ఇథనాల్‌తో నడిచే టూవీలర్ వచ్చేస్తుంది.. ఆటో ఎక్స్‌పోలో ఫ్యాన్స్‌కు పండగే!
"భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025"కు మరికొన్ని రోజులే ఉంది. అనేక ఆటో మొబైల్ సంస్థలు తమ కొత్త వాహనాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. వినియోగదారులు కూడా ఈసారి ఏమేం కొత్త మోడళ్లు రాబోతున్నాయో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో... ఈ ఆటో ఎక్స్‌పోలో తమ ప్రత్యేకత చాటుకోవాలని భావిస్తోంది. ఈసారి ఆ సంస్థ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఇథనాల్- పవర్డ్ వాహనాలను పరిచేయం చేయనుంది. 2024లో సేల్స్‌తో అదరగొట్టిన ఈ సంస్థ.. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఎక్స్‌పోలో.. బజాజ్ తన అన్ని మోడళ్లను ప్రదర్శనలో ఉంచనప్పటికీ వాటికి సంబంధించిన స్నీక్ పీక్ మాత్రం వెల్లడించనుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
చేతక్ 35 సిరీస్: ఒకప్పుడు స్కూటర్‌లలో బాగా ఫేమస్ అయిన మోడల్ బజాజ్ నుంచి వచ్చిన చేతక్. ఈ చేతక్‌కు సంబంధించి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఇటీవలే మార్కెట్లోకి తీసుకువచ్చింది బజాజ్ సంస్థ. ఇది 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో అనుకూలమైన ధరలో అందుబాటులో ఉంది. ఇప్పుడు జరిగే ఆటో ఎక్స్‌పోలో ఈ ఇ- స్కూటర్‌కు సంబంధించి మరో మూడు కొత్త మోడళ్లను బజాజ్ సంస్థ పరిచయం చేయనుంది.

బజాజ్ పల్సర్ RS200: ఎలక్ట్రిక్ స్కూటర్లే కాదు.. ఈసారి బజాజ్ సంస్థ బైకులను పరిచయం చేయడంలోనూ తగ్గేదేలా అంటోంది. తమ సంస్థ నుంచి ఫేమస్ మోడల్ బైకు అయిన పల్సర్‌కు సంబంధించి పల్సర్ RS200 అనే కొత్త మోడల్ వివరాలను కూడా ఈ ఆటో ఎక్స్ పోలో వెల్లడించనుంది. కీలకమైన అప్డేట్లతో ఈ కొత్త పల్సర్ RS200 మోడల్‌ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది బజాజ్ సంస్థ.
ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు: కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో శిలాజేతర ఇంధనాలతో నడిచే వాహనాల తయారీపై అనేక సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో ఇథనాల్ పవర్‌డ్ మోటార్ సైకిళ్ల తయారు చేయడంపై బజాజ్ సంస్థ దృష్టి సారించింది. ఈ ఆటో ఎక్స్ పో 2025లో ఇథనాల్‌తో నడిచే కొత్త వాహనాలను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

అంతకుముందు జరిగిన ఆటో ఎక్స్‌పోలో బజాజ్ సంస్థ E60-E85 ఇథనాల్ బ్లెండ్‌తో పని చేసే Pulsar NS160 ని ప్రదర్శించింది. ఈ ఏడాది కూడా ఈ సంస్థ ఇదే సాంకేతికతతో నడిచే కొత్త వాహనాలను పరిచయం చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇవి మార్కెట్‌లోకి రావడం ద్వారా సేల్స్ పెరిగే అవకాశం ఉంది.
అంతేగాకుండా.. ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్‌కి సంబంధించి కొత్త వేరియంట్‌ను కూడా ఈ ఆటో ఎక్స్ పోలో జజాజ్ సంస్థ పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే తొలిసారి ఫ్రీడమ్ 125 పేరుతో ఈ సీఎన్‌జీ బైకును 2024లో జులైలో మార్కెట్లో లాంచ్ చేసింది. ఆరు నెలల్లోనే దీన్ని 40,000 మందికి పైగా వినియోగదారులు కొనుగోలు చేశారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








