రూ.70 వేలకే 90 కి.మీల మైలేజ్ ఇచ్చే బైక్‌ను.. ఇంత మంది కొన్నారు అంటే నమ్మలేరు!

భారతీయుల మనస్సుల్లో ఎప్పుడూ ఓ స్థిరమైన స్థానం కలిగి ఉండే సెగ్మెంట్‌ అంటే ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్‌లు. తక్కువ బడ్జెట్, అధిక మైలేజ్, నిర్వహణలో తక్కువ ఖర్చుతో అనేక రకాల అవసరాలకు సరిపోయే బైక్ కావాలంటే, ఈ విభాగంలోనే ఎన్నుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ మంచి ఆదరణ పొందుతున్న బైక్‌లలో బజాజ్ ప్లాటినా ముందు వరుసలో ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలు తమ మొదటి బైక్ ఎంపికగా చాలా సందర్భాల్లో ప్లాటినాను ఎంచుకుంటాయి. రోజూ ఆఫీసుకు వెళ్లేవాళ్లు, కాలేజీ స్టూడెంట్లు, డెలివరీ ఏజెంట్లు వంటి నిరంతరం ప్రయాణించాల్సిన వారు ఎక్కువగా దీనిపైనే ఆధారపడతారు. బజాజ్ ప్లాటినా శక్తిని తక్కువ వ్యయంతో అందించగల బైక్‌గా పేరు తెచ్చుకుంది.

మైలేజీ పరంగా ఇది మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే, ఇటీవలి జూన్ 2025 సేల్స్ రిపోర్ట్ ప్రకారం, ప్లాటినా అమ్మకాలు కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ బైక్ విక్రయాల్లో క్షీణత కనిపించింది. దీనికి పలు కారణాలు ఉండవచ్చు, కొత్త మోడళ్ల విడుదల, కఠినమైన పోటీ, లేదా వినియోగదారుల అభిరుచుల్లో మార్పు. ఈ బైక్ గతేడాది జూన్ 2024లో 33,101 యూనిట్లు అమ్ముడైంది.

Platina June 2025 Sales Recorded 25662

ఈ ఏడాది జూన్ 2025కు వస్తే అమ్మకాలు 25,662 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది ఏకంగా 22.47 శాతం తగ్గుదల అనే చెప్పాలి. దీంతో, బజాజ్ ప్లాటినా దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 10 బైక్స్ లిస్ట్‌లో 10వ, చివరి స్థానాన్ని మాత్రమే ఆక్రమించింది. అయితే, ఇది తాత్కాలిక నెమ్మదిగా భావించవచ్చు. ఎందుకంటే ప్లాటినాకు ఉన్న మెరిట్‌లు ఇప్పటికీ మారలేదు. రోజూ ఆఫీస్‌కు వెళ్లేవాళ్లకి, డెలివరీ పనుల్లో ఉన్నవారికి ఇది బెస్ట్.

పేట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో 70-90 కి.మీ. ఇచ్చే మైలేజ్, ఈ బైక్‌ను మళ్లీ పాపులర్ చేయగలదు. ప్రస్తుతం ప్లాటినా రెండు వేరియంట్లలో లభిస్తోంది. ప్లాటినా 100 ధర రూ. 70,643(ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుండగా, మరొవైపు ప్లాటినా 110 ధర రూ. 74,694(ఎక్స్-షోరూమ్). ఈ ధరలకు మార్కెట్లో మైలేజ్, నమ్మకాన్ని కలగలిపే బైక్‌లు ఎంతో తక్కువ. రెండింటి లక్షణాలు వేర్వేరుగా ఉన్నా, ఒక్కో వేరియంట్‌కి ప్రత్యేకమైన మార్కెట్ దృష్టి ఉంది.

Bajaj Platina

మైలేజ్‌తో పాటు అవసరమైన శక్తిని కలిపి ఇవ్వగల వీటి సామర్థ్యం, మధ్య తరగతి వినియోగదారులకు ఈ బైక్‌లను ఓ సురక్షిత ఎంపికగా మార్చుతోంది. ప్లాటినా 110 గురించి మాట్లాడుకుంటే, ఇది115.45 సీసీ సామర్థ్యం గల DTS-i ఇంజిన్‌‌తో వస్తుంది. ఈ బైక్ 6.33 kW పవర్‌ను 9.81 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అంటే, రోజువారీ ప్రయాణాల్లో సరిపడే స్థిరమైన పెర్ఫార్మెన్స్‌ను అందించడంలో ఇది ముందుంది.

దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు, అంటే తరచూ ఫ్యూయల్ స్టేషన్‌కి వెళ్లే అవసరం లేకుండా సుదీర్ఘ ప్రయాణాలు కూడా సులభంగా చేసేయొచ్చు. ఇక ప్లాటినా 100 విషయానికి వస్తే, ఇది 102 సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ DTS-i ఇంజన్‌‌ను కలిగి ఉంది. ఇది 7.7 హెచ్‌పీ పవర్‌ను 7500 rpm వద్ద, 8.3 Nm టార్క్‌ను 5500 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది.

Bajaj Platina Sales

ఇవన్నీ కలిపి చూసుకుంటే, మిడిల్ క్లాస్ వ్యక్తికి కావలసిన మైలేజ్, శక్తి, స్థిరత అన్నీ ఈ బైక్‌లో ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే, బజాజ్ ప్లాటినా మైలేజ్‌ lovers‌కి మాత్రమే కాదు, రోజూ ట్రాఫిక్‌ లోనూ, రఫ్ రోడ్ల మీదనూ బైక్ నడిపించాల్సిన వారికి సరిపోయే శక్తి, కంఫర్ట్, నమ్మకాన్ని కలగలిపిన అద్భుతమైన ఎంపిక.

More from DriveSpark

Article Published On: Friday, July 25, 2025, 8:50 [IST]
English summary
Bajaj platina june 2025 sales recorded 25662 down more details inside
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+