ఓలాను ఎదురించే మోడల్ వచ్చేసింది.. ఏకంగా టీవీఎస్‌ ఐక్యూబ్‌ను దాటేసిన బజాజ్‌ చేతక్

వాహన పరిశ్రమకు 2024 కచ్చితంగా గుర్తుంటుంది. దానికి ప్రధాన కారణం గత సంవత్సరాల కంటే కూడా ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఓ రేంజ్‌లో పుంజుకున్నాయి. పెట్రోల్, డీజిల్, cng వాహనాలతో పాటే సమానంగా ఈవీల సేల్స్ కూడా నమోదయ్యాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా రాబోయే తరం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాలదే అనే విధంగా వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేశారు. ఇంధన ధరలు అధికంగా ఉండటం, మెయింటనెన్స్ ఖర్చులు ఎక్కువ కావడంతో డబ్బులు ఆదా చేయడానికి ఈవీలను అధికంగా కొంటున్నారు. దీని వలన రానున్న రోజుల్లో కాలుష్య కారకాల ఉద్గారాలు కూడా తగ్గుముఖం పడుతాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీ తయారీదారులకు ప్రోత్సహకాలు, ఇవ్వడంతో పాటు కొత్త ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి అన్ని విధాల సహకారం అందిస్తుంది. దీంతో తయారీదారులు పోటీ పడుతూ ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

2024 ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెరగడంపై తయారీ దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోజువారి అవసరాలకు ఉపయోగకరంగా ఉండే ఎలక్ట్రిక్ టూవీలర్లు పాత ఏడాదిలో అత్యధికంగా సేల్స్‌ను సాధించాయి. తాజాగా విడుదల అయిన నివేదిక ప్రకారం, 2024 ఏడాది సేల్ అయిన మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో టూ వీలర్ల వాటా 59 శాతంగా ఉంది. ఈ గణంకాలను చూస్తేనే వీటికి డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో తెలిసిపోతుంది.

Electric Two Wheeler Sales

సాధారణంగా ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో ఓలా ఈవీ కంపెనీ సేల్స్ పరంగా మొదటి స్థానంలో ఉంటుంది. అయితే తాజా డేటా ప్రకారం, 2024 డిసెంబర్ నెలలో ఈవీ టూవీలర్ల సేల్స్‌లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ, బజాజ్ కంపెనీ మొదటి ప్లేస్‌లోకి వచ్చింది. భారత ఈవీ మార్కెట్ పెరుగుతుండటాన్ని గమనించిన బజాజ్, దీనిలో ఎక్కువ వాటాను సాధించడానికి ఎలక్ట్రిక్ టూవీలర్లను లాంచ్ చేయాలని నిర్ణయించుకుంది.

అందుకే 2024 ఏడాదిలో చివరి నెలల్లో తన ఫేవరెట్ చేతక్ (chetak) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది లాంచ్‌కు ముందే దాని డిజైన్, ఫీచర్లతో అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మోడల్ అమ్మకాల పరంగా డిసెంబర్‌లో ఇతర కంపెనీల కంటే ముందు స్థానంలో నిలిచి ఓలా ఎలక్ట్రిక్‌కు గట్టి పోటీ ఇచ్చింది. తాజాగా వాహన్ పోర్టల్ ప్రకారం, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో మొదటి స్థానం పొందింది.

Tvs Electric Two Wheeler Sales

తర్వాత ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్(TVS) రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఓలా ఎలక్ట్రిక్ ఉంది. 2024 డిసెంబర్ నెలలో మొత్తం 73,316 యూనిట్ల ఈవీ టూవీలర్లు అమ్ముడుపోయాయి. వీటిలో 18,276 యూనిట్ల అమ్మకాలతో బజాజ్ చేతక్ అగ్రస్థానంలో ఉంది. బజాజ్‌కు 2024 ఏడాది బాగా కలిసివచ్చిందని డేటాను చూస్తేనే తెలిసిపోతుంది. 2023తో పోలిస్తే కొత్త కస్టమర్లకు కంపెనీ అన్ని వాహనాలకు కలిపి 169 శాతం పెరిగారు.

2024 అక్టోబర్ నెలలో బజాజ్ చేతక్ 28,360 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఈ సమయంలో దీపావళి పండుగ సీజన్ కారణంగా సేల్స్ బాగా పుంజుకున్నాయి. కంపెనీ ఇటీవల విడుదల చేసిన చేతక్ 35 సిరీస్ ద్వారా రానున్న రోజుల్లో మార్కెట్లో బజాజ్ సేల్స్ పరంగా మరిన్ని అమ్మకాలను నమోదు చేస్తుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది.

Ola Electric Two Wheeler Sales

కొత్త చేతక్ 35 సిరీస్ ధర దేశీయ మార్కెట్లో రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.27 లక్షల వరకు ఉంది. డిసెంబర్ నెల అమ్మకాలను చూసినట్లయితే TVS కంపెనీకి చెందిన iCube 17,212 యూనిట్లు అమ్ముడుపోయింది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి కూడా టీవీఎస్ గట్టి పోటీ ఇచ్చింది.

More from DriveSpark

Article Published On: Thursday, January 2, 2025, 15:28 [IST]
English summary
Bajaj chetak electric two wheeler first place in december 2024 sales
Read more on: #electric scooter #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+