దుమ్ము రేపిన పల్సర్.. 2 కోట్ల మంది ఎంచుకున్నారు.. కొంతమంది అదృష్టవంతులకు బంపర్ ఆఫర్!

భారతదేశంలో బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్(Pulsar) అంటే తెలియని వారు ఉండరు. 2001లో యువతకు స్పోర్టీ మోటార్‌సైక్ల అభిరుచిని పరిచయం చేసిన ఈ మోడల్ ఇప్పుడు మరో చరిత్ర సృష్టించింది. ఆల్-టైమ్ హిట్ మోడళ్లలో ఒకటైన పల్సర్, 20 మిలియన్ల (2 కోట్ల) యూనిట్ల విక్రయాలను దాటి, ఇది అత్యంత విజయవంతమైన మోటార్‌సైకిల్ బ్రాండ్‌గా నిలిచింది. సాధారణ కమ్యూటర్ బైక్‌ల ఆధిపత్యం ఉన్న సమయంలో, పల్సర్ తన మస్కులర్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్, టాప్-క్లాస్ పనితీరుతో మార్కెట్‌ను శాశ్వతంగా మార్చేసింది. అద్భుతమైన వేగం, పెద్ద ఇంజిన్ సామర్థ్యం, మెరుగైన మైలేజ్‌ ఈ మూడింటిని ఒకే బైక్‌లో అందించిన మొదటి భారతీయ మోటార్‌సైకిల్ పల్సర్‌ మాత్రమే.

అప్పటి వరకు కేవలం వేగం కోరుకునేవారు కొత్త స్పోర్ట్స్ బైక్‌లను ఎంచుకోవడం సాధారణం. కానీ పల్సర్ వచ్చాక, అది యువతకు ఒక కలల బైక్‌గా మారింది. తరువాత 2007లో బజాజ్ పల్సర్ 220F మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి, ఈ బైక్ యువతలో విపరీతమైన ఆదరణ పొందింది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, అత్యాధునిక టెక్నాలజీతో, ఈ బైక్ అప్పట్లో స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కు కలల బైక్‌గా మారింది.

Bajaj Pulsar

అంతేకాకుండా, బైక్ ధర కూడా మార్కెట్లో ఇతర ప్రీమియమ్ బైక్‌ల కంటే తక్కువ ఉండటంతో అందరిని ఆకట్టుకుంది. ఇది స్టైల్ మాత్రమే కాదు, బలమైన నిర్మాణం, దూకుడు స్వభావంతో మంచి హ్యాండ్లింగ్, బ్రేకింగ్ సామర్థ్యంతో దేశీయంగా మంచి అమ్మకాలను సాధించింది. ఏదైనా కొత్త బైక్ విడుదల అయితే, దానిని పల్సర్‌తో పోల్చే స్థాయికి ఎదిగింది. 2001 నుంచి 2018 మధ్య కాలంలో కోటి యూనిట్ల అమ్మకాలను చేరింది.

మొదటి 10 మిలియన్ల యూనిట్ల అమ్మకాలకు 17 సంవత్సరాలు పట్టినా, తరువాతి 1 కోటి యూనిట్ల మార్కును కేవలం 6 ఏళ్లలోనే 2019 నుంచి 2025 మధ్యలో దాటేయడం విశేషం. పల్సర్ ఇప్పటికి 20కి పైగా దేశాలలో మార్కెట్‌ను శాసిస్తోంది. లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలలోనూ ఈ బైక్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. కొన్ని దేశాల్లో అయితే అక్కడి మార్కెట్లో టూవీలర్ విభాగంలో మొదటి, రెండో స్థానంలో ఉంది.

Pulsar Crossed 2 Crore Sales

బలమైన ఇంజిన్, స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్ల కారణంగా, యువత నుంచి ప్రొఫెషనల్స్ వరకు అందరికీ ఇది హాట్ ఫేవరెట్. ఇది మొదట్లో 150cc, 180cc మోడళ్లతో ప్రారంభం కాగా, అప్పుడే మార్కెట్లో ఉన్న 100-125cc మోడళ్ల కంటే భిన్నంగా చూశారు. డిమాండ్ పెరుగుతున్న కొద్ది బజాజ్ తన ఫేవరెట్ బైక్‌ను ఎప్పటికిప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త అప్‌డేట్‌లతో విడుదల చేయడం మొదలుపెట్టింది.

సంవత్సరాలు గడిచేకొద్దీ, పల్సర్ కుటుంబం విస్తరించిపోయింది. మునుపటి రెండు మోడళ్లే కాకుండా, ఇప్పుడు 125cc నుండి 400cc వరకు పన్నెండు రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్ 50కి దేశాల్లో కొనుగోలుకు లభిస్తుంది. 2 కోట్ల అమ్మకాలను సాధించిన సందర్భంలో కంపెనీ ఎంపిక చేసిన పల్సర్ మోడళ్లపై తగ్గింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. బజాజ్ దాదాపు రూ.7379 వరకు డిస్కౌంట్లను అందిస్తుంది.

Bajaj Pulsar Crossed 2 Crore Sales Milestone

అయితే ఈ తగ్గింపు మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. లిమిటెడ్ కాలం వరకు మాత్రమే. దీనిలో భాగంగా పల్సర్ 125 నియాన్ రూ. 84,493 కు లభిస్తుంది. దీంతో రూ. 1,184 ఆదా అవుతుంది. 125 కార్బన్ ఫైబర్‌పై రూ.2000, 150 సింగిల్ డిస్క్, 150 ట్విన్ డిస్క్‌పై రూ.3000 ఆదా చేసుకోవచ్చు. మీ ప్రాంతంలో కూడా తగ్గింపుల గురించి తెలుసుకోవాలంటే దగ్గరలోని షోరూమ్‌ను సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 2, 2025, 13:00 [IST]
English summary
Bajaj pulsar crossed 2 crore sales milestone and offers special discount on selected models
Read more on: #bajaj #bajaj pulsar #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+