Ather Energy ఏక్ ధమ్ ఫీచర్.. ఇకపై తెలుగులో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యాష్ బోర్డ్!
ఎలక్ట్రిక్ టూ- వీలర్ తయారీ రంగంలో ఏథర్ ఎనర్జీ మంచి పేరు దక్కించుకుంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ఈవీలు.. భారత కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ సేల్స్ పెంచుకుంటూ ఈవీల్లో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ కంపెనీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తమిళనాడు హోసూర్‌లో కూడా ఉంది. అయితే.. తాజాగా ఈ సంస్థ తెలుగు ప్రజలకు ఓ మంచి వార్త చెప్పింది. ఇక నుంచి తమ రిజ్తా జెడ్ స్కూటర్ మోడల్‌లోని డ్యాష్ బోర్డులో తెలుగు భాష సహా 8 ప్రాంతీయ భాషల్ని కూడా వినియోగించనున్నట్లు తెలిపింది. దీంతో ఇకపై వినియోగదారులు వివిధ భాషల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ ఆంధ్ర, తెలంగాణ ప్రజలను బాగా ఆకట్టుకోనుంది. తెలుగుతో పాటు ఇతర భాషల వారికి కూడా ఈ ఫీచర్ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందని చెప్పవచ్చు. తెలుగే కాకుండా ఇతర అనేక భాషలను కూడా తమ టూ- వీలర్‌కు జోడించినట్లు ఈ సంస్థ ప్రకటించింది.

మరాఠి, గుజరాతీ, బెంగాళీ, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషలను కూడా ఏథర్ సంస్థ ప్రవేశపెట్టింది. తాజాగా ఈ సంస్థ నుంచి విడుదలైన రిజ్తా జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలోఈ భాషలు అందుబాటులో ఉండనున్నాయి. తమ సొంత భాష వినియోగిస్తూ... సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తున్న నెటిజన్ల సంఖ్య ఈమధ్య పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. ఏథర్ సంస్థ కూడా తమ టూ- వీలర్‌లో ఈ కీ ల్యాంగ్వేజెస్‌ను ప్రవేశపెట్టింది.
ఎవరైతే తమ మాతృభాష పట్ల మక్కువ చూపిస్తారో వారు ఈ స్కూటర్‌ను ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉంది. ఏథర్ రిజ్తా జెడ్ వినియోగదారులు తమ స్కూటర్‌లోని OTA సాఫ్ట్‌వేర్ అప్డేట్ ద్వారా ఈ ఫీచర్‌ను పొందవచ్చు. అంతేగాకుండా ఈ స్కూటర్‌లో మరిన్ని ప్రత్యేక ఫీచర్లను కూడా ఈ సంస్థ ప్రవేశపెట్టింది. దీంట్లో ఆటో హెల్డ్, వాట్సాప్ ఇన్ ఫర్మేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, అలెక్సా వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

దీంతో పాటుగా ఇప్పుడు మల్టిపుల్ ల్యాంగ్వేజెస్ ను ప్రవేశపెట్టడం ఈ స్కూటర్‌కు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ రిజ్టా స్కూటర్ మోడల్ ఫ్యామిలీ వారికి బాగా పని చేస్తుంది. ఈ రిజ్తాలో టాప్-ఎండ్ వేరియంట్ రిజ్తా జెడ్. ఈ స్కూటర్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఒకటి 2.9 kWh బ్యాటరీ ప్యాక్ కాగా.. మరొకటి 3.7 kWh బ్యాటరీ ప్యాక్.
మొదటి బ్యాటరీ ప్యాక్ స్కూటర్ ధర రూ.1.26 లక్షలు ఉండగా.. రెండో స్కూటర్ ధర రూ.1.46 లక్షలుగా ఉంది. ఈ రిజ్టా స్కూటర్ 1.09 లక్షలకు కూడా లభిస్తుంది. ఇందులో రిజ్తా ఎస్ వేరియంట్ ఈ ధరలో అందుబాటులో ఉంది. ఇది ఎంట్రీ- లెవెల్ స్కూటర్. ఇవన్నీ ఎక్స్- షో రూమ్ ధరలు కావడం గమనార్హం.

ఈ స్కూటర్‌లో 2.9kWh బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో 123 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. ఇక 3.7 kWh వేరియంట్.. 159 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. ఈ మూడు స్కూటర్ల టాప్ స్పీడ్ కేవలం 80 kmph. అదే విధంగా ఈ మూడు స్కూటర్లలో కొన్ని ఫీచర్లు సేమ్ ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో 7- అంగుళాల స్క్రీన్ ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కుటుంబ వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో లార్జ్ సీట్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. బ్యాక్ రెస్ట్ కూడా ఉంటుంది. ఏథర్ సంస్థ వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువచ్చే ప్రయత్నంలో ఉంది.


Click it and Unblock the Notifications