ఒకే నెలలో 1.50 లక్షలకు పైగా కొనగోళ్లు.. ఈ కంపెనీ టూవీలర్స్‌కు విదేశాల్లో యమ క్రేజీ.. హీరో, హోండా సైతం కిందికే
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత టూవీలర్ మార్కెట్ చాలా పెద్దది. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక కంపెనీకి చెందిన టూవీలర్ కనిపిస్తుంది. జనాభా ఎక్కువగా ఉన్న కారణంగా అందరూ కూడా తమ రోజువారి అవసరాలకు తప్పనిసరిగా టూవీలర్ కలిగి ఉంటారు. దీంతో డిమాండ్ భారత్‌లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా బాగా ప్రసిద్ధి చెందిన టూవీలర్ తయారీదారులు అధునాతన ఫీచర్స్, సరికొత్త డిజైన్లతో కూడిన మోడళ్లను విడుదల చేస్తున్నారు. వీటిని భారత్‌లోనే విక్రయిస్తూనే అదే సమయంలో డిమాండ్ ఉన్న ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో భారత టూవీలర్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ తయారయ్యే వాహనాలను ఇతర దేశాల ప్రజలు ఎంతో ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఆదరణ ఎక్కువ కావడంతో కంపెనీలు సైతం తమ టూవీలర్స్‌ను వేగంగా సరఫరా చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో ఈ ఎగుమతుల సంఖ్య భారీగా పెరిగింది. 2025 జనవరి నెలలో ఇతర దేశాలకు టూవీలర్స్‌ను రవాణా చేసిన జాబితాలో దిగ్గజ కంపెనీ బజాజ్ ఆటో ముందు స్థానంలో నిలిచింది. డేటా ప్రకారం, గత నెలలో మొత్తం 1,57,114 యూనిట్ల టూవీలర్స్‌ను కంపెనీ ఎగుమతి చేసింది. సాధారణంగా హీరో(Hero) మోటోకార్స్, హోండా(Honda) కంపెనీలు ఈ జాబితాలో నిలుస్తాయి. కానీ ఇప్పుడు బజాజ్ వాటిని అధిగమించి అగ్రస్థానం పొందడం గమనార్హం.

2024 జనవరి నెలలో బజాజ్(Bajaj) ఆటో విదేశాలకు చేసిన ఎగుమతులతో పోలిస్తే ఈ సారి 36.74 శాతం పెరిగింది. తరువాత మరో దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్(Tvs) మోటార్స్ ఎగుమతుల పరంగా రెండో స్థానంలో ఉంది. జనవరి నెలలో మొత్తం 93,811 యూనిట్ల టూవీలర్స్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ముఖ్యం విషయం ఏమిటంటే దేశీయ అతిపెద్ద టూవీలర్ తయారీదారు అయిన హీరో, హోండా కంపెనీలను అధిగమించడం విశేషం.
టీవీఎస్ మోటార్స్ గత ఏడాది 2024 జనవరి నెలతో పోలిస్తే ఈ సారి ఎగుమతులు 52.03 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇక మూడో స్థానంలో దిగ్గజ కంపెనీ హోండా ఉంది. సమీక్ష నెలలో ఈ సంస్థ 41,870 యూనిట్ల టూవీలర్స్‌ను విదేశాలకు సరఫరా చేసింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే వృద్ధి రేటు 13.5 శాతంగా ఉంది. తరువాత హీరో మోటోకార్ప్ 34,495 యూనిట్ల ఎగుమతులతో నాల్గవ స్థానంలో ఉంది.

ఇక ఐదో స్థానం విషయానికి వస్తే, సుజుకీ(Suzuki) కంపెనీ మొత్తం 21,087 యూనిట్ల టూవీలర్స్ ఎగుమతులను నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది దాదాపు 38.27 శాతం వృద్ధి. మరో భారతీయ దిగ్గజ కంపెనీ బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్ 2025 జనవరిలో 10,080 యూనిట్ల వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇది వార్షికంగా చూసినట్లయితే దాదాపు 79.01 శాతం వృద్దిగా ఉంది.
అదే దేశీయంగా చూసినట్లయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇక్కడి మార్కెట్లో 80 వేల టూవీలర్స్‌ను విక్రయించింది. బజాజ్ ఆటో అయితే ఏకంగా దేశీయంగా 1,71,299 యూనిట్ల టూవీలర్స్‌ను విక్రయించగా, ఇది గత ఏడాది ఇదే నెలలో 1,93,350 యూనిట్లుగా ఉంది. హీరో, హోండా కంపెనీలకు పోటీగా బజాజ్ ఆటో క్రమంగా తన వ్యాపారాన్ని భారీ ఎత్తున విస్తరిస్తుంది. త్వరలో పలు కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని చూస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








