మార్కెట్ పై పంజా విసురుతున్న బజాజ్.. రూ.80వేల బైకుతో మార్కెట్‌ను మొత్తం కంట్రోల్ చేయనుందా?

భారత మార్కెట్‌లో 125 సీసీ బైకులకు మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్‌తో కూడిన బైకులు కావాలనుకునే వారికి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ సెగ్మెంట్‌లో అన్ని పెద్ద కంపెనీలు కొత్త బైకులను లాంచ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.

ఇప్పుడు బజాజ్ (Bajaj) కూడా ఈ లిస్టులోకి చేరింది. అయితే, ఇది మామూలు బైక్ కాదు. నమ్మశక్యం కాని తక్కువ ధరలో ఒక కొత్త బైక్‌ను తీసుకురావడానికి బజాజ్ సిద్ధమవుతోంది. అసలు ఈ బైక్ స్పెషల్ ఏంటో తెలుసుకుందాం.

Bajaj to Launch Its Cheapest 125cc Bike

భారత మార్కెట్‌లో 125 సీసీ బైకులకు (125 cc Bikes) కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. అందుకే అన్ని లీడింగ్ కంపెనీలు, 125 సీసీ సెగ్మెంట్‌లో కొత్త బైకులను లాంచ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇందులో బజాజ్ (Bajaj) కంపెనీ కూడా ఉంది.

ప్రస్తుతానికి 125 సీసీ సెగ్మెంట్‌లో బజాజ్ 4 బైకులను సేల్ చేస్తోంది. అవి: బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125), బజాజ్ పల్సర్ ఎన్125 (Bajaj Pulsar N125), బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 (Bajaj Pulsar NS125), బజాజ్ ఫ్రీడం సీఎన్‌జీ 125 (Bajaj Freedom CNG 125).

Bajaj to Launch 125cc Bike

భారత మార్కెట్‌లో ప్రస్తుతానికి బజాజ్ కంపెనీ 125 సీసీ బైకుల స్టార్టింగ్ ప్రైస్ రూ.85,000గా ఉంది. అదే సమయంలో బజాజ్ కంపెనీ 125 సీసీ బైకుల మాక్సిమం ప్రైస్ రూ.1.11 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.

ఈ సిట్యుయేషన్‌లో బజాజ్ కంపెనీ సరికొత్త 125 సీసీ బైక్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా ఇప్పుడు బయటకొస్తున్న సమాచారం చెబుతోంది. ఈ కొత్త ప్రొడక్ట్ బజాజ్ కంపెనీ నుంచి వచ్చే అత్యంత తక్కువ ధర కలిగిన 125 సీసీ బైక్ అవుతుందని కూడా చెబుతున్నారు.

125cc Bike

బహుశా బజాజ్ కంపెనీ కొత్త 125సీసీ బైక్ ప్రారంభ ధర రూ.80,000 స్థాయిలో నిర్ణయించే అవకాశం ఉంది. అదే సమయంలో బజాజ్ కంపెనీ ఈ కొత్త 125 సీసీ బైక్‌ను 2026లో మార్కెట్‌లోకి లాంచ్ చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. భారతదేశంలోని 125 సీసీ సెగ్మెంట్ బైకులకు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. దీని కారణంగా ఈ సెగ్మెంట్‌కు చెందిన బైకులు ప్రతి నెల ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతున్నాయి.

అందుకే బజాజ్ కంపెనీ కంటిన్యూగా ఈ సెగ్మెంట్‌లో కొత్త బైకులను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. దీనిలో భాగంగా గత 2024 జూలై నెలలో బజాజ్ ఫ్రీడం సీఎన్‌జీ 125 (Bajaj Freedom CNG 125) బైక్‌ను లాంచ్ చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ (World's First CNG Bike) కావడం విశేషం.

Bajaj to Launch Its Cheapest 125cc Bike

ఈ సిరీస్‌లోనే 125 సీసీ సెగ్మెంట్‌లో మరో కొత్త బైక్‌ను లాంచ్ చేయడానికి బజాజ్ కంపెనీ రెడీ అవుతున్నట్లుగా ఇప్పుడు బయటకొస్తున్న ఇన్ఫర్మేషన్ చెబుతోంది. ఇది చాలా తక్కువ ధరలో మార్కెట్‌లోకి వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నందున, భారత కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ పొందే ఛాన్సెస్ ఉన్నాయి.

అయితే, బజాజ్ కంపెనీ కొత్త 125 సీసీ బైక్ ఇంజిన్, ఫీచర్స్, టెక్నికల్ డీటెయిల్స్ గురించి ఎలాంటి సమాచారం ఇప్పుడు బయటపడలేదు. రాబోయే నెలల్లో అవి ఒక్కొక్కటిగా బయటకొస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: బజాజ్ 125 సీసీ సెగ్మెంట్‌లో కొత్త బైక్‌ను తక్కువ ధరలో లాంచ్ చేయడం చాలా తెలివైన ఎత్తుగడ. ఇది పల్సర్ బ్రాండ్‌కు కొత్త బూస్ట్ ఇస్తుంది. అలాగే, 125 సీసీ మార్కెట్‌లో బజాజ్ తన డామినెన్స్‌ను మరింత పెంచుకునే అవకాశం ఉంది. కస్టమర్లకు కూడా తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ బైక్ దొరుకుతుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, June 9, 2025, 9:20 [IST]
English summary
Bajaj to launch its cheapest 125cc bike could it be priced at rs 80 000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+