పేదలకు శుభవార్త.. తక్కువ ధరలో సరికొత్త ఆటోరిక్షాలు.. ఒక కి.మీకు కేవలం రూ.1 ఖర్చు!
దేశీయ ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ (Bajaj) ఇండియాలో టూవీలర్ వాహనాలతో పాటు, త్రీవీలర్స్‌ను కూడా విడుదల చేస్తుంది. ఈ కంపెనీకి చెందిన పలు వాహనాలకు దేశంలో మంచి ఆదరణ ఉంది. తాజాగా బజాజ్ మార్కెట్లోకి సరికొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు లాంచ్ చేసింది. వీటికి కంపెనీ గోగో(gogo) అని పేరు పెట్టింది. గోగో బ్రాండ్ కింద విడుదలైన వీటి పేర్లు, P5009, P5012, P7012. బజాజ్ సాధారణంగా ఇండియాలో త్రీ వీలర్ విభాగంలో ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. ఇప్పుడు కొత్త మోడళ్ల ద్వారా కంపెనీ స్థాయి మరో ఎత్తుకు వెళ్తుంది. బజాజ్ గోగో బ్రాండ్ కింద ప్రస్తుతం ఈ మూడింటిని విడుదల చేసినప్పటికీ త్వరలో మరిన్నింటిని విడుదల చేయాలని చూస్తుంది. ఈ కొత్త ఆటోరిక్షాలోని మొదటి 'P' అక్షరం ప్యాసింజర్‌ని సూచిస్తుంది, 50, 70 నెంబర్లు వాటి కొలతలను పేర్కొంటుంది.
తర్వాత చివరి సంఖ్యలు 9,12 బ్యాటరీ కెపాసిటీని సూచిస్తాయి. అంటే 9 కిలోవాట్లు (kWh), 12 కిలోవాట్లు (kWh). ఈ మూడే వేరియంట్లను కంపెనీ భారతీయ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.3.26 లక్షల నుంచి మొదలుకుని రూ.3.83 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చేసరికి మరింత ఎక్కువగా ఉంటుంది.

ఇవి ఇండియాలోని అన్ని బజాజ్ ఆటో డీలర్‌షిప్‌లలో బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్యాసింజర్ సెగ్మెంట్ మోడళ్లను విడుదల చేసినప్పటికి రానున్న కాలంలో కార్గో వేరియంట్‌లను సైతం విడుదల చేసే అవకాశం ఉంది. ప్యాసింజర్ విభాగంలో దేశీయంగా ఇవి మంచి సేల్స్‌ను సాధిస్తాయని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ మూడు వేరియంట్లలో కూడా శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు.
బజాజ్ గోగో P7012' విషయానికి వస్తే, ఇది 12 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. దీని ఫెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంటుంది. ఇది 7.7 bhp పవర్, 36 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా దీనిలో అమర్చిన బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 251 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఇది గంటకు 50 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. ప్యాసింజర్ల రవాణాకు ఇది కంఫర్ట్‌గా ఉంటుందని బజాజ్ తెలిపింది.

ఈ మూడు వేరియంట్లు బలమైన బాడీతో వచ్చాయి. లోపల సీటింగ్, ఇతర స్థలం అనువుగా ఉంటుంది. కంపెనీ ప్రత్యేకంగా 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీని సైతం అందిస్తుంది. ఇవి డ్రైవర్లకు అవసరమైన అన్ని ఫీచర్స్‌తో వచ్చాయి. ఫుల్ డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB టైప్-A ఛార్జింగ్ పోర్ట్, 2-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, LED లైటింగ్, ఆటోమేటిక్ హజార్డ్ అలర్ట్, డ్రైవింగ్ చేసే సమయంలో సీటు ఎత్తు అనువుగా ఉంటుంది.
దీంతో ముందు గ్లాస్ నుంచి రోడ్డను క్లియర్‌గా చూడవచ్చు. గుంతలు ఉన్న రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణించడానికి డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లతో లేటెస్ట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్‌ను బజాజ్ తన ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలో అందించింది. 250 కి.మీల రేంజ్ అంటే దీంతో నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. కి.మీకు కేవలం ఒక రూపాయి మాత్రమే అవుతుంది. పట్టణ, నగరాల్లో ఇది అనువుగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








