90 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్‌! ఇంత తక్కువ ధరకు అమ్ముతున్నారు.. గత నెలలో ఎంతమంది కొన్నారో తెలుసా?

భారతదేశంలోని మిడిల్ క్లాస్, డైలీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు మొదలగు వారికి అత్యంత అనుకూలంగా ఉండే బైకులలో బజాజ్ ప్లాటినా (Bajaj Platina) ఒకటి. దేశంలో ఇది ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఎక్కువ మైలేజ్, తక్కువ ఖర్చు అనే నినాదాన్ని నిజంగా అనుభూతి పరచిన బైక్ ఇది. ఏప్రిల్ 2006లో మార్కెట్‌లోకి అడుగుపెట్టి, కేవలం ఎనిమిది నెలల్లోనే 5 లక్షల యూనిట్ల అమ్మకాలను దాటి, అప్పటి నుంచే తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ బైక్‌కు వచ్చిన ఆదరణకు ప్రధాన కారణం, దాని ధర సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటం, అలాగే దాని మైలేజ్ ఎక్కువగా ఉండటం. రోజూ ఆఫీసుకు, పనులకు, స్కూల్ డ్రాప్‌లు ఇలా ఎవరికైనా సరైన ఎంపికగా మారింది ప్లాటినా. ఇప్పటికే దాదాపు ఇరవై సంవత్సరాలు గడుస్తున్నా కూడా, బజాజ్ ప్లాటినాకు మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం లేదు.

ఇది టెక్నాలజీ మారినప్పటికీ, పలు స్పోర్ట్స్ బైక్‌లు వచ్చినా కూడా వినియోగదారులను కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే, మే 2025 అమ్మకాల నివేదిక ప్రకారం, బజాజ్ ప్లాటినా అమ్మకాల్లో కొద్దిగా తగ్గుదల వచ్చింది. ఇది బహుశా, మారుతున్న ట్రెండ్స్‌, కొత్త మోడళ్ల రాక వలన కావచ్చు. మే 2025లో బజాజ్ ప్లాటినా సేల్స్ సంఖ్య 27,919 యూనిట్లు కాగా, గత సంవత్సరం ఇదే మే 2024లో ఇది 30,239 యూనిట్లు.

Bajaj Platina Sales

అంటే, సుమారు 2,320 యూనిట్లు తక్కువ అమ్ముడయ్యాయి. ఇది 7.67 శాతం తగ్గుదలగా నమోదైంది. ఈ అమ్మకాలతో బజాజ్ ప్లాటినా ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 10 బైకుల జాబితాలో 9వ స్థానానికి పరిమితమైంది. బజాజ్ ప్లాటినా సాధారణంగా మధ్య తరగతి కుటుంబాల్లో ఇప్పటికీ గట్టి స్థానం సంపాదించుకుని ఉన్న బైక్. గత రెండు దశాబ్దాలుగా ఈ మోడల్ మారుతూనే ఉన్నా, దాని ప్రాముఖ్యత మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం బజాజ్ ప్లాటినా రెండు మోడళ్లలో Platina 100, Platina 110లలో వినియోగదారుల అవసరాలను బట్టి అందుబాటులో ఉంది. ఇవి రెండూ మైలేజ్ పరంగా తమదైన స్థాయిలో మెప్పిస్తుండటంతో, రాబోయే నెలల్లో అమ్మకాలు తిరిగి ఊపు పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్లాటినా 100 బైక్ ధర రూ.68,262 నుండి ప్రారంభమవుతుండగా, ప్లాటినా 10 బైక్ ధర రూ.71,558 నుండి ప్రారంభమవుతోంది. ఈ ధరలకు అదిరిపోయే మైలేజ్ ప్లాటినా అందిస్తుంది.

Bajaj Platina Sales 7 67 Percent Down

ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 70 నుండి 90 కిలోమీటర్ల మధ్య మైలేజ్‌ను అందించగలదు. రోజూ వందల కిలోమీటర్ల ప్రయాణించే వారికైనా, పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందిపడే వారికైనా ఇది మంచి పరిష్కారం అందించే బైక్. అందుకే 20 ఏళ్లుగా మిలియన్ల మంది ప్రయాణికులకు ఇష్టమైన మెడల్‌గా మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా బజాజ్ ప్లాటినా ఎప్పటికప్పుడు కొత్తగా అప్‌డేట్ అవుతూనే ఉంది.

మార్కెట్లో ఈ బైక్‌కి ప్రత్యర్థులు లేకపోలేదు, అయితే మార్కెట్‌లో ఉన్న వాటిలోకి హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, హోండా షైన్ 100, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ వంటి మోడళ్లకు బజాజ్ ప్లాటినా ఒక గొప్ప ప్రత్యామ్నాయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దీని నిర్వహణ చాలా వరకు తక్కువ స్థాయిలోనే ఉంటుంది.

Bajaj Platina Sales 7 67 Percent Down In May Details

హీరో స్ప్లెండర్ ప్లస్ మాదిరిగానే ప్లాటినా మంచి పనితీరు ఇస్తుంది. హెచ్‌ఎఫ్ డీలక్స్‌ లాగా తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్ అందించగల సామర్థ్యం ఉంది. హోండా షైన్ 100 లాంటి స్టబిల్ టార్క్, మృదువైన ఇంజిన్‌కు టఫ్ పోటీగా నిలుస్తుంది. అలాగే, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌కి తక్కువ ధరలో ప్రత్యామ్నాయం కావచ్చు ప్లాటినా. మొత్తానికి పెట్టిన ఖర్చుకు మించి పనితీరు ఇచ్చే బైక్ కావాలంటే, ప్లాటినా నమ్మకమైన మోడల్.

More from DriveSpark

Article Published On: Monday, June 23, 2025, 11:30 [IST]
English summary
Bajaj platina sales 7 67 percent down in may 2025 more details inside
Read more on: #bajaj #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+