ఇది చాలామందికి తెలియదు.. ఈ బజాజ్ పల్సర్ ఇక మార్కెట్‌లో కనిపించదు!
బజాజ్ పల్సర్ పేరు చెబితే, బైకు ప్రేమికుల గుండెదడిగా మోగుతూనే ఉంది. 125సీసీ నుంచి 400సీసీ వరకు స్టాండర్డ్, P, N, NS, RS వంటి అనేక వేరియంట్‌లతో పల్సర్ పేరే ఒక సింబల్ అయింది. శక్తివంతమైన ఇంజిన్, స్పోర్టీ డిజైన్, అందుబాటు ధర.. ఇవన్నీ కలిపి పల్సర్‌ను యువత హార్ట్‌థ్రోబ్‌గా నిలిపాయి. అయితే కంపెనీ తాజాగా పల్సర్‌కు చెందిన ఒక వేరియంట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. పల్సర్ N150 ని నిలిపివేసింది. యువతను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో వచ్చిన ఈ మోడల్ అంతగా ఆదరణ పొందలేదు. ఇతర పల్సర్ మోడళ్లతో పోల్చితే, ఈ బైక్‌కి మార్కెట్‌లో సరైన స్పందన రాలేదు. అమ్మకాలు నిరాశపరిచాయి. దీంతో, ప్రారంభించిన రెండు సంవత్సరాలకే, బజాజ్ N150ను తాత్కాలికంగా నిలిపివేసింది.కంపెనీ యథాతథంగా కొనసాగించడం వల్ల మార్కెట్‌లో కలిగే నష్టాన్ని గమనించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పల్సర్ P150లో వాడిన ఇంజిన్‌ను, పల్సర్ N160 స్టైలింగ్‌తో కలిపి మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఈ మోడల్ పూర్తి స్థాయిలో 200సీసీ లోపు పల్సర్ లైనప్‌కు ఒక కొత్త ఊపిరి నింపుతుందని ఆశించినప్పటికి అది కుదరలేదు. బజాజ్‌కు పల్సర్ అన్న పేరు ఒక్కటే చాలా ఉంది. సంవత్సరాలుగా యువత గుండెల్లో ఈ బ్రాండ్ అగ్రస్థానంలో ఉంది. అయితే, ప్రతి ప్రయోగం విజయవంతం అవుతుందా? అన్నదానికి తాజా ఉదాహరణే పల్సర్ N150.

దీన్ని ప్రారంభించిన రెండు సంవత్సరాలకే కంపెనీ సైలెంట్‌గా వెనక్కి తీసుకుంది. ఒక్క ప్రకటన కూడా చేయకుండా, బజాజ్ తన అధికారిక వెబ్‌సైట్ నుండి ఈ మోడల్‌ను తీసేయడం గమనార్హం. అంటే, సంస్థ ఈ మోడల్‌ను కొనసాగించలేదన్న సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. N150ను కంపెనీ 2023 చివరిలో పునరుద్ధరించిన 200cc కింద లైనప్‌లో భాగంగా విడుదల చేసింది. రూ.1.18 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చింది.
ఈ మోటార్‌సైకిల్, యువతను టార్గెట్ చేస్తూ, స్పోర్టీ డిజైన్, డ్యూయల్ టోన్ థీమ్, బలమైన బాడీ లైన్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అంతే కాదు, బ్లూటూత్ కనెక్టివిటీతో డిజిటల్ కన్సోల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, LED DRLs, ఆకర్షణీయ బాడీ ప్యానెల్స్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ టాప్ వేరియంట్‌కి ధరను రూ.1.25 లక్షలు నుంచి రూ.1.31 లక్షల వరకు నిర్ణయించారు.

ఇంజిన్ పరంగా చూస్తే, ఇది 149 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ మోటార్ 14.3 bhp శక్తి, 13.5 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా ఇది మృదువైన గేర్ షిఫ్టింగ్‌ను అందిస్తుంది. సస్పెన్షన్ అంశాల్లో ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్ ఉన్నాయి, ఇది రైడ్ కంఫర్ట్‌ను మెరుగుపరుస్తుంది.
బ్రేకింగ్ కోసం, వెనుక డ్రమ్ బ్రేక్ లేదా డిస్క్ బ్రేక్‌తో కూడిన సింగిల్-ఛానల్ ABS వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పల్సర్ NS400Z ఎట్టకేలకు భారత్‌లో ఇటీవల అధికారికంగా లాంచ్ అయింది. అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన పల్సర్ మోడల్‌గా దూసుకొస్తున్న ఈ బైక్ స్ట్రీట్‌ఫైటర్ సెగ్మెంట్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్గా నిలిచింది. దీని ధర కేవలం రూ. 1.92 లక్షల (ఎక్స్-షోరూమ్).

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








