ఓలా-టీవీఎస్‌కు గట్టి షాక్.. అదిరిపోయే ఫీచర్స్‌తో బజాజ్ చేతక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తుంది!

భారతదేశంలో ప్రముఖ టూవీలర్ తయారీదారుగా ఉన్నటువంటి బజాజ్ ఆటో (Bajaj Auto) తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. ఈ స్కూటర్ పేరు బజాజ్ చేతక్ 3001 (Bajaj Chetak 3001). ఈ స్కూటర్ త్వరలోనే, అనగా ఈ వారం చివర్లో విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికీ అధికారిక స్పెసిఫికేషన్లు ప్రకటించనప్పటికీ, అందిన సమాచారం ప్రకారం ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న చేతక్ 2903కి ప్రత్యామ్నాయంగా లేదా అదనపు వేరియంట్‌గా రాబోతోంది. పెరుగుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ పోటీని దృష్టిలో ఉంచుకొని, బజాజ్ ఈ మోడల్‌ను చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి ఉండవచ్చని అంచనా. ఇప్పటికే చేతక్ బ్రాండ్‌కు ఉన్న పేరు, నమ్మకాన్ని కొనసాగిస్తూ, కొత్త తరం వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా ఈ మోడల్ నిలవనుంది.

ఈ కొత్త మోడల్‌లో 3.1kW ఎలక్ట్రిక్ మోటార్ ఉండే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 62 కిలోమీటర్ల వేగంతో గంటకు ప్రయాణించగలదు. ఈ స్పీడ్, స్కూటర్‌ను ముఖ్యంగా రోజువారీ పట్టణ ప్రయాణాలు, ఆఫీస్ వెళ్లే రూట్‌లు, లేదా షార్ట్ డిస్టెన్స్ వంటి అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. పేరుకు తగ్గట్టే, ఇది 3kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే అవకాశముంది. అంటే, ఈ వాహనం మంచి రేంజ్‌ను అందించే అవకాశం ఉంది.

3001 Electric Scooter Will Be Launch Soon

దీంతో పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యమ్నాయంగా దీన్ని ఎంచుకునే అవకాశం ఉంది. బజాజ్ ఆటో తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3001ను అధికారికంగా ఈ వారం ప్రకటించనున్న నేపథ్యంలో, దీని డిజైన్, పరిమాణాలు, ముఖ్యమైన స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. ఈ మోడల్, రోజువారీ వినియోగదారులకు సరిపోయేలా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రవాణా అవసరాలకు అనుగుణంగా రూపొందించబడినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

చేతక్ 3001 మొత్తం 1,914 మిమీ పొడవు, 725 మిమీ వెడల్పు, 1,143 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి 168 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో, నీటితో నిండిన రోడ్లపై కూడా సులువుగా నడిపే అవకాశం ఉంటుంది. అలాగే, 1,355 మిమీ వీల్‌బేస్ దీన్ని మరింత స్థిరంగా, బ్యాలెన్స్‌డ్‌గా రోడ్లపై నడిపేలా చేస్తుంది. స్కూటర్ బరువు కూడా మధ్యస్థంగా ఉంటుంది.

Bajaj Chetak 3001 Electric Scooter

లొడ్ చేయని బరువు 123 కిలోలు మాత్రమే ఉండడం వల్ల, ప్రత్యేకంగా మహిళలకు కూడా వినియోగంలో తేలికగా ఉంటుంది. ఈ స్కూటర్‌కు ముందు, వెనుక చక్రాలపై 90/90-12 సైజ్ టైర్లు ఇవ్వబడ్డాయి, ఇవి రైడ్ కంఫర్ట్‌ను మెరుగుపరుస్తాయి. ఇదే సైజ్ టైరింగ్ సెటప్ ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్ మోడళ్లతో సరిగ్గా సరిపోతుంది. ఇది మిడ్-రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లక్ష్యంగా చేసుకుని తీసుకురాబోతున్న మరో మోడల్ అవుతుంది.

ధర విషయానికి వస్తే, పోటీతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని, బజాజ్ ఈ స్కూటర్‌ను రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ధరకు అందించే అవకాశం ఉంది. త్వరలో అధికారిక లాంచ్ అనంతరం, ఖచ్చితమైన ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, బుకింగ్ వివరాలు, ఏఏ నగరాల్లో అందుబాటులో ఉంటుందనే విషయాలు వెల్లడవుతాయి. అయితే ఇప్పటివరకు అందిన వివరాలు చూస్తే, చేతక్ 3001 బజాజ్ చేతక్ లైనప్‌లో మరో బలమైన చాప్టర్‌ను ప్రారంభించబోతోందని చెప్పవచ్చు.

Bajaj Chetak 3001

వెర్షన్‌పై ఆధారపడి, 2.2kWh లేదా 3kWh బ్యాటరీ ప్యాక్, 3.1kW మోటార్, 62 కి.మీ/గం. వేగం, సుమారుగా 100 కి.మీ వరకు రేంజ్ లాంటి లక్షణాలు దీనిలో ఉండే అవకాశం ఉంది. ఈ స్పెసిఫికేషన్లు బజాజ్ చేతక్ 3001ను ఓలా S1 Z, TVS iQube లాంటి ప్రీమియం స్కూటర్లతో గట్టిగా పోటీ పడే స్థాయికి తీసుకెళ్లనున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 17, 2025, 7:30 [IST]
English summary
Bajaj chetak 3001 electric scooter will be launch soon in india details
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+