330 కి.మీ మైలేజ్, 90,000 ధర.. త్వరలో మార్కెట్లోకి కొత్త బజాజ్ ఫ్రీడమ్ సీఎన్జీ బైక్
బజాజ్ ఫ్రీడమ్ 125 ఒక పాపులర్ సీఎన్జీ బైక్. ఇది దేశీయ మార్కెట్‌లో చాలా మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. ఈ మోటార్‌సైకిల్ అమ్మకాల్లో కూడా కంపెనీ చారిత్రాత్మక రికార్డును సృష్టించింది. కొత్త బజాజ్ ఫ్రీడమ్ బైక్ విడుదల అయిన 9 నెలల్లో దాదాపు 50,047 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం, ఈ మోటార్‌సైకిల్‌ను వినియోగదారులకు మరింత చేరువ చేయడానికి కంపెనీ రెడీ అవుతుంది.
కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ ధర రూ. 90,272 నుంచి రూ. 1.10 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ, డిస్క్ ఎల్ఈడీ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఈ మోటార్‌సైకిల్ యొక్క కొత్త మోడల్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది టాప్-ఎండ్ మోడల్ అని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం బజాజ్ ఫ్రీడమ్ బైక్ 125సీసీ సీఎన్జీ టెక్నాలజీ ఇంజన్ కలిగి ఉంది. ఇదే విధమైన సీఎన్జీ టెక్నాలజీతో 150సీసీ ఫ్రీడమ్ మోటార్‌సైకిల్ కూడా అమ్మకానికి రావచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే.. రాబోయే 12 నుంచి 18 నెలల్లో కొత్త 150సీసీ సీఎన్జీ బైక్ విడుదల కావచ్చు. అయితే, దీని గురించి కంపెనీ నుంచి అధికారిక సమాచారం లేదు.
బజాజ్ ఫ్రీడమ్ 125 మోటార్ సైకిల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 125 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్/సిఎన్జి ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 9.4 PS హార్స్‌పవర్, 9.7 Nm (న్యూటన్ మీటర్) పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఆఫ్షన్‌గా కూడా ఉంటుంది.

కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 2 లీటర్లు/కిలో పెట్రోల్, సీఎన్జీ ఇంధన ట్యాంక్ ఉన్నాయి. ఇది పెట్రోల్ మోడ్‌లో 130 కిలోమీటర్లు, సీఎన్జీ మోడ్‌లో 200 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మొత్తం 330 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని కవర్ చేస్తుంది.
ఈ బైక్‌ని ఇతర సాంప్రదాయ బైక్స్ కంటే భిన్నంగా కంపెనీ తయారు చేసింది. ఇప్పటి వరకు ఇలాంటి డిజైన్ తో బైక్ మార్కెట్లోకి రాలేదు. ముఖ్యంగా ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ 785 మీమీ ఎత్తుతో సెగ్మెంట్‌లో పొడవైన సీటును (నలుగురు కూడా కూర్చొవచ్చు) అందించింది. స్ట్రాంగ్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అలాగే లింక్డ్ మోనోషాక్‌ని అందించారు.

ఈ మోటార్ సైకిల్ అనేక ఎట్రాక్టివ్ ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా ఎల్ఈడీ హెడ్‌లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్సీడీ LCD డిస్ప్లే. ఇది కరేబియన్ బ్లూ, ఎబోనీ బ్లాక్-గ్రే, ప్యూటర్ గ్రే-బ్లాక్, రేసింగ్ రెడ్ వంటి వివిధ కలర్స్‌లో కూడా లభిస్తుంది.
కొత్త బజాజ్ ఫ్రీడమ్ బైక్‌లో ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, బ్యాక్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఆఫ్షన్ కూడా ఉంటుంది. రైడర్ సేఫ్టీ కోసం ఇందులో డిస్క్, డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ బరువు 147 కిలోలు, రోడ్డుపై గట్టి పట్టును అందించడానికి రూపొందించబడిన వీల్స్, టైర్లను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








