90 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్ స్మార్ట్‌ఫోన్ ధరకే.. లీటరుతో మూడు రోజులు తిరగొచ్చు.. భారీగా పెరిగిన సేల్స్
బజాజ్ ప్లాటినా (Bajaj Platina) పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది మైలేజ్ కింగ్ అనే పేరు. ఇది కేవలం ఒక బైక్ కాదు, మధ్యతరగతి ప్రజల రోజువారీ జీవితంలో భాగమైపోయిన నమ్మకమైన స్నేహితుడు. ఆఫీసుకెళ్లే ఉద్యోగులు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు, చిన్న వ్యాపారాలు చూసుకునే వారు.. అందరికీ ఈ బైక్ సరిపోయేలా రూపుదిద్దుకుంది. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఇవన్నీ కలిపి ప్లాటినాను సామాన్య వినియోగదారుల హృదయాల్లో స్థిరపరిచాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ కాలంలో కూడా, ప్లాటినా యజమానులకు ఎటువంటి భారం లేకుండా 70 నుండి 90 కి.మీ. వరకు మైలేజ్ అందిస్తోంది. ఇంతటి పనితీరుతో, బజాజ్ ప్లాటినా నేడు భారతీయ రోడ్లపై అత్యధికంగా కనిపించే బైక్‌లలో ఒకటిగా మారింది.
మార్కెట్లో కొత్త మోడల్స్ వస్తున్నా, ప్లాటినాకు ఉన్న ప్రజాదరణ మాత్రం తగ్గలేదు. అందుకే దాదాపు 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ బైక్ అమ్మకాలలో అగ్రస్థానంలో నిలుస్తోంది. దీనికి సాక్ష్యంగా సెప్టెంబర్ 2025 అమ్మకాల గణాంకాలు నిలుస్తున్నాయి. ఆ నెలలో బజాజ్ కంపెనీ 62,260 ప్లాటినా బైక్‌లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే నెలలో 49,774 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఒక్క ఏడాదిలోనే 12,486 యూనిట్ల పెరుగుదల నమోదైంది.

వృద్ధి శాతం పరంగా చూస్తే 25.09% అనే పెరుగుదల. ఈ రికార్డ్‌తో బజాజ్ ప్లాటినా సెప్టెంబర్ 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 బైక్‌లలో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇది కొత్త మోడల్ కాకపోయినా, దీని సింప్లిసిటీ, విశ్వసనీయత, మైలేజ్.. ఇవన్నీ కలిపి ఇంకా మార్కెట్లో దాని పట్టు దృఢంగా కొనసాగుతున్నాయి. నిజానికి ప్లాటినా అనేది ఒక సారి కొంటే సంవత్సరాల తరబడి మరిచిపోలేని బైక్ అనే పేరును సంపాదించుకుంది.
మారుతున్న కాలంలో కొత్త బైక్‌లు, అధునాతన ఫీచర్లు వచ్చినా, వినియోగదారులు ఇంకా ప్లాటినాను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం బజాజ్ కంపెనీ ప్లాటినాను రెండు వేరియంట్లలో 100, 110 లలో లభిస్తుంది. Platina 100 వేరియంట్ ధర రూ.65,407(ఎక్స్-షోరూమ్). ఇది 102cc ఇంజిన్‌తో పనిచేస్తూ, 7.9 PS పవర్, 8.3 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నగర, గ్రామీణ రోడ్లలోనూ సాఫీగా నడుస్తూ, తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ దూరం ప్రయాణించగలదు.

Platina 110 వేరియంట్ ధర రూ.69,284(ఎక్స్-షోరూమ్). దీని 115.45cc ఇంజిన్, ఇది 6.33 kW శక్తిని, 9.81 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని రైడ్ సాధారణ బైక్‌లతో పోలిస్తే మరింత మెరుగ్గా ఉంటాయి. ప్లాటినాకు ఉన్న అసలైన బలం, దాని మైలేజ్. రోడ్డు పరిస్థితులు, రైడింగ్ స్టైల్ ఆధారంగా ఇది 70 నుంచి 90 కి.మీ. వరకు, కొన్ని సందర్భాల్లో 100 కి.మీ./లీటర్ వరకు కూడా మైలేజ్ ఇవ్వగలదు.
ఇది పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఎంతో మందికి ఉపశమనం కలిగిస్తోంది. రైడింగ్ శైలి, రోడ్డు పరిస్థితులు, వాహన నిర్వహణ వంటి అంశాలపై ఆధారపడి మైలేజ్ కొద్దిగా మారవచ్చు, కానీ ప్లాటినా ఇంధన సామర్థ్యం మాత్రం ఎప్పటికీ విశ్వసనీయమే. రోజూ ఆఫీసుకు వెళ్ళేవారైనా, కళాశాలలకు వెళ్ళే విద్యార్థులైనా, ప్లాటినా వారికి సరైన భాగస్వామిగా నిలుస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

దీని ముందుభాగంలో హాలోజన్ హెడ్‌లైట్, LED డే టైమ్ రన్నింగ్ లైట్లు రాత్రివేళల్లో స్పష్టమైన లైటింగ్ ఇవ్వడమే కాకుండా, పగటిపూట రైడ్‌లోనూ అదనపు భద్రత కల్పిస్తాయి. అంతేకాదు, ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే USB ఛార్జింగ్ పోర్ట్ ప్లాటినాలో ఉండటం ఒక పెద్ద ప్లస్ పాయింట్. తక్కువ వైబ్రేషన్స్, స్మూత్ గేర్ షిఫ్ట్స్, దీర్ఘకాలిక నమ్మకమైన పనితీరుతో బజాజ్ ప్లాటినా బెస్ట్ బైకుగా ఉంది.


Click it and Unblock the Notifications








