2.7 సెకన్లలో సున్నా నుంచి 60 కి.మీలు! పల్సర్ అంటే ఇదే బ్రదర్! శక్తివంతమైన కొత్త మోడల్ లాంచ్

ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భారతదేశంలో టూవీలర్ వాడకం ఎక్కువగా ఉంటుంది. దేశంలో 70 శాతానికి పైగా టూవీలర్ కలిగి ఉంటారు. తమ రోజువారి అవసరాల కోసం ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు తయారీదారులు కూడా పోటా పోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ బజాజ్ ఆటో (Bajaj Auto) యువతను ఆకట్టుకునేలా శక్తివంతమైన పల్సర్ NS400Z (pulsar NS400Z)ను విడుదల చేసింది. బజాజ్ బ్రాండ్‌కు స్థాయిని తీసుకువచ్చిన పల్సర్ సిరీస్‌లో ఇది ఇప్పటి వరకు వచ్చిన అత్యంత శక్తివంతమైన మోడల్. మాసివ్ లుక్స్, అగ్రెసివ్ స్టాన్స్‌తో పాటు తాజా టెక్నాలజీ కలిగిన ఈ బైక్‌కి కంపెనీ రూ. 1.92 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను నిర్ణయించింది.

డిజైన్ పరంగా చూస్తే, NS సిరీస్‌కు చుట్టూ తిరిగే బాడీ లైన్లు, శార్ప్ ఎడ్జెస్, మస్కులర్ ట్యాంక్ డిజైన్‌ను కొనసాగిస్తూ, కొత్త మోడల్‌లో రెట్రోఫిట్‌డ్ ఎలిమెంట్స్ చేరాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రైడింగ్ మోడ్‌లు, ఇంకా మెటాలిక్ ఫినిష్ వంటివి దీనికి కొత్తగా అందించబడ్డాయి. ముఖ్యమైన విషయం మెకానికల్ అప్‌డేట్స్. ఇందులో 373cc ఇంజిన్ ఆధారంగా, మెరుగైన థ్రాట్‌ల్ రెస్పాన్స్, ఇంజిన్ రిఫైన్మెంట్, బ్లాక్‌డ్-అవుట్ ఎగ్జాస్ట్ ట్యూనింగ్ మార్పులు వచ్చాయి.

Bajaj Pulsar Ns400 Z Launched

ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ చానెల్ ABS వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో భాగమయ్యాయి. ఇందులో వినియోగించిన 373cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్, మునుపటి జనరేషన్ మాదిరిగానే స్ట్రక్చర్ పరంగా ఉంటూ, పనితీరులో మాత్రం బాగా అభివృద్ధి చెందింది. ముందు 9000 rpm వద్ద 40 PS పవర్‌ను ఉత్పత్తి చేసే ఇంజిన్‌ ఇప్పుడు 43 PS వరకు వెళ్లగలగడం విశేషం.

టార్క్ విషయానికొస్తే, అది 35 Nm వద్ద స్థిరంగా ఉండగా, రిఫైన్డ్ ట్యూనింగ్ కారణంగా యాక్సిలరేషన్ మరింత షార్ప్ అయింది. స్పోర్ట్ మోడ్‌లో, బైక్ ఇప్పుడు 10,700 rpm వరకు రెడ్‌లైన్ కలిగి ఉంది, ఇది మునుపటి వెర్షన్‌ కంటే 1000 rpm ఎక్కువ. ఇక రోడ్, ఆఫ్-రోడ్, రెయిన్ మోడ్‌లలో రెడ్‌లైన్‌ను 10,300 rpm వద్ద లిమిట్ చేశారు. దీనివల్ల వేర్వేరు డ్రైవింగ్ కండిషన్లలో బైక్ యాక్టివ్‌గా స్పందిస్తుంది.

Bajaj Pulsar Ns400 Z

ఈ బైక్ 0 నుండి 60 కిమీ వేగానికి చేరడానికి ఇప్పుడు కేవలం 2.7 సెకన్లే పడుతుంది, ఇది మునుపటి 3.2 సెకన్లతో పోలిస్తే స్పష్టమైన అభివృద్ధి. 0 నుండి 100 కిమీ వేగం ఇప్పుడు 6.4 సెకన్లలో చేరుతుంది, ఇది మునుపటి 7.5 సెకన్ల కంటే దాదాపు 1.1 సెకన్లు త్వరగా వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ కూడా 150 కిమీ/గం నుండి 157 కిమీ/గంటకు పెరిగింది.

ఇవన్నీ చూస్తుంటే, బజాజ్ తన NS400Zను మార్కెట్లో బలమైన పోటీదారుగా దింపుతుందని అర్థం అవుతుంది. తాజా అప్‌డేట్‌లో ఒకవైపు పవర్ పెరిగినప్పటికీ, మైలేజ్ విషయంలో మాత్రం 28 కిమీ/లీటర్‌కు వస్తుందని తెలిపింది. అంటే, ఫ్యూయల్ ఎకానమీతో పాటు పవర్‌ను బ్యాలెన్స్ చేయడంలో బజాజ్ మరోసారి తన నైపుణ్యాన్ని నిరూపించింది. ఇంజిన్ ట్యూనింగ్‌కి తోడుగా కొన్ని చిన్న మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా చేశారు.

Pulsar Ns400 Z Launched With New Updated Features

ముఖ్యంగా రైడింగ్ స్టెబిలిటీపై దృష్టి సారిస్తూ, వెనుక భాగంలో 150 సెక్షన్ స్టీల్ రేడియల్ టైర్, ముందు రేడియల్ టైర్ యూనిట్ అమర్చారు. దీని వల్ల గ్రిప్ మెరుగుపడటమే కాకుండా, ట్రాక్, స్ట్రీట్ పరిస్థితుల్లో కంఫర్ట్ అందించగలగడం పెద్ద ప్లస్. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందుభాగంలో 320 mm డిస్క్, వెనుకభాగంలో 230 mm డిస్క్ అమర్చారు. ఈ రెండు డిస్క్ బ్రేక్స్‌తో పాటు డ్యూయల్-ఛానల్ ABS కూడా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 8, 2025, 16:39 [IST]
English summary
Bajaj pulsar ns400 z launched with new updated features in india details check
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+