అతి తక్కువ ధరకే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..
ఇండియాలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు బాగా డిమాండ్ నెలకొంది. బజాజ్ కంపెనీ ఈ సెగ్మెంట్‌లో బాగా దూసుకుపోతుంది. చేతక్ ఈవీ మోడల్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి ప్రజాధారణ సంపాదిస్తుంది. దేశీయ ఈవీ మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న బజాజ్ చేతక్ (Bajaj Chetak), తాజాగా '35' సిరీస్‌లో కొత్త '3503' మోడల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే విజయవంతంగా మార్కెట్లో అమ్మకాలను సాధిస్తున్న 3501, 3502 మోడళ్ల తర్వాత, ఇప్పుడు ఈ తాజా మోడల్‌ను సరికొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, అందుబాటు ధరతో కొనుగోలు చేయడానికి తీసుకొచ్చారు. బజాజ్ చేతక్ 3503 మోడల్ ధరను రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, ఇది మధ్యతరగతి వినియోగదారులకు బడ్జెట్‌కు అనుగుణంగా అందుబాటులో ఉండడం విశేషం.
కొత్త మోడల్ లుక్ పరంగా అందరిని ఆకట్టుకునేలా ఉంది. అన్ని వయస్సుల వారికి బాగా సెట్ అవుతుంది. రోజువారీ ప్రయాణాలు చేసే వారు ఈ మోడల్‌ను బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. దీని వాడటం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని అందిపుంచుకుని కొత్త ఫీచర్స్‌తో బజాజ్ సంస్థ, వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు చేతక్ శ్రేణిని మరింత విస్తరిస్తోంది.

ఈ కొత్త మోడల్‌లో డిజైన్ పరంగా, గత వేరియంట్ల తీరునే కొనసాగిస్తూ, క్లాసిక్ రెట్రో స్టైలింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. చేతక్ 3503 అత్యాధునిక LED హెడ్‌లైట్లు, మెరిసే కర్వీ బాడీ ప్యానెల్లు, స్టైలిష్ టెయిల్ లాంప్‌లను కలిగి ఉంది. ప్రయాణంలో రైడర్లు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి 35 లీటర్ల విస్తృతమైన బూట్ స్పేస్‌ను అందించారు. దీంతో ఈ స్కూటర్‌ను ప్రతిరోజు ఆఫీసు లేదా ఇంటి అవసరాల కోసం బాగా వాడుకోవచ్చు.
దీని కలర్స్ విషయానికి వస్తే, చేతక్ 3503 మోడల్ వినియోగదారుల ఇష్టాలకు అనుగుణంగా ఇండిగో బ్లూ, మ్యాట్ గ్రే, బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్ వంటి ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. సాంకేతికత పరంగా, ఈ మోడల్ కూడా 3501 మరియు 3502 మోడళ్లను అనుసరిస్తోంది. పవర్‌ట్రెయిన్‌లో మంచి పెర్ఫామెన్స్ అందించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో 3.5 కిలోవాట్ సామర్థ్యంతో కూడిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు.

ఇందులో 3.5 కిలోవాట్ సామర్థ్యంతో కూడిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఒకసారి పూర్తిగా చార్జ్ చేసినట్లయితే, దాదాపు 150 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇలాంటి సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలు తమ ప్రయాణ ఖర్చులను తగ్గించడానికి ప్రత్యమ్నాయంగా ఇంత రేంజ్ అందించే చేతక్ 3503 స్కూటర్ బాగా అనుకూలంగా ఉంటుంది.
ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 63 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది, ఇది నగర ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీని 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను ఇళ్లలో ఉండే విద్యుత్తును ఉపయోగించి 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి కేవలం 3 గంటలు 25 నిమిషాలు మాత్రమే పడుతుంది, దీనివల్ల వినియోగదారులు బ్యాటరీ ఛార్జ్ కోసం ఎక్కువ సమయం వెయిటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.

ఈ స్కూటర్ కొత్త కలర్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తోంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్‌తో పాటు మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్లను కూడా అందిస్తోంది, రైడింగ్ చేసే వారికి ఇది సరికొత్త అనుభూతిని అందిస్తుంది. సేఫ్టీ కోసం చేతక్ 3503 మోడల్ ముందు భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను, అలాగే ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్‌లను అందించారు.


Click it and Unblock the Notifications








