కేవలం రూ.74 వేలకే 70 కి.మీల మైలేజ్.. గ్రామీణ-పట్టణ ప్రాంతాలకు సరైన బైక్ ఇది!

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీదారు అయినటువంటి బజాజ్ (Bajaj) ఇటీవల కొత్తగా తన ప్రసిద్ధ ప్లాటినా 110 సిరీస్ కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. గత మోడల్‌తో పోలిస్తే 2025 మోడల్ కొత్తగా అప్‌డేట్‌డ్ ఫీచర్స్‌తో వచ్చింది. బైక్ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ఈ మోడల్, తాజాగా కాస్మెటిక్ మార్పులతో పాటు టెక్నాలజీ పరంగా కూడా కొన్ని కీలకమైన అప్‌డేట్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇది భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, OBD-2B ఉద్గార నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మారింది. దీంతో బైక్ నుంచి తక్కువ మొత్తంలో కాలుష్య కారకాలు విడుదల అవుతాయి. ఇంజిన్‌లో మార్పులు చేయడం కారణంగా మైలేజ్ కూడా బాగానే వస్తుంది. దీని ప్రారంభ ధర వచ్చేసి దాదాపు రూ.74,214 (ఎక్స్-షోరూమ్) నుంచి కొనుగోలు చేయడానికి లభిస్తుంది.

2025 బజాజ్ ప్లాటినా 110 NXTలోని అప్‌డేట్‌ల కారణంగా దాని మునుపటి మోడల్‌తో పోలిస్తే ఇది రూ. 2,600 వరకు ఎక్కువ పెరిగింది. ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే, 8.5 hp పవర్, 9.81 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గత మోడల్‌తో పోలిస్తే ఈ ఇంజిన్‌లోని ప్రధాన మార్పు, ఎలక్ట్రానిక్ కార్బ్యురేటర్‌ను తొలగించి ఇప్పుడు మిలాగ్‌ మెరుగుపరచే ఇంధన ఇంజెక్షన్ యూనిట్‌ను ఉపయోగించడం.

2025 Platina 110 Nxt

ఇది తక్కువ ఉద్గారాలతో పాటు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. కొత్త ప్లాటినాలో మునుపటి మోడల్‌లో ఉపయోగించిన అదే అండర్‌పిన్నింగ్‌లను కొనసాగించినప్పటికి కొన్ని మార్పులు మాత్రం ఉన్నాయి. ముందు భాగంలో కొత్త క్రోమ్ బెజెల్‌తో చుట్టిన హెడ్‌ల్యాంప్ సెటప్ మరింత ఆకర్షణీయంగా ఉంది. దీని మధ్య భాగంలో అమర్చిన LED డే టైమ్ రన్నింగ్ లైట్ (DRL) ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది రెడ్-బ్లాక్, సిల్వర్-బ్లాక్, ఎల్లో-బ్లాక్‌లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.

పెట్రోల్ ట్యాంక్‌పై ఉన్నటువంటి గ్రాఫిక్స్ ఈ బైక్‌కు కొత్త లుక్‌ను ఇస్తుంది. ఫంక్షనాలిటీ పరంగా, ప్లాటినాలో ఇప్పుడు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో పాటు USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా పొందుపరిచారు, దీని వల్ల ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారతాయి. ఇది ప్రాక్టికల్ వాహనాలను కోరుకునే వినియోగదారుల కోసం రూపుదిద్దుకున్న మోడల్‌గా నిలుస్తోంది. ఈ బైక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో కస్టమర్ల చూపులకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Bajaj New 2025 Platina 110 Nxt

దాని సస్పెన్షన్ వ్యవస్థను ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుకభాగంలో గ్యాస్-ఛార్జ్డ్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు అందించారు. వీటివల్ల బైక్ గుంతల రోడ్లపై కూడా స్థిరంగా, సౌకర్యంగా సాగేలా చూస్తుంది. బైక్ ఒక లీటరు పెట్రోల్‌తో సగటున 70 కి.మీ వరకు ప్రయాణించగలదని అంచనా. ఇది ముఖ్యంగా రోజూ ఎక్కువ దూరాలు ప్రయాణించే ప్రజలకు చాలా అనువైన ఆప్షన్‌గా మారుతోంది. దీనివల్ల నిర్వహణ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది.

బజాజ్ ప్లాటినా 110 NXT భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాల వాహనదారుల మనసు దోచుకుంటోంది. రోడ్ పరిస్థితులు, ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుంటే, ఈ బైక్ ఒక సరైన ఎంపికగా నిలుస్తోంది. రోజూ వాహనాల్లో పనికి వెళ్లే ప్రజలకు ఇది నమ్మకమైన మోడల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అన్నిఅంశాల వల్ల, ప్లాటినా 2025 మోడల్ 110 NXT అమ్మకాలు బాగా పెరిగే అవకాశం ఉంది.

2025 Platina 110 Nxt India

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 12, 2025, 7:30 [IST]
English summary
Bajaj new 2025 platina 110 nxt launched in india design and mileage details check
Read more on: #bajaj #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+