పల్సర్ బైకుపై రూ.23 వేల తగ్గింపు.. డిమాండ్ పెరగకముందే షోరూమ్‌కు పరిగెత్తండి!
పండుగ సీజన్‌లో బజాజ్ పల్సర్ (bajaj pulsar) సిరీస్ ఎలా అమ్ముడుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షోరూంల ముందు భారీగా క్యూలు, డెలివరీల కోసం ఎదురుచూసే కస్టమర్లు, డిమాండ్‌ను ఏ క్షణానైనా ఛేదించేలా ఉన్న మార్కెట్ ఉత్సాహం.. ఇవన్నీ కలిసి పల్సర్ బ్రాండ్‌కు మరోసారి తన సత్తాను చాటించాయి. ఈ వేడిని కొనసాగించాలనుకున్న బజాజ్ ఆటో ఇప్పుడు కస్టమర్ల కోసం నిజంగా రుచికరమైన వార్తను ప్రకటించింది. పల్సర్ అభిమానులు ఎంతో ఇష్టపడే పల్సర్ హ్యాట్రిక్ ఆఫర్ (Pulsar Hattrick Offer) ను కంపెనీ మళ్లీ తీసుకొస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. ఇది సాధారణ ఆఫర్ కాదు... సంవత్సరాంతానికి ముందే బైక్ కొనాలనుకునే వారికి పూర్తిగా అదనపు విలువను అందించే ప్రత్యేక పథకం.
బజాజ్ చెబుతున్నదేమిటంటే, పల్సర్ తీసుకోవాలనుకునే వారు ఈ సమయంలో కొంటే వేరే కాలంతో పోలిస్తే నిజంగానే భారీగా సేవ్ చేసుకునే అవకాశం ఉంది. పల్సర్ కొనుగోలుదారులకు ఇప్పుడు లభించే రూ. 23,000 వరకు విలువైన బెనిఫిట్ ప్యాకేజ్ ఈ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుతోంది. మోడల్‌ను బట్టి ఈ ప్రయోజనాలు మారుతాయి కానీ మొత్తానికి కస్టమర్‌కు వచ్చే లాభం మాత్రం ఖచ్చితంగా గమనించదగ్గంత ఉంటుంది.

చాలా మంది బైక్ ఎంచుకునేటప్పుడు EMIలు, ప్రారంభ ఖర్చులు, ఇన్సూరెన్స్, సేవ్ అయ్యే మొత్తాలను దృష్టిలో ఉంచుకుంటారు. ఈ సమయంలో పల్సర్ కొనుగోలు చేస్తే ఆ అన్ని లెక్కల్లో కూడా ఒక భారీ తేడా కనిపిస్తుంది. సాధారణంగా ఏడాది చివరికి కంపెనీలు స్టాక్ క్లీయరింగ్ కోసం కొన్ని ఆఫర్లు ఇస్తాయి. అయితే బజాజ్ ఇచ్చిన ఈ ఆఫర్ మాత్రం కేవలం స్టాక్ కోసం కాదు.
ఈ తగ్గింపు పండగల సీజన్‌లో రెట్టింపు ఉత్సాహంతో కొనుగోలు చేసిన కస్టమర్ల విశ్వాసానికి ప్రతిఫలంగా ఇచ్చే ప్రత్యేక కానుకే చెప్పాలి. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఈ బజాజ్ పల్సర్ హ్యాట్రిక్ ఆఫర్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది ఇందులో దాగి ఉన్న మూడు ప్రధాన పొదుపులు. సాధారణంగా ఒక బైక్ కొనేటప్పుడు కస్టమర్లు గమనించే ఖర్చులు GST ప్రభావం, ప్రాసెసింగ్ ఛార్జీలు, బీమా ఖర్చులు. ఇవన్నీ కలవడంతో మొత్తం బడ్జెట్ పెరిగిపోతుంది.

కానీ ఈ ఆఫర్‌లో బజాజ్ పూర్తిగా భిన్నమైన దృక్పథంతో ముందుకు వచ్చింది. మొదటిగా, ఇటీవలి GST సవరణ నుండి వచ్చిన మొత్తాన్నీ నేరుగా వినియోగదారులకు అందించడం చాలా పెద్ద ప్లస్ పాయింట్. చాలా బ్రాండ్‌లు ఈ ప్రయోజనాలను కొంతవరకు మాత్రమే పాస్ చేస్తే, బజాజ్ మాత్రం పూర్తి బెనిఫిట్‌ను కస్టమర్‌కు అందిస్తోంది. దీని వల్ల బైక్ ధర గణనీయంగా తగ్గి, కొనుగోలుదారులకు నేరుగా ఆదా అయ్యే మొత్తం కూడా పెరుగుతోంది.
అదే సమయంలో, చాలా మంది పట్టించుకోని కానీ బైక్ మొత్త ఖర్చులో ప్రభావం చూపే ప్రాసెసింగ్ ఛార్జీలు పూర్తిగా మాఫీ అవడం మరో ప్రయోజనం. లోన్ తీసుకునే వారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా వేల రూపాయల వరకు ఉండే ఈ ఛార్జీలు రద్దవడంతో బైక్ ప్రారంభ ఖర్చు మరింత తగ్గుతుంది. మూడోది, ఇన్సూరెన్స్‌పై లభించే పొదుపులు. బజాజ్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలపై కూడా ప్రత్యేక రాయితీలు ఇస్తోంది.

పల్సర్ 125 CFపై రూ.11488, పల్సర్ NS 125 ABSపై రూ.24,443, పల్సర్ 150 TDపై రూ.15,348, పల్సర్ NS 160పై రూ.17,687, పల్సర్ NS 200పై రూ.18,885, పల్సర్ RS200 పై రూ.23,467 ధరలకు హ్యాట్రిక్ ఆఫర్‌లను పొందుతారు. అత్యంత ముఖ్యంగా చెప్పాల్సిన విషయం, ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు దగ్గరలోని షోరూమ్‌లో సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications








