రూ.99 వేలకే బజాజ్ కొత్త చేతక్ ఈవీ స్కూటర్.. 127 కి.మీల రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్స్!

బజాజ్ ఆటో (Bajaj Auto) తన ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే దృష్టితో, తాజాగా 'బజాజ్ చేతక్ 3001 (Bajaj Chetak 3001)' అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న చేతక్ 2903 మోడల్‌కు ఒక ఆధునిక ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. డిజైన్‌, పనితీరు, వినియోగదారుల అవసరాల పరంగా చూస్తే, ఈ స్కూటర్‌ను నగర వాహనదారుల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసినట్లు స్పష్టమవుతోంది. దీని ధరను కంపెనీ రూ. 99,990 (ఎక్స్-షోరూమ్ గురుగ్రామ్)గా నిర్ణయించింది. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో బాధపడుతున్న వినియోగదారులు ఖర్చు తగ్గించకోవాలని చూస్తున్న వారి కోసం కంపెనీ ఈ మోడల్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. చేతక్ 35 సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన చేతక్ 3001 మోడల్ అమ్మకాల పరంగా మార్కెట్లో దూసుకుపోయే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తుంది.

చేతక్ 3001లో 3.0 kWh బ్యాటరీని రైడర్ పాదాల కింద భాగంలో అమర్చారు. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 127 కి.మీల రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 750W హోమ్ ఛార్జర్ ఇచ్చారు, ఇది కేవలం 3 గంటల 50 నిమిషాల్లో 80% ఛార్జ్ పూర్తి చేస్తుంది. ఇది దాని విభాగంలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది.

Chetak 3001 Electric Scooter Launched In India

ఇంటి వద్దే తక్కువ సమయంలోనే ఛార్జ్ చేసుకొని, తిరిగి ప్రయాణానికి సిద్ధంగా ఉండేలా ఈ స్కూటర్‌ను రూపొందించడం, బజాజ్ ఇంజనీరింగ్ దృష్టిని అర్థం చేసుకునేలా చేస్తోంది. ముఖ్యంగా చేతక్ 3001లో, 35 లీటర్ల బూట్ స్పేస్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో స్కూల్ బ్యాగులు, కిరాణా వస్తువులు లేదా అదనపు హెల్మెట్ వంటివి మోసుకెళ్లే అవసరాన్ని బాగా తీర్చగలదు. గత మోడల్స్‌తో పోలిస్తే ఇది మరింత ప్రాక్టికల్ స్పేస్‌‌ను వినియోగదారులకు అందిస్తోంది.

స్కూటర్‌ని రెగ్యులర్ కమ్యూటింగ్‌తో పాటు చిన్న మాల్స్, మార్కెట్ల వరకు వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. బజాజ్ తన చేతక్ 3001 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మరింత ప్రత్యేకతతో తీసుకొచ్చింది. ఈ స్కూటర్ సాంకేతికత, భద్రత, వినియోగదారుని ఆకట్టుకునే డిజైన్‌ల పరంగా దాని సిరీస్‌లో ఓ అడుగు ముందుంది. ముఖ్యంగా ఈ స్కూటర్‌కి ఉన్న ఫీచర్లు, స్థిరమైన నిర్మాణం, స్మార్ట్ కనెక్టివిటీ వ్యవస్థలు అన్నీ కలిసినప్పుడు, ఇది ఒక క్లాస్-లీడర్ వాహనంగా చెప్పవచ్చు.

Chetak 3001 Electric Scooter Price

సాధారణంగా చాలా స్కూటర్లలో ఉండని సౌకర్యాలు ఉదాహరణకు, మ్యూజిక్, కాల్ కంట్రోల్స్, ఆటో ఆఫ్ టర్న్ సిగ్నల్స్, రివర్స్ అలర్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, 'గైడ్ మి హోమ్' లైటింగ్ వంటివి చేతక్ 3001లో అందుబాటులో ఉన్నాయి. ఇవి యూజర్ అనుభవాన్ని సులభతరం చేయడమే కాకుండా, భద్రతను కూడా మెరుగుపరుస్తాయి. ఇంకా, చేతక్ సిరీస్‌కి ప్రత్యేకతగా నిలిచిన స్టీల్ బాడీ నిర్మాణం ఈ మోడల్‌లోనూ కొనసాగుతోంది.

ఇది స్కూటర్‌ను కేవలం గట్టిగా మార్చడం మాత్రమే కాదు, ప్లాస్టిక్ ప్యానెల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఫ్లెక్సింగ్ ఫుట్‌బోర్డులు లేని మూడుగా స్టబుల్ బిల్డ్‌క్వాలిటీతో, ఈ స్కూటర్ అత్యంత మన్నికైన మెటల్ షెల్ కలిగిన స్కూటర్‌గా నిలుస్తోంది.IP67 రేటింగ్ కలిగిన ఈ స్కూటర్ ధూళి, నీటి నుండి పూర్తి రక్షణ కలిగి ఉంటుంది. ఇది వర్షాలు, గడ్డి రోడ్లు, పొడి ప్రాంతాల్లో, విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కూడా దూసుకుపోతుంది.

Bajaj New Chetak 3001 Electric Scooter

గత చేతక్ సిరీస్ జనవరి నుండి మార్చి త్రైమాసికంలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన EV స్కూటర్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ కొత్త చేతక్ 3001 స్కూటర్‌ అమెజాన్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ద్వారా కూడా త్వరలో విక్రయించనున్నట్లు బజాజ్ ప్రకటించింది. వినియోగదారుల కొనుగోలు అనుభవాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ డిజిటల్ స్ట్రాటజీ అమలు చేయబడుతోంది. రాబోయే కొన్ని వారాల్లో డెలివరీలు కూడా అదే వేగంగా కొనసాగనున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 17, 2025, 14:31 [IST]
English summary
Bajaj new chetak 3001 electric scooter launched in india at rs 99990 more details inside
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+