330 కి.మీ మైలేజ్ బజాజ్ CNG బైక్‌.. ఏకంగా అర లక్ష మంది కొనేసారు! బజాజ్ షోరూమ్‌ల వద్ద క్యూ కట్టిన జనం

భారతదేశపు ప్రముఖ టూవీలర్ కంపెనీ బజాజ్ (Bajaj) దశాబ్దాలుగా నాణ్యతతో కూడిన బైక్‌లు, స్కూటర్లు, ఆటోరిక్షాలను మార్కెట్లో విడుదల చేస్తుంది. ముఖ్యంగా ఈ కంపెనీ నుంచి వచ్చిన టూవీలర్స్‌కు దేశీయ వినియోగదారుల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త మోడళ్లను లాంచ్ చేస్తుంది. ఇదే క్రమంలో కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌ను విడుదల చేసింది. ఇప్పటికే చేతక్ EV ద్వారా అమ్మకాల్లో రికార్డులను సాధిస్తున్న బజాజ్ కొత్తగా తీసుకొచ్చిన ఈ బైక్‌కు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తుంది. చేతక్ EV ఇటీవల దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. ఇదే బాటలో CNG బైక్‌ సైతం భారీ అమ్మకాలతో దూసుకుపోతుంది.

బజాజ్ తన ప్రసిద్ధ మోడల్ అయినటువంటి ఫ్రీడమ్ 125 అనే CNG టూవీలర్‌ను 2024 జులైలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. లాంచ్ అయినప్పటి నుంచి కస్టమర్ల నుంచి బాగా కొనుగోళ్లను సాధిస్తుంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో, ఈ బైక్ తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించడంతో వినియోగదారులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. లాంచ్ అయిన తొలి నెలలోనే వేల సంఖ్యలో బుకింగ్‌లను సాధించింది.

Bajaj Freedom 125 Cng Bike Crossed 50000 Sales Units Milestone

తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే రైడర్లకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బజాజ్ సీఎన్‌జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) బైక్‌లకు మంచి స్పందన వస్తోంది. తాజాగా కంపెనీ నుంచి వెల్లడించిన దాని ప్రకారం, ఈ స్మార్ట్ బైక్ 50,000 యూనిట్ల అమ్మకాలు దాటుతోంది. బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్ విడుదలైన ఎనిమిది నెలల 12 రోజుల్లో 50,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటడం విశేషం.

ప్రధానంగా 2024 అక్టోబర్ నెలలో ఇది ఏకంగా 11,076 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, నవంబర్ నెలలో 12,159 యూనిట్లుగా ఉంది. మొత్తం అమ్మకాల్లో ఈ రెండు నెలల్లో జరిగిన సేల్స్ వాటా దాదాపు 46 శాతం ఉండటం విశేషం. ఈ సమయంలో ఎక్కువ విక్రయాలు నమోదు కావడానికి దసరా, దీపావళి వంటి పండుగలు ఉండటంతో కంపెనీ ఇచ్చిన ఆఫర్స్‌ను సద్వినియోగం చేసుకుని ఈ బైక్‌ను అధికంగా కొనుగోలు చేశారు.

Bajaj Freedom 125 Cng Bike Crossed 50000 Sales

ఇది CNG బైక్ కావడంతో బజాజ్ ప్రారంభంలో ఫిల్లింగ్ మౌలిక సదుపాయాలు కలిగి ఉన్న రెండు రాష్ట్రాల్లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. CNG సౌకర్యాలు ఎక్కువగా ఉన్న గుజరాత్, మహారాష్ట్రలో ప్రారంభించిన తర్వాత అమ్మకాలు క్రమంగా టైర్-2, టైర్-3 పట్టణాలకు విస్తరించాయి. మహారాష్ట్రలో CNG అమ్మకాలు ఎక్కువగా ఉండగా, రెండో స్థానంలో గుజరాత్ ఉంది. తక్కువ మెయింటెనెన్స్‌తో అధిక మైలేజ్ అందించడంతో మధ్యతరగతి వినియోగదారులకు గొప్ప ఎంపికగా నిలుస్తోంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. డ్రమ్ ధర రూ. 95,000, డ్రమ్ LED ధర రూ. 1.05 లక్షలు, డిస్క్ LED ధర రూ. 1.10 లక్షలుగా ఉంది. ధరను బజాజ్ పోటీగా ఉంచడంతో, మార్కెట్లో ఇది అందరికీ చేరువైంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అందుకే చాలా మంది దీన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు.

Bajaj Freedom 125 Cng Bike

125cc సెగ్మెంట్‌లోని ఇతర బైక్‌లతో పోలిస్తే దీని మెయింటనెన్స్ ఖర్చు 50 శాతం వరకు తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది 200 కిలోమీటర్లకు పైగా మైలేజీని అందిస్తుంది. CNG‌‌తో అయిపోయిన కూడా పెట్రోల్ ద్వారా కూడా 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. పెట్రోల్, CNG నిండిన ట్యాంక్‌తో ఇది మొత్తంగా 330 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

Take a Poll

More from DriveSpark

Article Published On: Wednesday, March 19, 2025, 15:54 [IST]
English summary
Bajaj freedom 125 cng bike crossed 50000 sales units milestone since its launch
Read more on: #bajaj #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+