లుక్ చూస్తే లయన్.. మైలేజ్‌లో కింగ్.. పల్సర్ కొత్త మోడల్ ఎక్కితే రాజసం ఉట్టిపడాల్సిందే!
భారతదేశంలో టూ-వీలర్ అనగానే సామాన్యుడి నుంచి కుర్రాళ్ల దాకా అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు బజాజ్ పల్సర్. కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ రోడ్లపై తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఈ బైక్, ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, హైటెక్ ఫీచర్లతో కొత్త అవతారమెత్తింది. బజాజ్ ఆటో తన పాపులర్ మోడల్ పల్సర్ 150 (Pulsar 150) లో 2026 అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది.
పాత క్లాసిక్ లుక్‌ను అలాగే ఉంచుతూనే, నేటి తరం యువతకు నచ్చేలా అదిరిపోయే ఫీచర్లను జోడించింది. కేవలం రూ.1.08లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్, రాబోయే రోజుల్లో రోడ్ల మీద మళ్ళీ పల్సర్ మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది.

కొత్త పల్సర్ 150లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దాని లైటింగ్ సిస్టమ్ గురించి. ఇప్పటిదాకా హాలోజన్ బల్బులతో వచ్చిన ఈ బైక్, ఇప్పుడు సరికొత్త LED హెడ్‌ల్యాంప్ మరియు LED ఇండికేటర్లతో మెరిసిపోతోంది. దీనివల్ల బైక్ చూడటానికి మోడ్రన్‌గా అనిపించడమే కాకుండా, రాత్రి వేళ ప్రయాణాల్లో రోడ్డు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
బాడీ డిజైన్ పరంగా పల్సర్ తన ఐకానిక్ మస్కులర్ లుక్‌ను అలాగే కాపాడుకుంది. అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన గ్రాఫిక్స్, కలర్ ఆప్షన్లు బైక్‌కు ఒక ఫ్రెష్ అప్పీల్‌ను ఇస్తున్నాయి. ముఖ్యంగా కుర్రాళ్లను ఆకట్టుకునేలా షార్ప్ అంచులు, నేకెడ్ స్పోర్ట్స్ లుక్‌తో ఈ బైక్ అదరగొడుతోంది.

బజాజ్ ఈసారి టెక్నాలజీ విషయంలో అస్సలు తగ్గలేదు. పల్సర్ N150, N160 మోడళ్లలో ఉండే ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇప్పుడు క్లాసిక్ పల్సర్ 150లోనూ తీసుకొచ్చారు. ఈ స్క్రీన్ మీద గేర్ పొజిషన్, రియల్ టైమ్ మైలేజీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ వంటి ఎన్నో వివరాలు కనిపిస్తాయి.
అంతేకాదు, బజాజ్ రైడ్ కనెక్ట్ (Bajaj Ride Connect) యాప్ ద్వారా మీ మొబైల్ ఫోన్‌ను బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల బైక్ నడుపుతున్నప్పుడే మీకు వచ్చే కాల్స్, మెసేజ్ అలర్ట్స్ డిస్‌ప్లే మీద చూసుకోవచ్చు. డిజిటల్ జనరేషన్‌కు కావాల్సిన పక్కా అప్‌డేట్ ఇది అని చెప్పవచ్చు.

బైక్ బయట ఎంత మారినా, లోపల ఉండే ఇంజిన్ మాత్రం అదే నమ్మకమైన పనితీరును అందిస్తుంది. ఇందులో 149.5cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 13.8 bhp పవర్, 13.25 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది BS6 ఫేజ్-2 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయబడింది.
5-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన ఈ ఇంజిన్, అటు సిటీ ట్రాఫిక్‌లోనూ, ఇటు హైవేల మీద నిలకడగా దూసుకెళ్తుంది. మైలేజీ విషయానికి వస్తే, ARAI లెక్కల ప్రకారం ఇది లీటరుకు సుమారు 47.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ తో ఎక్కువ కాలం మన్నే ఈ ఇంజిన్, పల్సర్ బ్రాండ్‌కు వెన్నెముక లాంటిది.

వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా బజాజ్ ఈ బైక్‌ను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. పల్సర్ 150 SD (సింగిల్ డిస్క్) ధర రూ. 1,08,772 కాగా, టాప్ ఎండ్ వెర్షన్ అయిన TD (ట్విన్ డిస్క్) ధర రూ. 1,15,481 వరకు ఉంది. సేఫ్టీ కోసం సింగిల్ ఛానల్ ABS సదుపాయం ఉంది.
17-అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్లు ప్రయాణాన్ని సుఖవంతం చేస్తాయి. మార్కెట్లో టీవీఎస్ అపాచీ 160, యమహా ఎఫ్‌జెడ్ వంటి బైక్‌లు ఉన్నప్పటికీ, తన క్లాసిక్ ఇమేజ్, కొత్త ఫీచర్లతో పల్సర్ మళ్ళీ నెంబర్ 1 స్థానానికి చేరడం ఖాయం.


Click it and Unblock the Notifications








