Best Scooters in Market: ఈ కొత్త స్కూటర్లన్నీ కిర్రాక్ ఉన్నాయ్.. వీటిలో ఏది కొంటే బెటర్?

రోజువారీ అవసరాలకు టూ-వీలర్ వాడకం ఈరోజుల్లో తప్పనిసరి అయిపోయింది. పల్లెల నుంచి పట్టణాల వరకు టూ వీలర్ లేకపోతే బతుకు బండి సాగని పరిస్థతి. బైకుల కంటే స్కూటర్ల వాడకం తేలిగ్గా ఉంటుంది. ఇందులో గేర్లు లేకపోవడం వల్ల పురుషులే కాకుండా స్త్రీలు కూడా వీటిని ఎక్కువగా వాడుతుంటారు. అందుకే.. ఏళ్ల తరబడి స్కూటర్లు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. మీరు ఓ పవర్‌ఫుల్ స్కూటర్ కొనేందుకు ఎదురు చూస్తున్నారా? అయితే.. మార్కెట్లో ఇప్పుడు హోండా యాక్టివా 125, హీరో జూమ్ 125, సుజుకీ యాక్సెస్ 125 వంటి వివిధ బ్రాండ్ల స్కూటర్లు మంచి ఛాయిస్‌గా ఉన్నాయి. చలో.. మరి ఈ స్కూటర్లలో ఫీచర్లు, ధర, స్పెసిఫికేషన్స్ వంటి వివరాలు చూసేద్దాం.

హోండా యాక్టివా 125: భారత్‌లో బాగా పాపులర్ స్కూటర్ అయిన హోండా యాక్టివా 125 స్కూటర్ ధర(ఎక్స్- షోరూమ్) రూ.94,442 నుంచి రూ.97,146 వద్ద ఉంది. ఇది Pearl Igneous Black, Pearl Siren Blue సహా వివిధ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇది 123.92 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ స్కూటర్ 47 kmpl మైలేజీ అందించగలదు.

Best 125 cc Scooters Honda Activa

దీంట్లో TFT కన్సోల్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, ఐడిల్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది డిస్క్/డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 110 కిలోల బరువుతో, 5.3లీటర్ల ప్యూయల్ ట్యాంక్ సామర్థ్యంతో ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇది స్కూటర్‌ మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

హీరో జూమ్ 125: దిగ్గజ సంస్థ హీరో నుంచి వచ్చిన ఈ జూమ్ 125 స్కూటర్ రూ.86,900 ఎక్స్-షోరూమ్ ధర వద్ద అందుబాటులో ఉంది. ఇది 124.6 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో ఉండి.. 45 kmpl మైలేజీ అందిస్తుంది. ఇది Metallic Turbo Blue, Matte Storm Grey సహా వివిధ రంగుల్లో ఉంటుంది.

Best 125 cc Scooter Hero Xoom

ఈ హీరో జూమ్ 125 స్కూటర్ లో LCD ఇన్స్టుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, అండర్- సీట్ స్టోరేజ్ లైట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది డిస్క్, డ్రమ్ బ్రేక్ ఆప్షన్లతో వస్తుంది. హీరో నుంచి ఈ స్కూటర్‌ ప్రస్తుతం ఎక్కువగా సేల్స్‌ని రాబడుతోంది. దీనిని కొత్త వెర్షన్‌లో తీసుకువస్తూ హీరో మోటోకార్ప్ ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

సుజుకీ యాక్సెస్ 125: పాపులర్ సంస్థ సుజుకీ నుంచి వచ్చిన ఈ స్కూటర్ ఎక్స్- షోరూమ్ ధర రూ.81,700 గా ఉంది. ఇది 125 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 45 kmpl మైలేజీ అందిస్తుంది. ఇది Metallic Matte Stellar Blue, Pearl Grey White, Metallic Matte Black, Solid Ice Green, Pearl Shiny Beige రంగుల్లో అందుబాటులో ఉంది.

Best 125 cc Scooter Suzuki Access

ఈ కొత్త సుజుకీ యాక్సెస్ 125 స్కూటర్‌లో డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్- బై- టర్న్ నేవిగేషన్ వంటి వివిధ ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ విషయానికి వస్తే.. ఇది ఫ్రంట్ డిస్క్, రియర్ వైపున డ్రమ్ బ్రేక్స్‌తో ఉంటుంది. ఈ స్కూటర్ అలాయ్ వీల్స్‌తో వస్తుంది. ఇది హోండా యాక్టివాకు గట్టి పోటీని ఇస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, February 3, 2025, 11:55 [IST]
English summary
Best 125 cc scooters in india honda activa hero xoom and suzuki access scooters
Read more on: #auto news #scooter #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+