం వేయడమే కాకుండా, ఇతర కంపెనీలకు కూడా ప్రేరణనిస్తుంది. రోజువారీ ప్రయాణాల్లో నమ్మకం, సౌకర్యం వంటి అంశాలను వెతుక్కునే వినియోగదారులకు ఇది సరైన ఎంపికగా మారింది. యువత నుంచి పెద్దల వరకు, కుటుంబం మొత్తం ఉపయోగించగల ఈవీగా రిజ్టా స్కూటర్ తన ఉనికిని చాటుకుంది.

ప్రస్తుతం మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న మోడల్‌ను చూసినట్లయితే ఏథర్ రిజ్టా రూ.1.04 లక్షల నుంచి రూ.1.42 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో S, Z 2.9 kWh, Z 3.7 kWhలలో లభిస్తుంది. వినియోగదారుల అవసరాలను బట్టి వేరియంట్లను ఎంచుకునే అవకాశం ఉంది. S, Z 2.9 kWh వేరియంట్లు ఒకే ఛార్జ్‌పై 123 కిలోమీటర్ల(IDC) రేంజ్ అందిస్తాయి.

Ather Rizta Family Electric Scooter Crossed One Lakh Sales

అదే ఎక్కువ రేంజ్ కావాలనుకునే వారికి Z వెర్షన్‌ బాగా సరిపోతుంది. దీని 3.7 kWh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 159 కిలోమీటర్ల(IDC) పరిధిని అందిస్తుంది. పనితీరు పరంగా ఇది 4.3 kW(సుమారు 5.7 bhp) పవర్, అలాగే గరిష్టంగా 22 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అంశాలు సాధారణ నగర ప్రయాణాలకు తగినట్లుగా ఉండి, తేలికపాటి టాప్ వేగంతో, స్మూత్ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

దేశీయంగా స్వయంగా అభివృద్ధి చేయబడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా, ఏథర్ రిజ్టా తన పనితీరు, సౌలభ్యం, సాంకేతికతతో ఈ విభాగంలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. దీనికి అందుబాటులో ఉన్న మూడు వేరియంట్లలో ఏదైనా తీసుకున్నా, 0-40 కి.మీ/గం వేగాన్ని కేవలం 4.7 సెకన్లలో చేరగలదు, ఇది రోజువారీ నగర ప్రయాణాల్లో తేలికపాటి డ్రైవింగ్ అవసరాలకు అద్భుతమైన స్పందనను అందిస్తుంది. అయితే, టాప్ స్పీడ్ 80 కి.మీ/గం వద్దే పరిమితం చేశారు.

Ather Rizta Family Scooter

ఫీచర్ల పరంగా చూస్తే, ఏథర్ రిజ్టా ఒకదాని కంటే ఒకటి మెరుగైన సాంకేతికతతో నిండి ఉంది. మ్యాజిక్ ట్విస్ట్ అనే వినూత్న ఫీచర్ వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించగా, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఆధునిక సౌకర్యాలు వినియోగదారులకు టెక్నాలజీతో నిండి ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. అంతేకాదు, వాట్సాప్ నోటిఫికేషన్‌లు, అలెక్సా వాయిస్ అసిస్టెన్స్ వంటివి కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, June 2, 2025, 15:20 [IST]
English summary
Ather rizta family electric scooter crossed one lakh sales milestone in 1 year
Read more on: #ather energy #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+