మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్... ఫీచర్లతో ఫిదా చేసేలా ఉంది... ధర కూడా తక్కువే!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఖర్చులు కలిసి వస్తాయని చాలా మంది ఈవీలవైపు మొగ్గు చూపుతున్నారు. టూ-వీలర్ సెగ్మెంట్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాల భారత రోడ్లపై జోరుగా పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అనేక వాహన తయారీ సంస్థలు కొత్త మోడళ్లతో సందడి చేస్తున్నాయి. తాజాగా BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ.. LOEV+ పేరుతో ఓ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చింది. పట్టణ వినియోగదారులకు అనువుగా ఉండేందుకు దీన్ని రూపొందించింది. BattRE సంస్థ నుంచి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్- షోరూమ్ ధర రూ.69,999గా ఉంది.

దీనికి అదనంగా హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. దేశంలోని కొన్ని సెలెక్ట్ డీలర్‌షిప్ కేంద్రాల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. ఈ LOEV+ స్కూటర్ 2kWh అమరాన్ బ్యాటరీతో ఉంటుంది. ఇది 13-amp ఛార్జర్‌తో వస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్ పొందింది. కేవలం 2 గంటల 50 నిమిషాల్లోనే ఈ స్కూటర్ ఫుల్‌ఛార్జ్ అవుతుంది.

LOEV Electric scooter by BattRE Electric Mobility

BattRE సంస్థ బ్యాటరీ, ఛార్జర్ పై 3- ఏళ్ల వారంటీ అందిస్తోంది. ఈ స్కూటర్ 3 రైడింగ్ మోడ్స్‌తో పని చేస్తుంది. ఇందులోని ఎకో మోడ్... టాప్ స్పీడ్ 35 kmphగా ఉంటుంది. ఇది 90 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. ఇక కంఫర్ట్ మోడ్... టాప్ స్పీడ్ 48 kmphగా ఉంటుంది. ఇది 75 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.

ఇక దీంట్లో స్పోర్ట్స్ మోడ్... టాప్ స్పీడ్ 60 kmph గా ఉంటూ.. ఇది 60 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ కంబైన్డ్ డిస్క్- బ్రేక్ సిస్టంతో ఉంటుంది. ఇది 180 మి.మీ.ల గ్రౌండ్ క్లియరెన్స్ అందిస్తుంది. యాక్సిడెంటల్ యాక్సిలరేషన్ కోసం పార్కింగ్ స్విచ్ ఉంటుంది. అలాగే saree guard పిలియన్ రైడర్స్(డ్రైవర్ వెనకాల కూర్చుండేవారు)కు సేఫ్టీ అందిస్తుంది.

అలాగే ఇందులో రైడర్ అసిస్టెన్స్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఫుల్లీ CAN-enabled communication system ఉంటుంది. ఇది రైడ్ స్టెబిలిటీ, ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తుంది. ఇందులోని స్మార్ట్ కనెక్టివిటీ సిస్టంలో ఇన్‌ఫర్మేటివ్ డిజిటల్ స్పీడోమీటర్, displaying distance to empty (DTE), స్టేట్ ఆఫ్ ఛార్జ్(SoC) రైడర్స్‌కు మెరుగైన జర్నీ అందిస్తుంది.

ఈ LOEV+ స్కూటర్ డిజైన్ స్పోర్టీనెస్, మినిమలిజంతో వస్తుంది. ఇందులో 12- అంగుళాల అలాయ్ వీల్స్, LED డ్యూయల్ ల్యాంప్స్... దీని విజిబిలిటీని మెరుగుపరుస్తాయి. అలాగే ఈ స్కూటర్ Starlight Blue, Stormy Grey, Ice Blue, Midnight Black, and Pearl White అనే ఐదు ప్రీమియం కలర్స్‌లో వస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 18, 2025, 19:08 [IST]
English summary
Battre loev plus electric scooter launched at rs 69999 for urban urban commuting check features and
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+