దేశంలోనే అందరి ఫేవరెట్ పల్సర్‌ NS125‌ను ఇకపై నమ్మకంగా కొనండి.. సేఫ్టీకి గేమ్‌చేంజర్ లాంటి ఫీచర్ వచ్చేసింది

దేశీయ ప్రముఖ టూవీలర్ తయరీదారులలో ప్రసిద్ధ కంపెనీ బజాజ్ (Bajaj) భారతీయ వినియోగదారుల కోసం చాలా ఏళ్ల క్రితం తీసుకొచ్చిన పల్సర్ మంచి ఆదరణ సంపాదించింది. ఇది హోండా, హీరో వంటి కంపెనీలకు చెందిన పాపులర్ టూవీలర్స్‌ను సైతం ఎదుర్కొని విజయవంతమైన మోడల్‌గా నిలిచింది. మార్కెట్లో పల్సర్‌కు ఉన్న డిమాండ్ కారణంగా కంపెనీ తన ఈ మోడల్‌ను ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా డిజైన్, ఫీచర్స్‌లలో మార్పులు తెస్తూ, కొత్తగా విడుదల చేస్తూనే ఉంది. గతంలో పల్సర్ NS125 మోడల్‌ను తీసుకొచ్చిన బజాజ్, తాజాగా దీనిలో కొత్తగా ABS వేరియంట్‌ను విడుదల చేసింది. బజాజ్ ఎప్పటికప్పుడు కొత్త పల్సర్ బైక్‌లను లను తన వినియోగదారులకు అందించడానికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే పల్సర్‌ బైక్‌ కంపెనీకి అమ్మకాల పరంగా అత్యంత కీలకమైన మోడల్. కొత్తగా వచ్చిన పల్సర్ NS125‌లో రైడర్లకు మరింత సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి ABS‌ను తీసుకొచ్చారు.

ABS‌ అనగా యాంటీ బ్రేకింగ్ సిస్టం. రైడింగ్‌లో ఉన్నప్పుడు ప్రమాదం జరగబోతున్న సమయంలో మరింత రక్షణ కోసం సేఫ్టీకి బాగా ఉపయోగపడుతుంది. ఈ కొత్త బ్రేకింగ్ సిస్టం ద్వారా హైవే మార్గాల్లో అధిక వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్లపై వర్షం లేదా ఇతర నీళ్లతో తడిగా జారేలా ఉన్నప్పుడు ఇది సహాయకరంగా ఉంటుంది. అధిక వేగంతో ప్రయాణిస్తున్న సమయాల్లో రైడర్లకు యాక్సిడెంట్ల నుంచి రక్షణ అందిస్తుంది.

Bajaj Pulsar Ns125 Abs

బజాజ్ పల్సర్ NS125 ధర విషయానికి వస్తే, రూ.1.12,453గా ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరలో బైకును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారు దీన్ని బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. భారతీయ వినియోగదారుల్లో పల్సర్ బైకులకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. ప్రధానంగా యూత్ ఎక్కువగా పల్సర్‌లో ఉన్న పలు వేరియంట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

కొన్ని సంవత్సరాల క్రితం పల్సర్ NS200 మాత్రమే అమ్మకానికి ఉండగా, అదే సమయంలో బజాజ్ NS125,NS160 అనే మోడళ్లను విడుదల చేసి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కొత్త మోడల్ డిజైన్ అద్బుతంగా ఉంది. దీనిలో రెండు విధాల ABS‌లు ఉన్నాయి. సింగిల్-ఛానల్ ABS,డ్యూయల్-ఛానల్ ABS సిస్టంను ఇచ్చారు. ప్రస్తుతం, NS125 బైక్ సింగిల్-ఛానల్ ABS ను కలిగి ఉంది. కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో లభిస్తుంది.

Pulsar Ns125 bike Design

ఇప్పుడు కొత్తగా NS200లో యాంటీ బ్రేకింగ్ సిస్టం (ABS) ఇవ్వడం ద్వారా రైడర్లకు ఇది సరైన ఆప్షన్ అవుతుందని బజాజ్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ఇప్పటి నుంచి ఇది ఈ బ్రేకింగ్ సిస్టంతోనే కస్టమర్లకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో లభిస్తున్న మోడల్ ధర రూ.1,05,453 లుగా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంది.

ఇది 124.45 సీసీ ఎయిర్-కూల్డ్, SOHC, DTS-i Ei ఇంజిన్‌తో రన్ అవుతుంది. 12 PS పవర్, 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ కాన్స్టంట్ మెష్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జోడించారు. ముందు 240mm డిస్క్, వెనుక 130mm డ్రమ్ బ్రేక్‌ ఉన్నాయి. రైడర్లకు అవసరమయ్యే అన్ని ఫీచర్స్‌ను కూడా దీనిలో ఇచ్చారు.

Pulsar Ns125 Abs Launched Details

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్
అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, February 14, 2025, 16:40 [IST]
English summary
Bajaj introduced new abs variant pulsar ns125 bike in india here details
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+