330 కి.మీ మైలేజ్ ఇచ్చే బజాజ్ బైక్‌కు ఫుల్ డిమాండ్.. 9 నెలల్లో 50 వేల మంది కొన్నారు!
బజాజ్ ఆటో ప్రపంచంలో మొట్టమొదటి CNG బైకును విడుదల చేసి ఆటోమొబైల్ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మోడల్ పేరు 'బజాజ్ ఫ్రీడమ్ 125 CNG (Bajaj Freedom 125 CNG)'. ఈ బైక్ తొలిసారి జులై 2024లో భారత మార్కెట్లోకి వచ్చింది. ప్రారంభంలో ఈ బైక్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఆతరువాత కాలంలో కొంత వరకు డిమాండ్ తగ్గింది. కానీ తాజాగా మళ్లీ ఈ బైక్‌కు మోజు పెరిగినట్లు స్పష్టమవుతోంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణంకాల ప్రకారం, ప్రస్తుతం ఈ బైక్ దాదాపు 50,000 యూనిట్లు అమ్ముడైనట్టు సమాచారం. ఇది మార్కెట్లోకి విడుదలయ్యి దాదాపు 9 నెలలు అయింది. ఈ కాలంలో నెలకు సగటున 5000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం విశేషం.
ప్రాంతాలవారీగా చూసినట్లయితే ఫ్రీడమ్ 125 CNG మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో విస్తృతంగా అమ్ముడుపోతుంది. ఇది ఆశ్చర్యం కలిగించదగ్గ విషయం కాదు, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో CNG మౌలిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందినవి. రోజూ ఎక్కువ కిలోమీటర్ల ప్రయాణించే వినియోగదారులకు ఇది చాలా బెస్ట్ బైకుగా నిలుస్తోంది. బజాజ్ ఈ బైక్‌ను రూపొందించిన తీరు చూస్తే ప్రతి ఒక్కరి కోసం కాదు అన్న విషయం స్పష్టమవుతుంది.

దీనిని మైలేజ్‌కు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ముఖ్యంగా డెలివరీ బాయ్స్, చిన్న వ్యాపారులు, కార్మికులు వంటి వారికి బాగా సెట్ అవుతుంది. ప్రస్తుత ఈ బైక్‌కు వస్తున్న ఆదరణ చూస్తే, CNG బైకులకు భవిష్యత్ మార్కెట్ స్కోప్ ఎంతగా ఉందో అర్థమవుతుంది. పెట్రోల్ ధరల పెరుగుదలతో బాధపడేవారు ఈ బైకును హాయిగా కొనుగోలు చేయవచ్చు.
బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్ తక్కువ రన్నింగ్ ఖర్చుతో అందరిని అట్రాక్ట్ చేస్తుంది. బజాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ బైక్‌ను ఉపయోగించే వినియోగదారులు సాధారణ పెట్రోల్ బైక్‌తో పోలిస్తే దాదాపు సగం ఖర్చుతో ప్రయాణించగలుగుతున్నారు. ఉదాహరణకు, రోజుకు 50 కిలోమీటర్ల ప్రయాణం చేసే ఓ సగటు బైక్ యూజర్‌ను తీసుకుంటే, అతను నెలాఖరులో CNG బైక్ వాడటం వల్ల రూ.1,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఆదా చేయగలడు.

ఇది చాలా పెద్ద మొత్తం. ముఖ్యంగా విద్యార్థులు, డెలివరీ పార్శిల్ ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు వంటి వారికి ఇది మేలు చేసే అంశం. ఫ్రీడమ్ 125 బైక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది CNG,పెట్రోల్ రెండింటిలోనూ నడుస్తుంది. ఇది రెండు రకాల ఇంధనాలతో నడిచే డ్యువల్-ఫ్యూయల్ మాస్టర్‌పీస్. CNG కోసం 2 కిలోల ట్యాంక్, అలాగే పెట్రోల్ కోసం కూడా 2 లీటర్ల కెపాసిటీ గల ట్యాంక్ బైక్‌లో ఏర్పాటు చేయబడింది.
ఈ రెండు ఫ్యూయల్ ద్వారా దాదాపు 330 కి.మీ వరకూ ప్రయాణించవచ్చు. ఇది రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగకరం. బజాజ్ ప్రకారం, ఈ బైక్ CNG మోడ్‌లో గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగాన్ని, పెట్రోల్ మోడ్‌లో 93.4 కిలోమీటర్ల వేగాన్ని చేరుతుంది. CNG మోడ్‌లో కిలో ఇంధనానికి 102 కిలోమీటర్లు, పెట్రోల్ మోడ్‌లో లీటరు పెట్రోల్‌కు 65 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

అంటే ప్రతిరోజూ 30-40 కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తికి వారం రోజులు ఫ్యూయల్ గురించి ఎలాంటి చింత అవసరం ఉండదు. ఈ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది, బేస్ వేరియంట్ ధర రూ.95,000 (ఎక్స్-షోరూమ్). బజాజ్ ఫ్రీడమ్ డిస్క్ LED వేరియంట్ ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) , డ్రమ్ LED ధర రూ.1.05 లక్షల (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








