ఇకపై ఆ మూడు బైకులు రోడ్లపై కనిపించవు.. ఈ బైక్ ఫ్యాన్స్ పొట్టగొట్టిన కంపెనీ!
భారతీయ టూ-వీలర్ మార్కెట్లో దిగ్గజ సంస్థ బజాజ్‌కు ఉన్న పేరు ప్రత్యేకమైనది. యూత్ నుంచి కామన్ మ్యాన్స్ వరకు.. అందరూ ఇష్టపడే బైకులు తయారు చేస్తూ ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన పల్సర్ బైక్.. యువతలో చాలా మందికి ఫేవరెట్ బైక్‌గా ఉంది. ఈ బైక్‌లోని కొన్ని మోడల్స్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతలా.. టూ వీలర్ ప్రేమికుల మనసు దోచిన ఈ సంస్థ తాజాగా ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ నుంచి కొన్ని బైకుల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందులో... కొన్ని పాపులర్ మోడళ్లకు చెందిన బైకులు కూడా ఉన్నాయి. ఏయే మోడళ్ల బైకులను బజాజ్ నిలిపివేస్తోంది? అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? వీటికి ప్రత్యామ్నాయం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
బజాజ్ సంస్థ నుంచి అందుబాటులో ఉన్న మరో బైక్ ప్లాటినా. మైలీజీ పరంగా టూ-వీలర్ మార్కెట్లో తిరుగులేనిదిగా పేరు సంపాదించింది. ఈ బైక్... 90 నుంచి 100 kmpl మైలేజీ ఇవ్వగలదు. కామన్ మ్యాన్‌కు సరిగ్గా సరిపోయే బైకుగా గుర్తింపు తెచ్చుకుంది. 100 సీసీతో వచ్చిన ఈ బైక్.. ఈ సెగ్మెంట్‌లో ఇది హీరో స్ప్లెండర్‌కి గట్టి పోటీ ఇచ్చింది.

ఆ తర్వాత ఇదే మోడల్ నుంచి బజాజ్ సంస్థ.. ప్లాటినా 110సీసీ బైక్ కూడా విడుదల చేసింది. ఈ బైక్ కూడా.. తొందరగానే సేల్స్ పెంచుకోగలిగింది. అయితే.. బజాజ్ సంస్థ ఈ నూతన సంవత్సర వేళ తమ బ్రాండ్ నుంచి కొన్ని మోటార్ సైకిళ్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందులో ఈ ప్లాటినా మోడల్ బైక్ కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే... ప్లాటిినా మోడల్ నుంచి 100 సీసీ బైక్ కాకుండా కేవలం 110సీసీతో వచ్చే బైకు తయారీని మాత్రమే నిలిపివేయడం గమనార్హం. మరోవైపు.. పల్సర్ F250 స్పోర్ట్స్ బైకు తయారీని కూడా నిలిపివేస్తున్నట్లు బజాజ్ సంస్థ ప్రకటించింది. దాంతో పాటు ప్లాటినా సీటీ125X మోడల్ కూడా.. నిలిపివేస్తున్న జాబితాలో ఉంది. మార్కెట్ నుంచి వీటిని తప్పించడానికి గల కారణమేంటంటే.. కొద్ది సంవత్సరాలుగా ఈ మోడల్ బైకులు అనుకున్నంత సేల్స్‌ను సాధించలేదు.

అయితే... ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ బైకులన్నీ కూడా నాలుగేళ్ల క్రితమే లాంఛ్ అయిన మోడల్స్. ప్లాటినా 110ABS బైకు.. బజాజ్ సంస్థ నుంచి సింగిల్ - ఛానల్ ఏబీఎస్(Anti-Lock Braking System (ABS)) తో వచ్చిన బైకు. ఈ సెగ్మెంట్‌లో ఇది అత్యంత ఖరీదైన బైకుగా పేరు సంపాదించింది. 2022లో వచ్చి ఈ బైక్ ఎక్స్-షో రూమ్ ధర రూ. 72,224 గా ఉంది.
బజాజ్ ప్లాటినా 110 సీసీ బైకు... ఆధునాతన ఫీచర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతేగాకుండా స్పీడో మీటర్, ఓడో మీటర్, ట్రిప్ మీటర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ 110 సీసీ ఏబీఎస్ వేరియంట్లో.. డిస్క్ బ్రేకులు సహా ట్యూబ్ లెస్ టైర్ల సపోర్ట్‌తో ఉంటుంది.

బజాజ్ ప్లాటినా ఏబీఎస్ మోడల్‌లో మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఇది 11.45సీసీ, సింగిల్- సిలిండర్, ఎయిర్- కూల్డ్ ఇంజిన్‌తో ఉంటుంది. ఈ బైక్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో అనుసంధానించి ఉంటుంది. ఇది 7,000 rpm వద్ద 8.4bhpని, 5,000 rpm వద్ద 9.81Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ప్లాటినా సీటీ 125X ధర రూ.71,354 నుంచి రూ.74,454 (ఎక్స్‌షోరూమ్) మధ్య ఉంది. 125సీసీతో వచ్చినప్పటికీ ఈ మోడల్ బైకు.. కస్టమర్స్ దగ్గరి నుంచి ఆశించినంత రెస్పాన్స్ సొంతం చేసుకోలేకపోయింది. అదే సమయంలో.. ఇదే సంస్థ నుంచి 125 సీసీ ఇంజిన్‌తో వచ్చిన పల్సర్ 125, పల్సర్ NS 125 మోడళ్లు బాగానే ఆకట్టుకున్నాయి.
ప్లాటినా సీటీ 125X మోడల్ బైకు.. 11.6bhp, 11Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 125 సీసీ బైకుల సెగ్మెంట్‌లో అత్యంత అందుబాటు ధరలో ఉన్న బైకుగా ఇది పేరు సొంతం చేసుకుంది. ఇది ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్‌తో ఉండే బల్బ్ హెడ్ లైట్ వంటి ఫ్యాన్సీ ఫీచర్లతో వచ్చింది. ధర విషయంలో చూస్తే ఇది హోండా షైన్, హోండా ఎస్పీ 125, హీరో గ్లామర్ బైకులకు పోటీగా నిలిచింది.


Click it and Unblock the Notifications








