బుల్లెట్ కొనాలనుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. భారీగా ధరలు పెంచి షాకిచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్

అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. అందరికీ తెగ నచ్చే బైక్ ఏంటంటే ఠక్కున చెప్పే ఒకే ఒక్క పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్. ఆ గంభీరమైన డగ్ డగ్ సౌండ్‌తో రోడ్ల మీద దూసుకెళ్లే ఈ బుల్లెట్ ప్రస్తుతం ఓ మోడ్రన్ హీరో అయిపోయింది. ఒకప్పుడు "ఆ వైబ్రేషన్లు భరించలేం సామీ!" అని ఆటపట్టించినోళ్లే ఇప్పుడు ఎన్‌ఫీల్డ్ ఫ్యాన్స్‌గా మారిపోయారు.

మన దేశంలో మిడ్-సైజ్ బైకుల సెగ్మెంట్‌ని ఇన్నాళ్లూ ఏలేసిందంటే మామూలు విషయం కాదు కదా. ట్రయంఫ్, హార్లీ డేవిడ్‌సన్, హోండా, యెజ్డీ, జావా లాంటి దిగ్గజాలు పోటీకి వచ్చినా జనం మాత్రం ఎన్‌ఫీల్డ్ అంటే పడి చస్తారు.

Royal Enfield

ఒకప్పుడు ఈ బుల్లెట్‌ని స్టేటస్ సింబల్‎గా చూసేవాళ్లు. కానీ, ఇప్పుడు అమ్మాయిలు కూడా అవలీలగా నడిపేస్తున్నారు. ఆ పాత కాలపు లుక్, పక్కా మోడరన్ ఇంజిన్.. అన్నీ కలిపి ఈ బైక్ చాలామందికి ఒక పిచ్చి క్రేజ్. వైబ్రేషన్లు కూడా చాలావరకు తగ్గిపోయాయి కాబట్టి, నడపడం కూడా హాయిగానే ఉంది. అందుకే, ఇప్పుడు ఎవరూ పెద్దగా కంప్లైంట్లు చెప్పడం లేదు.

అయితే, ఇకపై మాత్రం చాలామంది షోరూమ్‌ల ముందు క్యూ కట్టేసి అయ్యో అని గగ్గోలు పెట్టే అవకాశం ఉంది. దానికి కారణం ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్ ధరను పెంచేసింది. తొందర్లో బుల్లెట్ కొనెయ్యాలని ప్లాన్ వేసుకున్న వాళ్లకు ఇది పెద్ద దెబ్బ. ఈ నిర్ణయం వల్ల చాలామంది నిరాశపడడం ఖాయం.

Royal Enfield

కంపెనీ కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. బుల్లెట్‌కి ఇకపై రూ.2,000 నుంచి రూ.3,000 అదనంగా చెల్లించుకోవాలి. కొత్త బండి తీసుకునేటప్పుడు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకుందాం అని దాచుకున్న పైసలు.. ఇప్పుడు ఈ ధర పెంపుకి సరిపోతాయి. "ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయాయి కాబట్టి, 350 సీసీ బుల్లెట్ ధరను మార్చాల్సి వచ్చింది" అని కంపెనీ చెబుతోంది. మరి ఏ మోడల్‌కి ఎంత పెరిగిందో వివరంగా చూద్దాం.

పోయిన ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన బటాలియన్ బ్లాక్ వేరియంట్తో బుల్లెట్ 350 సిరీస్ మొదలవుతుంది. బటాలియన్ బ్లాక్ అంటేనే ఆ పాతకాలపు లుక్‌కి కొత్త మెరుగులు అద్దినట్లు ఉంటుంది. ఈ మోడల్ రూ.1.75 లక్షల ప్రారంభ ధరతో దొరికేది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బటాలియన్ బ్లాక్ ఇప్పుడు మిలిటరీ బ్లాక్, మిలిటరీ రెడ్‎ల కంటే తక్కువ ధరలో దొరుకుతుంది.

Royal Enfield

మిలిటరీ బ్లాక్, మిలిటరీ రెడ్ వేరియంట్‌లకి ఇప్పుడు రూ.1.76 లక్షలు కట్టాలి. ఇంతకుముందు ఈ రెండు వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధర రూ.1.74 లక్షలు ఉండేది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 స్టాండర్డ్ బ్లాక్, స్టాండర్డ్ మరూన్ వేరియంట్‌లకి ఇప్పుడు రూ.2 లక్షలు రేటు అయింది. ఇవి ఇంతకుముందు రూ.1.97 లక్షల ప్రారంభ ధరతో దొరికేవి.

టాప్ వేరియంట్ అయిన బ్లాక్ గోల్డ్ ఇప్పుడు రూ.2.18 లక్షలకి ఇంటికి తీసుకెళ్లవచ్చు. అంతకుముందు ఈ మోడల్ ధర రూ.2.16 లక్షలు ఉండేది. ధర మార్పులు తప్ప, బైక్‌లో ఇంకేమీ మార్పులు లేవు. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ వాళ్లు తమ 350 సీసీ బైకులకి స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ని జోడించి అప్‌డేట్ చేసే పనిలో ఉన్నారు.

Royal Enfield

2025 హంటర్ 350లో ఈ ఫీచర్ ఆల్రెడీ పెట్టేశారు. ఇప్పుడు క్లాసిక్, బుల్లెట్ లాంటి మోడళ్లకి కూడా ఈ ఫీచర్ వస్తే, రైడింగ్ ఇంకా జోష్‌గా ఉంటుంది. ఈ స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ వల్ల క్లచ్ ఆపరేషన్ చాలా తేలిక అవుతుంది. గేర్లు మార్చడం కూడా స్మూత్‌గా జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ గుండె 349 సీసీ, సింగిల్ సిలిండర్ ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్.

5-స్పీడ్ కాన్‌స్టంట్ మెష్ గేర్‌బాక్స్‎తో కలిపి పనిచేసే ఈ ఇంజిన్ 20.2 బిహెచ్‌పి పవర్, 27 ఎన్ఎమ్ టార్క్‎ను ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త J ప్లాట్‌ఫారమ్, ఇంజిన్ వచ్చాక, శబ్దం, వైబ్రేషన్లు బాగా తగ్గిపోయాయి. సస్పెన్షన్ కోసం ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ధర పెంచడం, ఉత్పత్తి ఖర్చులు ఎక్కువయ్యాయని కంపెనీ చెబుతోంది. ఈ ధరల పెంపు కొన్నాళ్ల పాటు కొనేవాళ్లకు నిరాశ కలిగించినా, బుల్లెట్‌కి ఉన్న క్రేజ్, స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ లాంటి కొత్త అప్‌డేట్‌లు దాని పాపులారిటీని తగ్గిపోకుండా చూస్తాయి. బుల్లెట్ అభిమానులు ఈ చిన్న ధరల పెంపుని పెద్దగా పట్టించుకోకపోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 18, 2025, 9:00 [IST]
English summary
Bad news for bullet buyers royal enfield bullet 350 price increased
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+