యూత్‌కు పండుగే.. ఎంత దూరం వెళ్లినా నో రిస్క్.. బులెట్‌కి సవాల్ విసురుతున్న బజాజ్ కొత్త 400 సీసీ బైక్
టూరింగ్ బైకుల విషయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఇప్పటి వరకు తిరుగులేదనే చెప్పాలి. దానికి గట్టి పోటీ ఇవ్వడానికి తాజాగా ఇండియాలో బజాజ్ డోమినార్ అనే కొత్త బైక్ వచ్చింది. మొదటి అడ్వర్టైజ్‌మెంట్‌లోనే బులెట్‌ను టార్గెట్ చేస్తూ దేశంలో బడ్జెట్-ఫ్రెండ్లీ స్పోర్ట్స్ టూరర్ విభాగంలో డోమినార్ ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో బాగానే దూసుకెళ్లినప్పటికీ కాలం మారే కొద్దీ బులెట్ మార్కెట్ విపరీతంగా పెరిగిందే తప్ప, డోమినార్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
తర్వాత మోడ్రన్ బైక్‌ల రాకతో డోమినార్ తన మునుపటి వైభవాన్ని కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ యువతలో ట్రెండ్ అవ్వడానికి బజాజ్ డోమినార్ కొత్త మోడల్‌తో వస్తోంది. ఇందుకు సంబంధించి బజాజ్ సోషల్ మీడియాలో కొన్ని టీజర్ ఫోటోలను షేర్ చేసుకుంది. 2016లో మొదటిసారి వచ్చిన డోమినార్‌కు ఇది జనరేషన్ ఛేంజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన 400సీసీ మోటార్‌బైక్‌లలో ఒకటైన డోమినార్ రాక, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ ఇస్తుందా అనేది చూడాలి. కొత్తగా రాబోతున్న 2025 బజాజ్ డోమినార్ ఇటీవల డీలర్‌షిప్‌లకు చేరుకుందని నివేదికలు వచ్చాయి. అంటే, త్వరలోనే లాంచ్, డెలివరీలు ప్రారంభమవుతాయని ఇది సూచిస్తుంది. 400సీసీ మోడల్‌తో పాటు డోమినార్ 250సీసీ మోడల్ కూడా మార్పులతో మార్కెట్‌లోకి వస్తుందని బజాజ్ టీజర్ ద్వారా చెప్పకనే చెప్పింది.
డోమినార్ 250 మోడల్ గురించి హాష్‌ట్యాగ్‌ను పోస్ట్‌లో చేర్చడం ఈ అంచనాకు కారణం. డిజైన్‌లో లేదా ప్రాథమిక రూపంలో పెద్దగా మార్పులు లేనప్పటికీ, ఈసారి మరిన్ని ఫీచర్‌లు, కొత్త గ్రాఫిక్స్‌తో మోడ్రన్‌గా మారడానికి బజాజ్ ట్రై చేయనుంది.

2025 బజాజ్ డోమినార్ 400 స్పోర్ట్స్ టూరర్‌కు కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. ఇది పల్సర్ NS400Z మోడల్‌లో మొదట వచ్చిన యూనిట్ కావచ్చని సమాచారం. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్‌లను ఈ మోటార్‌సైకిల్‌లో అందిస్తారు. అలాగే, ఇతర చాలా సమాచారం కూడా ఈ క్లస్టర్‌లో ప్రదర్శించబడుతుంది.
ఈ డిస్‌ప్లేకు సపోర్ట్‌గా బజాజ్ స్విచ్ గేర్‌ను కూడా మార్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా, హజార్డ్ లైట్‌ల కోసం ఒక ప్రత్యేక బటన్‌ను కూడా చేర్చారు. కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ప్రవేశపెట్టినందున, ఫ్యూయల్ ట్యాంక్‌పై ఉన్న చిన్న డిస్‌ప్లేను బజాజ్ తొలగించిందని సమాచారం. ABS మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ స్పోర్ట్స్ టూరర్‌కు రావడం వల్ల ఇది మరింత ఎట్రాక్టివ్‌గా మారుతుంది.

ఈ ఫీచర్‌ల రాకతో ఇప్పుడు రైడ్-బై-వైర్ కూడా 2025 బజాజ్ డోమినార్ 400సీసీలో అందిస్తారు. మొబైల్ పరికరాలను ఛార్జ్ చేయడానికి USB పోర్ట్, సౌలభ్యం కోసం అడ్జస్టబుల్ లీవర్‌లను కూడా బజాజ్ ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా, బైక్ టూరింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి టూరింగ్ యాక్సెసరీలను కూడా కంపెనీ అందిస్తుంది.
రైడర్‌ను గాలి నుంచి రక్షించడానికి డోమినార్ 400 ఒక పెద్ద విండ్‌స్క్రీన్తో వస్తుంది. అలాగే, రైడర్‌కు నకిల్ గార్డ్‌లు, ఇంజిన్ సేఫ్టీకి బాష్ ప్లేట్ కూడా బజాజ్ అందిస్తుంది. వీటికి అదనంగా, బ్రాండ్ పిలియన్ బ్యాక్‌రెస్ట్, లగేజ్ కోసం సాడిల్ స్టేలను కూడా ఇస్తుంది. ఈ అదనపు యాక్సెసరీలతో రైడర్లు ఇకపై బయట నుంచి యాక్సెసరీలను కొనుగోలు చేయవలసిన అవసరం ఉండదు.
ప్రస్తుత మోడల్‌లో ఉన్న 373.3 సీసీ ఇంజిన్ నే 2025 డోమినార్ 400 మోడల్‌కు కూడా వస్తుంది. బజాజ్ ఈ ఇంజిన్‌ను తాజా OBD-2B ఎమిషన్ ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే, పెర్ఫార్మెన్స్ గణాంకాలలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ ఇంజిన్ 39.42 బీహెచ్‌పీ పవర్, 35 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: బజాజ్ డోమినార్ 400 కొత్తగా, మరిన్ని ఫీచర్లతో వస్తుండడం చాలా ఆసక్తికరంగా ఉంది. బులెట్‌కు నిజమైన పోటీ ఇవ్వగలదా లేదా అనేది మార్కెట్లోకి వచ్చాక తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








